Dhurandhar 2 AP TG Collections: 100 కోట్ల దిశగా ధురంధర్ 2.. ఆంధ్రా, నైజాంలలో రణ్‌వీర్ మూవీకి ఎన్ని కోట్లంటే?

ఆదిత్యధర్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద రికార్డుల్ని సృష్టిస్తోంది. బాహుబలి 2, పుష్ప 2, జవాన్ వంటి సినిమాల లెక్కల్ని మార్చేస్తోంది. నార్త్, సౌత్ అన్న తేడా లేకుండా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. హిందీతో పాటు తెలుగులోనూ ధురంధర్ తన హవా చూపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రా, నైజాంలలో ధురంధర్ 2 ఇప్పటి వరకు ఎన్ని కోట్ల వసూళ్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

ధురంధర్ 2 తారాగణం
జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్‌పై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే‌లు సంయుక్తంగా ధురంధర్ 2 చిత్రాన్ని నిర్మించారు. రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్‌లు హీరో హీరోయిన్‌లుగా నటించారు. అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, రాకేష్ బేడీ, సౌమ్య టాండన్, గౌరవ్ గెరా, మానవ్ గోహిల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. వికాస్ నౌలఖ సినిమాటోగ్రాఫర్‌గా, శివకుమార్ వి పానికర్ ఎడిటర్‌గా సేవలందించారు. శాశ్వత్ సచ్‌దేవ్ సంగీత దర్శకత్వం వహించారు. మార్చి 19న ధురంధర్ 2 మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో వరల్డ్ వైడ్‌గా రిలీజైంది. అనివార్య కారణాలతో తెలుగు వెర్షన్ రెండ్రోజులు ఆలస్యంగా రిలీజ్ అయినప్పటికీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూనే ఉన్నారు.

Dhurandhar 2 Box Office 9 Days Collections in Telugu States Ranveer Singh s Movie Nizam Andhra Box office Report

ధురంధర్ 2 బడ్జెట్ ఎంత?
నటీనటుల రెమ్యునరేషన్లు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ధురంధర్ 2 మూవీకి 280 కోట్ల రూపాయల మేర బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 280 కోట్ల రూపాయల షేర్.. 600 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. ఆంధ్రా, నైజాంలలో నిర్మాతలతో పాటు జియో స్టూడియోస్ సంస్థ స్వయంగా ధురంధర్ 2ను రిలీజ్ చేసింది.

ధురంధర్ 2 కలెక్షన్స్
రణ్‌వీర్ సింగ్ మూవీకి పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా 43 కోట్ల రూపాయలు, తొలిరోజున 102.55 కోట్ల రూపాయలు, రెండో రోజున 80.72 కోట్ల రూపాయలు, మూడో రోజున 113 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 114.85 కోట్ల రూపాయలు, ఐదో రోజున 65 కోట్ల రూపాయలు, ఆరో రోజున 56.55 కోట్ల రూపాయలు, ఏడో రోజున 48.25 కోట్ల రూపాయలు, ఎనిమిదో రోజున 49.70 కోట్ల రూపాయలు, తొమ్మిదో రోజున 41.55 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మొత్తంగా ధురంధర్ 2 చిత్రం ఇండియాలో 9 రోజుల వరకు 715.72 కోట్ల రూపాయల నెట్.. 805.32 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఓవర్సీస్ కలెక్షన్స్ 274 కోట్ల కలిపి వరల్డ్ వైడ్‌గా 1130 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇప్పటి వరకు హిందీలో 633.72 కోట్ల రూపాయలు, కన్నడంలో 80 లక్షల రూపాయలు, మలయాళంలో 69 లక్షల రూపాయలు, తమిళంలో 10.04 కోట్ల రూపాయలు, తెలుగులో 23.15 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో ధురంధర్ 2 కలెక్షన్స్
ఆంధ్రా నైజాంలలో ధురంధర్ 2 మూవీకి పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా 5 కోట్ల రూపాయలు... తొలి మూడు రోజుల్లో 28 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తొలి వారం మరో 20 కోట్ల రూపాయలు, ఎనిమిదో రోజున 2.50 కోట్ల రూపాయలు, తొమ్మిదో రోజున 2.85 కోట్ల రూపాయలు చొప్పున ఇప్పటి వరకు 52.35 కోట్ల రూపాయల నెట్ వసూలు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మొత్తంగా 9 రోజుల వరకు తెలుగు, హిందీ వెర్షన్‌లు కలిపి ధురంధర్ 2కు ఆంధ్రా, నైజాంలలో 66 కోట్ల రూపాయల గ్రాస్ వసూలైనట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ సెంటర్స్‌లో ధురంధర్ 2కి మంచి ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు.

తొమ్మిదో రోజు ఒక్క హైదరాబాద్‌లోనే 349 షోలు ప్రదర్శితమై.. ఏకంగా 40 శాతం ఆక్యూపెన్సీ నమోదయ్యిందంటే ధురంధర్ 2 క్రేజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కరీంనగర్‌లో 45 శాతం, వరంగల్‌లో 30 శాతం మేరకు ఆక్యూపెన్సీ నమోదైంది. ఈ ట్రెండ్‌ని బట్టి చూస్తుంటే లాంగ్ రన్‌లో ధురంధర్ 2 తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్లకు పైగా వసూళ్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X