9 ఏళ్ల బాహుబలి 2 రికార్డు మటాష్.. ధురంధర్ 2 ప్రభంజనంలో రాజమౌళి రికార్డుకు గోలీమార్!
బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధార్ రూపొందించిన ధురంధర్ ది రివెంజ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం వైపు దూసుకెళ్తున్నది. హిందీ సినిమా రంగంలో ఇప్పటి వరకు ఉన్న రికార్డులను ఈ చిత్రం తిరగరాస్తున్నది. జవాన్, పఠాన్, ఛావా, యానిమల్ లాంటి లైఫ్ టైమ్ రికార్డులను అధిగమించింది. భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా బాహుబలి ది కన్‌క్లూజన్ సినిమా పేరుతో ఉన్న రికార్డులను నార్త్ అమెరికాలో తుడిచిపెట్టింది. ఇక ఇండియాలో ఈ రికార్డుపై కన్నేసింది. నార్త్ అమెరికాలో ధురంధర్ 2 సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
రెబల్ స్టార్ ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన బాహుబలి ప్రపంచవ్యాప్తంగా రికార్డు వసూళ్లను సాధించింది. ఈ సినిమా నార్త్ అమెరికా అంటే కెనడా, అమెరికా దేశాల్లో అత్యధిక వసూళ్లను సాధించింది. ఈ సినిమా అప్పట్లోనే 20.78 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. భారతీయ కరెన్సీలో ప్రస్తుత డాలర్ రేట్ ప్రకారం.. 197 కోట్ల రూపాయలను వసూలు చేసింది. గత 9 ఏళ్లుగా ఈ సినిమానే టాప్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డును కొనసాగిస్తున్నది.

ప్రపంచవ్యాప్తంగా మార్చి 19వ తేదీన విడుదలైన ధురంధర్ 2 చిత్రం తొలి ఆట నుంచి రికార్డు వసూళ్లను సాధించింది. విడుదలకు ముందే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల విషయంలో టాప్‌గా నిలిచింది. ఈ సినిమా ఇటీవల ప్రభాస్ నటించిన కల్కి2898ఏడీ సినిమా లైఫ్ టైమ్ రికార్డును అధిగమించింది. అదే జోష్‌ను కొనసాగిస్తూ బాహుబలి 2 రికార్డును అధిగమించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
దేశంలోనే కాకుండా విదేశాల్లోను బాహుబలి 2 చిత్రం ప్రభంజనం కొనసాగించింది. 2017 సంవత్సరంలో రిలీజైన ఈ చిత్రం నార్త్ అమెరికా బాక్సాఫీస్‌పై దండయాత్ర చేసింది. దాంతో లైఫ్ టైమ్ థియేట్రికల్ రన్‌లో 20.78 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. ఆ రికార్డును ధురంధర్ 2 చిత్రం అధిగమించింది. శనివారం 20.8 మిలియన్ డాలర్లను వసూలు చేసిన ఈ సినిమా ప్రస్తుతం 25 మిలియన్ డాలర్లకు చేరువై సరికొత్త చరిత్రను నమోదు చేసింది.
ఇక ధురంధర్ 2 చిత్రం నార్త్ అమెరికాలోనే కాకుండా ఇతర దేశాల్లోను సత్తాను చాటుతున్నది. యూకే, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, ఇతర దేశాల్లోను భారీగా కలెక్షన్లను రాబడుతున్నది. గత 10 రోజుల్లో సుమారుగా 34 మిలియన్ డాలర్లు అంటే.. సుమారుగా 325 కోట్ల రూపాయల కలెక్షన్లను వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
రణ్‌వీర్ సింగ్ నటించిన ఈ చిత్రం ఇండియాలోనే సుమారుగా 1000 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేిసంది. ఈ చిత్రం ఇప్పటి వరకు 850 కోట్ల నెట్ కలెక్షన్లను ఇండియాలోనే రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 1350 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











