Dhurandhar 2 AP TG Collections: ఆంధ్రా, నైజాంలలో ధురంధర్‌ 2కి భారీ వసూళ్లు.. రణ్‌వీర్ మూవీకి ఎన్ని కోట్లంటే?

ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన భారీ స్పై యాక్షన్ మూవీ ధురంధర్ ది రివెంజ్ (ధురంధర్ 2). గతేడాది విడుదలైన ధురంధర్‌కి సీక్వెల్‌గా తెరకెక్కిన ధురంధర్ 2 రికార్డ్ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త బెంచ్ మార్క్‌లు సృష్టిస్తోంది. ఇప్పటికే 700 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన ఈ మూవీ.. 1000 కోట్ల మార్క్ దిశగా అడుగులు వేస్తోంది. భారత్‌తో పాటు విదేశాల్లోనూ ధురంధర్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ప్రేక్షకుల నుంచి ఊహించని డిమాండ్ నేపథ్యంలో థియేటర్లను పెంచుకుంటూ వెళ్తున్నారు నిర్మాతలు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ధురంధర్ 2కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఆంధ్రా, నైజాంలలో ధురంధర్ 2 ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే..

ధురంధర్ 2 తారాగణం
జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్‌పై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే‌లు సంయుక్తంగా ధురంధర్ 2 చిత్రాన్ని నిర్మించారు. రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్‌లు హీరో హీరోయిన్‌లుగా నటించారు. అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, రాకేష్ బేడీ, సౌమ్య టాండన్, గౌరవ్ గెరా, మానవ్ గోహిల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. వికాస్ నౌలఖ సినిమాటోగ్రాఫర్‌గా, శివకుమార్ వి పానికర్ ఎడిటర్‌గా సేవలందించారు. శాశ్వత్ సచ్‌దేవ్ సంగీత దర్శకత్వం వహించారు. మార్చి 19న ధురంధర్ 2 మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో వరల్డ్ వైడ్‌గా రిలీజైంది.

Dhurandhar 2 Box Office Collections in Telugu States Ranveer Singh s Movie Nizam Andhra Box office Report

ధురంధర్ 2 బడ్జెట్ ఎంత?
నటీనటుల రెమ్యునరేషన్లు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ధురంధర్ 2 మూవీకి 280 కోట్ల రూపాయల మేర బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 280 కోట్ల రూపాయల షేర్.. 600 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. ఆంధ్రా, నైజాంలలో నిర్మాతలతో పాటు జియో స్టూడియోస్ సంస్థ స్వయంగా ధురంధర్ 2ను రిలీజ్ చేసింది.

ధురంధర్ 2 ఓవరాల్ కలెక్షన్స్
ధురంధర్ 2కి పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా 43 కోట్ల రూపాయలు, తొలిరోజున 102.55 కోట్ల రూపాయలు, రెండో రోజున 80.72 కోట్ల రూపాయలు, మూడో రోజున 113 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 115.85 కోట్ల రూపాయలు, ఐదో రోజున 65 కోట్ల రూపాయలు చొప్పున ఇండియాలో ఇప్పటి వరకు 519.12 కోట్ల రూపాయల నెట్.. 619.76 కోట్ల రూపాయల గ్రాస్ వసూలైంది. ఓవర్సీస్‌లో వచ్చిన 210 కోట్ల రూపాయలతో కలిపి ఐదు రోజుల్లో ధురంధర్ 2కి వరల్డ్ వైడ్‌గా 829.76 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిక్ పేర్కొంది.

తెలుగు రాష్ట్రాల్లో ధురంధర్ 2 కలెక్షన్స్
ఇప్పటి వరకు హిందీలో 430.72 కోట్ల రూపాయలు, కన్నడంలో 13 లక్షల రూపాయలు, తమిళంలో 5.89 కోట్ల రూపాయలు, తెలుగులో 11.25 కోట్ల రూపాయల నెట్ వచ్చినట్లు సాక్‌నిక్ వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో ధురంధర్ 2కి తొలిరోజున 2.12 కోట్ల రూపాయలు, రెండో రోజున 1.30 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 5 కోట్ల రూపాయలు, ఐదో రోజున 3.50 కోట్ల రూపాయలు చొప్పున ఇప్పటి వరకు 17.17 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. హిందీ డబ్బింగ్ వెర్షన్‌తో కలిపి ఈ మొత్తం 40 కోట్ల రూపాయల పైమాటేనని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇప్పటి వరకు వసూలైన మొత్తంలో ఒక్క నైజాం ఏరియా నుంచే దాదాపు 28 కోట్ల రూపాయల మేర వసూలైంది. మొత్తం మీద లాంగ్ రన్‌లో ధురంధర్ 2 ఆంధ్రా, నైజాంలలో 100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకోవచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మరి రణ్‌వీర్ సింగ్ ఎలాంటి మేజిక్ చేస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X