Dhurandhar 2 Advance Booking: అడ్వాన్స్ బుకింగ్‌లో ‘ధురంధర్ 2' దూకుడు.. పుష్ప2 రికార్డుపై రణ్ వీర్ కన్ను..
Dhurandhar 2 Advance Booking Collections: యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న భారీ యాక్షన్- స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'ధురంధర్ 2: ది రివెంజ్'. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సినిమా విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. ఇంకా థియేటర్లలోకి రాకముందే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీమియర్ షోల ద్వారా భారీ వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది.
ప్రముఖ దర్శకుడు ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాలో రణవీర్ సింగ్‌తో పాటు సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రామ్ పాల్,అక్షయ్ ఖన్నా వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ముఖ్యంగా అర్జున్ రాంపాల్ ఐఎస్ఐ మేజర్ ఇక్బాల్ పాత్రలో ప్రధాన ప్రతినాయకుడిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, యాక్షన్ సన్నివేశాలు, గ్రాండ్ విజువల్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.

ధురంధర్ 2' పెయిడ్ ప్రివ్యూస్ పేరుతో వేస్తోన్న షోలకు ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో టికెట్స్ సేల్ అయ్యాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ యాక్షన్- స్పై యాక్షన్ మూవీ ప్రీమియర్ షోల కోసం ఏకంగా 4.7 లక్షల టికెట్స్ సేల్ అయ్యాయి. దేశవ్యాప్తంగా 8,000కు పైగా షోలలో ఈ అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు కావడం విశేషం. దీంతో రూ.24.4 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రీమియర్ షోస్‌తో అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ అదే జోష్ కంటిన్యూ అవుతోంది. ఇప్పటివరకూ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా దాదాపు రూ.56 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది.
ఓవర్సీస్‌లోనూ...
ఓవర్సీస్‌లోనూ ప్రీమియర్ షోలతో పాటు అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ ధురంధర్ 2 మేనియా కంటిన్యూ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం అమెరికాలో మాత్రమే ఈ సినిమా ప్రీమియర్ షోల కోసం ఇప్పటికే 61,491 టికెట్లు అమ్ముడయ్యాయి. మొత్తం 678 లొకేషన్లలో 1,684 షోల ద్వారా దాదాపు 9,82,374 డాలర్ల (సుమారు 8 కోట్లకు పైగా) అడ్వాన్స్ కలెక్షన్ నమోదైనట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో మొత్తం ఉత్తర అమెరికా ప్రీమియర్ అడ్వాన్స్ బుకింగ్స్ 1.2 మిలియన్ డాలర్స్ మార్క్ దాటినట్టు తెలుస్తోంది.
దీంతో ఇప్పటివరకు ఏ హిందీ సినిమాకీ రాని స్థాయిలో ప్రీమియర్ అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు చేసి కొత్త రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో గతంలో భారీ విజయాన్ని సాధించిన యానిమల్ (Animal) సినిమా రికార్డును కూడా ఈ సినిమా బ్రేక్ చేసినట్టు తెలుస్తోంది. ఓవరాల్‌గా ఇప్పటివరకూ రూ.65 కోట్ల గ్రాస్ అందుకోగా, త్వరలోనే రూ.100 కోట్ల మార్క్ అందుకుంటుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్ పుష్ప 2: ది రూల్ (Pushpa 2) సినిమాపై ధురంధర్ 2 సినిమా రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 294 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టింది. ఇలా ఇండియన్ సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్ సాధించిన సినిమాగా నిలిచింది. తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీ, ఓవర్సీస్ మార్కెట్లలో కూడా ఈ సినిమా భారీ స్పందన అందుకుంది.
అయితే ఇప్పుడు "ధురంధర్: ది రివెంజ్" సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ జోరు చూస్తే ఈ రికార్డును బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విడుదలకు ఇంకా 6 రోజుల సమయం ఉంది. ఇదే జోరు కొనసాగితే.. ధురంధర్ 2 తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల వరకు ఓపెనింగ్స్ అందుకునే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో పుష్ప 2 ఓపెనింగ్ రికార్డు బ్రేక్ అయ్యే అవకాశముంది. అయితే.. ఆ జోరు అలాగే కొనసాగుతుందా? పుష్ప 2 రికార్డు బ్రేక్ అవుతుందా? అని తెలియాలంటే.. మార్చ్ 19 వరకు వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











