Dhurandhar 2 Box Office: ‘ధురంధర్ 2' భారీ ఓపెనింగ్స్.. బాహుబలి, పుష్ప 2 రికార్డ్స్ బ్రేక్ అయినట్లేనా?
Dhurandhar 2 Box Office: పాన్ ఇండియా రేంజ్‌లో నయా రికార్డులు క్రియేట్ చేసిన 'ధురంధర్' సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న సినిమా 'ధురంధర్: ది రివేంజ్' ( Dhurandhar 2). స్టార్ హీరోలు రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకి ఆదిత్య ధార్ దర్శకత్వంతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు. జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే ఈ సినిమాను నిర్మించారు. షాష్వత్ సచ్‌దేవ్ సంగీతం సమకూర్చారు.
ఇప్పటికే ధురంధర్ 2 సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్ భారీ అంచనాలు నెలకొల్పాయి. ఈ నేపథ్యంలో మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా ధురంధర్ 2 విడుదల కాబోతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ధురంధర్ 2 మూవీ అడ్వాన్స్ బుకింగ్ రెస్పాన్స్ ఎలా ఉంది? ముఖ్యంగా ఓవర్సీస్ రణ్ వీర్ సింగ్ సినిమా క్రేజ్ ఎలా ఉంది? ఇప్పటి వరకు ఎన్ని కోట్లు వసూలు చేసిందనే వివరాల్లోకి వెళితే..

పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమైన 'ధురంధర్2' సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతోంది. రణ్ వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రికార్డు స్థాయి వసూళ్లను నమోదు చేస్తోంది. ట్రేడ్ వర్గాల ప్రకారం.. ఈ సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్స్ విషయంలో ఇండియన్ సినిమా చరిత్రలోనే టాప్ రికార్డులను ఛాలెంజ్ చేసే స్థాయిలో ఉందని అంచనా వేస్తున్నారు.
ట్రెడ్ వర్గాల అడ్వాన్స్ బుకింగ్ లెక్కలు చూస్తే.. మార్చి 18న ప్రీమియర్ షోల ద్వారా ఈ సినిమాకు రూ. 47 కోట్ల గ్రాస్ వసూలు చేసే అవకాశముంది. దీని బట్టి చూస్తే.. సినిమాకు రిలీజ్‌కు ముందు వస్తున్న భారీ రెస్పాన్స్‌ను స్పష్టంగా చూపిస్తోంది. ఇక డే 1 అడ్వాన్స్ బుకింగ్స్ రూ. 38.57కోట్లకు పైగా చేరుకున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 7 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడవగా, దాదాపు 19,000కి పైగా షోలు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా 'ధురంధర్ 2'కు భారీ డిమాండ్ కనిపిస్తోంది. ఓవర్సీర్ ప్రీ-సేల్స్ సుమారు రూ. 75 కోట్లకు పైగా నమోదు కావడం విశేషం. ఈ లెక్కలన్నింటిని కలిపితే.. ఓపెనింగ్ వీకెండ్‌కు ముందు నుంచే ఈ సినిమా మొత్తం ప్రీ-సేల్స్ రూ. 162 కోట్లకు పైగా కలెక్ట్ చేసే అవకాశముంది.
ధురంధర్ మూవీకి సౌత్ ఇండియాలో కూడా భారీ రెస్పాన్స్ వస్తుంది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. తెలుగు లో రూ. 79 లక్షలు, తమిళంలో రూ. 35 లక్షలు, మలయాళం, కన్నడలో కూడా గణనీయమైన బుకింగ్స్ నమోదయ్యాయి. ఇది 'ధురంధర్ 2'కు పాన్ ఇండియా రేంజ్‌లో ఉన్న క్రేజ్‌ను మరోసారి రుజువు చేస్తోంది. ప్రత్యేకంగా ఢిల్లీ,ముంబై వంటి మెట్రో నగరాల్లో టికెట్ డిమాండ్ ఎక్కువగా ఉండటం గమనార్హం. అడ్వాన్స్ బుకింగ్స్ స్పీడ్‌ను చూస్తుంటే.. ఈ సినిమా మొదటి రోజే భారీ ఓపెనింగ్ సాధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు.
అయితే.. ఈ లెక్కన చూస్తే పుష్ప 2 రికార్డ్స్ ను బ్రేక్ చేయడం కష్టమే అని చెప్పాలి. పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 294 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టింది. ఇలా ఇండియన్ సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్ సాధించిన సినిమాగా నిలిచింది. తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీ, ఓవర్సీస్ మార్కెట్లలో కూడా ఈ సినిమా భారీ స్పందన అందుకుంది. ఈ లెక్కన చూస్తే.. 'ధురంధర్ 2' ఈ రికార్డును బ్రేక్ చేయడం కష్టమే అని చెప్పాలి. ఇప్పుడు అసలు పరీక్ష మాత్రం విడుదల తర్వాత ప్రేక్షకుల స్పందన. అదే ఈ సినిమాను నిజంగా ఇండస్ట్రీ హిట్‌గా నిలబెడుతుందా లేదా అనేది వేచిచూడాలి.


Click it and Unblock the Notifications


















