Don't Miss!
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
Pogaru collections పర్వాలేదనిపించిన ధృవ సర్జా.. మొదటి రోజు ఎంత కొల్లగొట్టిందంటే?
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద గట్టి పోరు నడుస్తోంది. ఆల్రెడీ గత వారంలో వచ్చిన ఉప్పెన చిత్రం ఇంకా దూసుకుపోతూనే ఉంది. నిన్న మొత్తంగా నాలుగైదు చిత్రాలు విడుదలయ్యాయి. అందులో నాంది, చక్ర, కపటధారి, పొగరు అనే చిత్రాలకు కాస్త పర్వాలేదనిపించేలా వసూళ్లు వచ్చాయి. టాక్ పరంగా నాంది సినిమాకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ఇక మిగతా సినిమాల్లో పొగరు కమర్షియల్‌గా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.
మాస్ సినిమాలతో రచ్చ..
ప్రస్తుతం ఇండియన్ స్క్రీన్ మీద మాస్ సినిమాల హవా కొనసాగుతోంది. కేజీయఫ్ సినిమాతో కన్నడ ఇండస్ట్రీపై అందరి దృష్టి చేసింది. కేజీయఫ్ లాంటి మాస్ సినిమా బాక్సాఫీస్ మీద దాడి చేయడంతో అందరూ అదే బాట పట్టారు. అందుకే ఇప్పుడు కన్నడలో వచ్చిన ధృవ సర్జా సినిమా కమర్షియల్ అంశాలతో తెరకెక్కించడంతో ఇక్కడ క్లిక్ అయింది.
రష్మిక ప్లస్..
పొగరు సినిమాపై కరాబు అనే పాట మంచి హైప్‌ను క్రియేట్ చేసింది. దాంతో పాటు ఇప్పుడు రష్మిక మందాన్నకు తెలుగులో భారీ ఫాలోయింగ్ ఉంది. ఆమె క్రేజ్ వల్లే తెలుగు ప్రేక్షకులు పొగరు సినిమాకు కలెక్షన్లు వస్తున్నాయి. అలా ఇప్పుడు పొగరు సినిమా మొదటి రోజు బాగానే రాబట్టింది. టాక్ కూడా పర్వాలేదని రావడంతో కలెక్షన్లు కూడా ఓ మాదిరిగా వచ్చాయి.
ఏరియాల వారిగా..
నైజాం ఏరియాలో 29 లక్షలు, సీడెడ్‌లో 17లక్షలు, ఉత్తరాంధ్రలో 12 లక్షలు, ఈస్ట్ 4.3లక్షలు, వెస్ట్ 3 లక్షలు, గుంటూరు 4.2లక్షలు, కృష్ణా 3.9లక్షలు, నెల్లూరులో 2.2లక్షల కొల్లగొట్టింది. మొత్తానికి విడుదలైన ప్రతీ చోటా పొగరు బాగానే వసూళ్లను రాబట్టింది.
మొత్తంగా ఎంతంటే?
నైజాం, సీడెడ్ అని ఇలా కాకుండా విడుదలైన ప్రతీ సెంటర్లో పొగరు సినిమా మంచి టాక్ సంపాదించుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పొగరు సినిమా 1.35 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. మొత్తంగా చూసుకుంటే 76 లక్షలను కొల్లగొట్టి పర్వాలేదనిపించింది.
పోటీల్లో నాలుగు..
ఒకే సారిగా నాలుగు చిత్రాలు రావడం, ఆల్రెడీ ఉప్పెన బ్లాక్ బస్టర్ అవ్వడంతో అన్నింట్లో కలెక్షన్లను గండిపడింది. అలా ఏ ఒక్కసినిమాకు కూడా చెప్పుకోదగ్గ ఓపెనింగ్స్ రాలేదు. పైగా టాక్ కూడా ఏమంత గొప్పగా రాకపోవడంతో కలెక్షన్లు కాస్త డల్లుగా ఉన్నాయి.
దీర్ఘాలోచనలో
పడ్డ
తార..
అనూ
సితార
పిక్స్
వైరల్