Dhurandhar 2 Advance Booking: ధురంధర్ 2 బాక్సాఫీస్ విధ్వంసం.. రిలీజ్‌కు ముందే ఎన్ని కోట్లంటే?
2026లో భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మూవీ ధురంధర్ 2. రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ గతేడాది కలెక్షన్ల వర్షం కురిపించింది. ఏకంగా 1300 కోట్లకు పైగా వసూళ్లతో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో టాప్ 5లో నిలిచింది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్‌గా ధురంధర్ : ది రెవెంజ్ (ధురంధర్ 2)ను తెరకెక్కించారు. రంజాన్, ఉగాది పర్వదినాలను పురస్కరించుకుని మార్చి 19న ధురంధర్ 2ను వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్‌పై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండేలు సంయుక్తంగా ధురంధర్ 2 చిత్రాన్ని నిర్మించారు. ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు. రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్‌లు హీరో హీరోయిన్‌లుగా నటించారు. అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, రాకేష్ బేడీ, సౌమ్య టాండన్, గౌరవ్ గెరా, మానవ్ గోహిల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. వికాస్ నౌలఖ సినిమాటోగ్రాఫర్‌గా, శివకుమార్ వి పానికర్ ఎడిటర్‌గా సేవలందించారు. శాశ్వత్ సచ్‌దేవ్ సంగీత దర్శకత్వం వహించారు. తొలి భాగం కేవలం ఒక్క హిందీలో మాత్రమే విడుదల కాగా.. సెకండ్ పార్ట్ విషయంలో అలాంటి తప్పు చేయకుండా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ధురంధర్ 2 వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు నిర్మాతలు.

దురంధర్ 2 బడ్జెట్ & ప్రీ రిలీజ్ బిజినెస్
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ధురంధర్ 2 మూవీకి 475 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు (మొదటి భాగంతో కలిపి) ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ధురంధర్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన నేపథ్యంలో ఈ మూవీ సీక్వెన్స్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగినట్లుగానే ధురంధర్ 2 థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దాదాపు 150 కోట్ల రూపాయలు వెచ్చించి దక్కించుకుంది. అలాగే శాటిలైట్ రైట్స్ 50 కోట్ల రూపాయలకు, మ్యూజిక్ రైట్స్ 45 కోట్ల రూపాయల మేర మొత్తంగా ధురంధర్ 2 ఇప్పటి వరకు 250 కోట్ల రూపాయల నాన్ థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
ధురంధర్ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్
మార్చి 18వ తేదీ రాత్రి 11.53 గంటలకు భారతదేశంలో ధురంధర్ 2 ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు. దాంతో మార్చి 7వ తేదీ నుంచి భారత్‌లో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేశారు. స్టాండర్డ్ టికెట్స్ ధర 290 రూపాయల నుంచి 350 రూపాయల మధ్యలో... ప్రీమియం రిక్లెయినర్స్ ధరను 1400 రూపాయలుగా నిర్ణయించారు. బుకింగ్ ఓపెన్ అయిన క్షణాల్లోనే ధురంధర్ 2 మూవీ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడై.. రిలీజ్‌కు ముందే భారీ కలెక్షన్స్‌ను రాబడుతున్నాడు రణ్‌వీర్ సింగ్. హిందీలో 6528 షోలకు గాను 1,14,666 టికెట్స్ అమ్ముడవ్వగా.. 7.82 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇప్పటి వరకు ఇండియాలో ప్రీమియర్స్‌కు అడ్వాన్స్ బుకింగ్‌లో తెలుగులో 4.8 లక్షల రూపాయలు, తమిళంలో 4.3 లక్షల రూపాయలు, మలయాళంలో 34 వేల రూపాయలు, కన్నడంలో 26 వేల రూపాయలు చొప్పున దాదాపు 8 కోట్ల రూపాయలు రాబట్టాడు రణ్‌వీర్ సింగ్. ఇప్పటి వరకు మహారాష్ట్రలో 3 కోట్ల రూపాయలు, ఢిల్లీ అండ్ ఎన్‌సీఆర్‌లో 2.3 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 1.61 కోట్ల రూపాయలు, తెలంగాణలో 88 లక్షల రూపాయలు, గుజరాత్‌తో 84 లక్షల రూపాయలు చొప్పున వసూలు చేసింది.
అటు ఓవర్సీస్ ప్రీమియర్స్‌లో ధురంధర్ 2 కొత్త రికార్డులు సృష్టిస్తోంది. అమెరికాలో మార్చి 18వ తేదీన ప్రదర్శించనున్న ప్రీమియర్స్‌కు సంబంధించి 551 సెంటర్స్‌లో 1002 షోలకు గాను 33,348 టికెట్స్ అమ్ముడయ్యాయి. తద్వారా 5,37,660 డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు 4.95 కోట్ల రూపాయలు) రాబట్టినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. తద్వారా ధురంధర్ 2 ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్‌లో ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా 13 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ ట్రెండ్‌ను బట్టి చూస్తే ధురంధర్ 2కు ఇండియాలో ప్రీమియర్స్ + డే 1 కలిపి ఓపెనింగ్స్ 100 కోట్లకు పైగా దాటే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











