Dhurandhar 2 vs Avatar 2: ధురంధర్ 2కి అవతార్ 2 ఛాలెంజ్... సౌత్‌‌లో ఆల్‌టైం రికార్డ్‌పై రణ్‌వీర్ గురి!

ఆదిత్యధర్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్: ది రివెంజ్ (ధురంధర్ 2) బాక్సాఫీస్ విధ్వంసం కొనసాగుతోంది. మూడో వారంలోకి అడుగుపెట్టినప్పటికీ ఈ స్పై, యాక్షన్ మూవీ హవా ఏ మాత్రం తగ్గడం లేదు. భారత్‌తో పాటు విదేశాల్లోనూ ధురంధర్ 2 సత్తా చాటుతోంది. 1500 కోట్ల రూపాయల మార్క్ క్రాస్ చేసినట్లు ధురంధర్ 2 యూనిట్ స్పష్టం చేసింది. ప్రస్తుతం అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాలలో 4వ స్థానంలో ఉన్న ధురంధర్ 2 త్వరలోనే 2000 కోట్ల రూపాయల మార్క్ చేరుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నార్త్‌తో పాటు దక్షిణాదిలోనూ ధురంధర్ 2 హవా సాగుతోంది. ఈ నేపథ్యంలో రణ్‌వీర్ సింగ్ ముందు ఊరించే రికార్డ్ ఉంది. ఈ వివరాల్లోకి వెళితే...

ధురంధర్ 2 తారాగణం
జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్‌పై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే‌లు సంయుక్తంగా ధురంధర్ 2 చిత్రాన్ని నిర్మించారు. రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్‌లు హీరో హీరోయిన్‌లుగా నటించారు. అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, రాకేష్ బేడీ, సౌమ్య టాండన్, గౌరవ్ గెరా, మానవ్ గోహిల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. వికాస్ నౌలఖ సినిమాటోగ్రాఫర్‌గా, శివకుమార్ వి పానికర్ ఎడిటర్‌గా సేవలందించారు. శాశ్వత్ సచ్‌దేవ్ సంగీత దర్శకత్వం వహించారు. మార్చి 19న ధురంధర్ 2 మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో వరల్డ్ వైడ్‌గా రిలీజైంది.

Dhurandhar 2 Box Office Ranveer Singh film eye on James Cameron s Avatar 2 s biggest non-South film record

ధురంధర్ 2 బడ్జెట్ ఎంత?
నటీనటుల రెమ్యునరేషన్లు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ధురంధర్ 2 మూవీకి 280 కోట్ల రూపాయల మేర బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 280 కోట్ల రూపాయల షేర్.. 600 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. ఆంధ్రా, నైజాంలలో నిర్మాతలతో పాటు జియో స్టూడియోస్ సంస్థ స్వయంగా ధురంధర్ 2ను రిలీజ్ చేసింది.

ధురంధర్ ది రివెంజ్ రోజుల కలెక్షన్స్
రణ్‌వీర్ సింగ్ మూవీకి పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా 43 కోట్ల రూపాయలు, తొలిరోజున 102.55 కోట్ల రూపాయలు, రెండో రోజున 80.72 కోట్ల రూపాయలు, మూడో రోజున 113 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 114.85 కోట్ల రూపాయలు, ఐదో రోజున 65 కోట్ల రూపాయలు, ఆరో రోజున 56.55 కోట్ల రూపాయలు, ఏడో రోజున 48.25 కోట్ల రూపాయలు, ఎనిమిదో రోజున 49.70 కోట్ల రూపాయలు, తొమ్మిదో రోజున 50.34 కోట్ల రూపాయలు, పదో రోజున 62.85 కోట్ల రూపాయలు, పదకొండో రోజున 68.10 కోట్ల రూపాయలు, పన్నెండో రోజున 25.30 కోట్ల రూపాయలు, పదమూడో రోజున 27.75 కోట్ల రూపాయలు, పద్నాలుగో రోజున 20.10 కోట్ల రూపాయలు, పదిహేనో రోజున 18.30 కోట్ల రూపాయలు, పదహారో రోజున 21.55 కోట్ల రూపాయలు చొప్పున వసూలు చేసింది.

మొత్తంగా 16 రోజుల వరకు ధురంధర్ 2 చిత్రం ఇండియాలో 960.33 కోట్ల రూపాయల నెట్.. 1149.71 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఓవర్సీస్ కలెక్షన్స్ 375 కోట్లు కలిపి వరల్డ్ వైడ్‌గా 1504.58 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇప్పటి వరకు హిందీలో 900 కోట్ల రూపాయలు, కన్నడంలో 2.53 కోట్ల రూపాయలు, మలయాళంలో 1.58 కోట్ల రూపాయలు, తమిళంలో 17 కోట్ల రూపాయలు, తెలుగులో 39 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

అవతార్ 2 రికార్డ్స్‌పై ధురంధర్ 2 కన్ను
హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ కెమెరాన్ తెరకెక్కించిన విజువల్ వండర్ అవతార్‌ ఫ్రాంచైజీలో వచ్చిన అవతార్ 2: ది వే ఆఫ్ వాటర్‌ ప్రపంచవ్యాప్తంగా 17380 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఇండియాలో 391 కోట్ల రూపాయల నెట్.. 477.50 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టి సంచలనం సృష్టించింది. ఇంగ్లీష్‌ వెర్షన్‌లో 204.88 కోట్ల రూపాయలు, హిందీ వెర్షన్‌లో 126.08 కోట్ల రూపాయలు, తెలుగులో 28.70 కోట్ల రూపాయలు, తమిళంలో 18.13 కోట్ల రూపాయలు, మలయాళంలో 6.47 కోట్ల రూపాయలు రాబట్టింది.

అంతేకాదు.. దక్షిణ భారతదేంలో అత్యధి వసూళ్లు సాధించిన నాన్- సౌత్ మూవీగా అవతార్ 2 రికార్డుల్లోకెక్కింది. దక్షిణాదిలోని అన్ని భాషలు+ ఇంగ్లీష్ వెర్షన్ కలిపి అవతార్ 2: ది వే ఆఫ్ వాటర్ 296.90 కోట్లు రాబట్టింది. ఇప్పుడు నాన్ - సౌత్ మూవీస్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా జవాన్ (188.13 కోట్ల రూపాయలు) రికార్డ్‌ను బద్ధలుకొట్టి ధురంధర్ 2 రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు దక్షిణాది భాషలు+ హిందీ వెర్షన్‌లో ధురంధర్ ది రివెంజ్ 250 కోట్లకు పైగా వసూలు చేసింది. మరో 50 కోట్ల రూపాయలు రాబడితే దక్షిణాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన నాన్- సౌత్ మూవీగా ధురంధర్ 2 చరిత్ర సృష్టించనుంది. మరి రణ్‌వీర్ మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X