Dhurandhar 2 AP TG Collections: యానిమల్ రికార్డ్‌పై గురి.. ఏపీ, తెలంగాణలలో ధురంధర్ 2కి ఎన్ని కోట్లంటే?
ఆదిత్యధర్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 విధ్వంసం కొనసాగుతోంది. రెండో వారం ముగిసి త్వరలో మూడో వారంలోకి అడుగుపెట్టినప్పటికీ ధురంధరుడి ఊచకోత ఏ మాత్రం తగ్గడం లేదు. భారత్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే 1200 కోట్ల రూపాయల మార్క్ క్రాస్ చేసిన ధురంధర్.. 2000 కోట్ల దిశగా దూసుకెళ్తోంది. హిందీతో పాటు తెలుగులోనూ ధురంధర్ తన హవా చూపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రా, నైజాంలలో ధురంధర్ 2 ఇప్పటి వరకు ఎన్ని కోట్ల వసూళ్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..
ధురంధర్ 2 తారాగణం
జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్‌పై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండేలు సంయుక్తంగా ధురంధర్ 2 చిత్రాన్ని నిర్మించారు. రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్‌లు హీరో హీరోయిన్‌లుగా నటించారు. అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, రాకేష్ బేడీ, సౌమ్య టాండన్, గౌరవ్ గెరా, మానవ్ గోహిల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. వికాస్ నౌలఖ సినిమాటోగ్రాఫర్‌గా, శివకుమార్ వి పానికర్ ఎడిటర్‌గా సేవలందించారు. శాశ్వత్ సచ్‌దేవ్ సంగీత దర్శకత్వం వహించారు. మార్చి 19న ధురంధర్ 2 మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో వరల్డ్ వైడ్‌గా రిలీజైంది.

ధురంధర్ 2 బడ్జెట్ ఎంత?
నటీనటుల రెమ్యునరేషన్లు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ధురంధర్ 2 మూవీకి 280 కోట్ల రూపాయల మేర బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 280 కోట్ల రూపాయల షేర్.. 600 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. ఆంధ్రా, నైజాంలలో నిర్మాతలతో పాటు జియో స్టూడియోస్ సంస్థ స్వయంగా ధురంధర్ 2ను రిలీజ్ చేసింది.
ధురంధర్ 2 కలెక్షన్స్
రణ్‌వీర్ సింగ్ మూవీకి పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా 43 కోట్ల రూపాయలు, తొలిరోజున 102.55 కోట్ల రూపాయలు, రెండో రోజున 80.72 కోట్ల రూపాయలు, మూడో రోజున 113 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 114.85 కోట్ల రూపాయలు, ఐదో రోజున 65 కోట్ల రూపాయలు, ఆరో రోజున 56.55 కోట్ల రూపాయలు, ఏడో రోజున 48.25 కోట్ల రూపాయలు, ఎనిమిదో రోజున 49.70 కోట్ల రూపాయలు, తొమ్మిదో రోజున 50.34 కోట్ల రూపాయలు, పదో రోజున 62.85 కోట్ల రూపాయలు, పదకొండో రోజున 69.10 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మొత్తంగా 11 రోజుల వరకు ధురంధర్ 2 చిత్రం ఇండియాలో 847.87 కోట్ల రూపాయల నెట్.. 1013.15 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఓవర్సీస్ కలెక్షన్స్ 350 కోట్ల కలిపి వరల్డ్ వైడ్‌గా 1363 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇప్పటి వరకు హిందీలో 731.54 కోట్ల రూపాయలు, కన్నడంలో 1.40 కోట్ల రూపాయలు, మలయాళంలో 1.06 కోట్ల రూపాయలు, తమిళంలో 13.50 కోట్ల రూపాయలు, తెలుగులో 31.27 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ధురంధర్ 2 తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్
ధురంధర్ 2 తెలుగు వెర్షన్ ఇండియా వైడ్‌గా 11 రోజుల్లో 33.7 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసింది. ఆదివారం రణ్‌వీర్ సింగ్ మూవీకి 3 కోట్ల రూపాయలు వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు తెలిపారు. హిందీ వెర్షన్‌తో కలిపి తెలుగు రాష్ట్రాల్లో ధురంధర్ 2 మూవీకి 70 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు నమోదైనట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమా ఆంధ్రా, నైజాంలలో 100 కోట్ల రూపాయల మార్క్‌ను చేరుకుంటుందని భావిస్తున్నారు.
మరోవైపు.. తెలుగులో డబ్ అయిన హిందీ సినిమాల్లో బ్రహ్మాస్త్ర (15.27 కోట్ల రూపాయలు), జవాన్ (28 కోట్ల రూపాయలు) రికార్డులను ధురంధర్ 2 బద్ధలు కొట్టింది. త్వరలోనే రణ్‌బీర్ కపూర్ - సందీప్ రెడ్డి వంగాల యానిమల్ (46 కోట్ల రూపాయలు) రికార్డ్‌ను ధురంధర్ 2 క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక ఈ లిస్ట్‌లో 56.74 కోట్ల రూపాయలతో ఎన్టీఆర్ - హృతిక్ రోషన్‌ల వార్ 2 టాప్‌లో నిలిచింది.


Click it and Unblock the Notifications


















