Dhurandhar 2 Advance Booking: రికార్డుల్ని తిరగరాస్తోన్న ధురంధర్ 2 బుకింగ్... రణ్‌వీర్ మూవీకి ఎన్ని కోట్లంటే?

ఆదిత్య ధర్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ నటిస్తోన్న మూవీ ధురంధర్: ది రివెంజ్ (ధురంధర్ 2). రంజాన్, గుడిపర్వా, ఉగాది పర్వదినాలను పురస్కరించుకుని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో మార్చి 19న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. గతేడాది రిలీజైన ధురంధర్ మొదటి భాగం సంచలన విజయాన్ని అందుకోవడంతో పాటు ఏకంగా 1300 కోట్లకు పైగా వసూళ్లను సాధించడంతో సీక్వెల్‌‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగినట్లుగానే ధురంధర్ 2 అడ్వాన్స్ బుకింగ్‌లో దుమ్మురేపుతోంది. ప్రీమియర్స్‌కు బుకింగ్ ఓపెన్ కాగా.. ఉత్తరాదితో పాటు దక్షిణాదిలోనూ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.

Also Read
'అలా నన్ను లొంగదీసుకుని.. రాత్రి 9 దాటితే.. ఆ కోరిక తీర్చుకోవాల్సిందే’
'అలా నన్ను లొంగదీసుకుని.. రాత్రి 9 దాటితే.. ఆ కోరిక తీర్చుకోవాల్సిందే’

జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్‌పై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే‌లు సంయుక్తంగా ధురంధర్ 2 చిత్రాన్ని నిర్మించారు. ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు. రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్‌లు హీరో హీరోయిన్‌లుగా నటించారు. అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, రాకేష్ బేడీ, సౌమ్య టాండన్, గౌరవ్ గెరా, మానవ్ గోహిల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. వికాస్ నౌలఖ సినిమాటోగ్రాఫర్‌గా, శివకుమార్ వి పానికర్ ఎడిటర్‌గా సేవలందించారు. శాశ్వత్ సచ్‌దేవ్ సంగీత దర్శకత్వం వహించారు.

Dhurandhar 2 Advance Booking Collection Ranveer Singh s Film crosses 30 Crore mile stone For Paid Premieres

దురంధర్ 2 బడ్జెట్ & ప్రీ రిలీజ్ బిజినెస్
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ధురంధర్ 2 మూవీకి 475 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు (మొదటి భాగంతో కలిపి) ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ధురంధర్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన నేపథ్యంలో ఈ మూవీ సీక్వెన్స్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగినట్లుగానే ధురంధర్ 2 థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను జియో హాట్‌స్టార్ దాదాపు 150 కోట్ల రూపాయలు వెచ్చించి దక్కించుకుంది. అలాగే శాటిలైట్ రైట్స్ 50 కోట్ల రూపాయలకు, మ్యూజిక్ రైట్స్ 45 కోట్ల రూపాయల మేర మొత్తంగా ధురంధర్ 2 ఇప్పటి వరకు 250 కోట్ల రూపాయల నాన్ థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

Recommended For You
ఇంటికి పిలిచి అవమానాలు... 23 రోజులు కొనఊపిరితో నా కోసమే.. తారకరత్న భార్య ఎమోషనల్
ఇంటికి పిలిచి అవమానాలు... 23 రోజులు కొనఊపిరితో నా కోసమే.. తారకరత్న భార్య ఎమోషనల్

దురంధర్ 2 అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్
మార్చి 18న ధురంధర్ 2ను భారత్‌తో పాటు ఓవర్సీస్‌లో భారీగా ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు. మార్చి 7వ తేదీ నుంచి భారత్‌లో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయ్యింది. ఇండియాలో ఇప్పటి వరకు 8,371షోలకు గాను 3,56,817 టికెట్లు అమ్ముడయ్యాయి. తద్వారా అడ్వాన్స్ బుకింగ్ కింద మనదేశంలో 19 కోట్ల రూపాయలు వసూలు చేశాడు రణ్‌వీర్. బ్లాక్ చేసిన టికెట్లతో కలిపి ఈ మొత్తం 24 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

You May Also Like
'చేతకాక మా మీద తోసేస్తున్నారు... చిరంజీవి మూవీ కోసం తలవంచుతున్నా’
'చేతకాక మా మీద తోసేస్తున్నారు... చిరంజీవి మూవీ కోసం తలవంచుతున్నా’

హిందీ వెర్షన్‌లో 7548 షోలకు గాను 21.62 కోట్ల రూపాయలు... తెలుగు వెర్షన్‌లో 84 షోలకు గాను 22.73 లక్షల రూపాయలు... తమిళంలో 179 షోలకు గాను 32 లక్షల రూపాయలు... మలయాళంలో 58 షోలకు గాను 3.53 లక్షల రూపాయలు, కన్నడంలో 20 షోలకు గాను 1.94 లక్షల రూపాయలను రణ్‌వీర్ సింగ్ రాబట్టినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. తద్వారా బాలీవుడ్‌‌లో ప్రీమియర్స్ కలెక్షన్స్‌లో టాప్‌లో ఉన్న స్త్రీ2 రికార్డును ధురంధర్ 2 బద్ధలు కొట్టింది.

'మా రిలేషన్‌ని చెడగొట్టాలని కుట్ర... నా బాయ్‌ఫ్రెండ్‌‌ని ఆమె అలా ట్రాప్’
'మా రిలేషన్‌ని చెడగొట్టాలని కుట్ర... నా బాయ్‌ఫ్రెండ్‌‌ని ఆమె అలా ట్రాప్’

అటు ఓవర్సీస్‌లోనూ ధురంధర్ 2 విధ్వంసం కొనసాగుతోంది. నార్త్ అమెరియా విషయానికి వస్తే ఒక్క అమెరికాలోనే 671 సెంటర్స్‌లో 1589 షోలకు గాను 54,822 టికెట్లు అమ్ముడై.. 8,74,490 డాలర్లు (భారత కరెన్సీలో 8.07 కోట్ల రూపాయలు) రాబట్టింది. అయితే ధురంధర్ 2 నార్త్ అమెరికాలో 1 మిలియన్ టార్గెట్ కొట్టేసినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ట్రెండ్‌ను బట్టి ఈ జోరు ఇలాగే కొనసాగితే ఫస్ట్ వీకెండ్‌లో ధురంధర్ 2 నార్త్ అమెరికాలో 2.16 మిలియన్ డాలర్లు ( దాదాపు 20 కోట్ల రూపాయలు) రాబడుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఇప్పటి వరకు ధురంధర్ 2 మూవీ అడ్వాన్స్ బుకింగ్స్‌లో వరల్డ్ వైడ్‌గా 30 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. రిలీజ్‌కు మరో వారం రోజులు సమయం ఉండటంతో రణ్‌వీర్ సింగ్ ఎన్ని రికార్డులు బద్ధలు కొడతాడోనని ఉత్కంఠ నెలకొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X