Dhurandhar 2 Box Office: ధురంధర్ 2 దండయాత్ర.. 3 రోజుల్లో 500 కబ్ల్‌లోకి.. ఆ స్టార్ హీరోల రికార్డ్స్ బ్రేక్

Dhurandhar 2 Box Office: నార్త్ నుంచి సౌత్ వరకూ.. ఈస్ట్ నుండి వెస్ట్ వరకూ ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు మార్మోగిపోతోంది.. అదే 'ధురంధర్ 2′ (Dhurandhar: The Revenge). స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ - దర్శకుడు ఆదిత్య ధర్ కాంబోలో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఒక సునామీని సృష్టిస్తోంది. భారీ కలెక్షన్లే కాదు.. నయా రికార్డులను క్రియేట్ చేస్తోంది. మొదట హిందీ వర్షన్ లో విడుదలైంది. తెలుగు వెర్షన్ రెండు రోజులు ఆలస్యంగా రిలీజ్ అయినా కూడా 'రాంపేజ్' చూపిస్తుంది. గతంలో 'యురి','ధురంధర్' సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆదిత్య ధర్, తాజాగా 'ధురంధర్ 2'తో హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా మూడు రోజుల్లో ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందంటే?

ధురంధర్ 2 విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తుంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల మార్క్‌ను దాటి చరిత్ర సృష్టించింది. ఈ జోరును చూస్తే.. సినిమాపై ఉన్న క్రేజ్ ఏంటో అర్థమవుతుంది. ఈ సినిమా కలెక్షన్లను పరిశీలిస్తే.. వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ.501.04 కోట్లకు చేరుకుంది. ఇందులో ఇండియా గ్రాస్ రూ.404.54 కోట్లు కాగా, ఓవర్సీస్ మార్కెట్ నుంచి రూ.96.50 కోట్లు వచ్చాయి. ఇండియా నెట్ కలెక్షన్లు రూ.339.27 కోట్లు. ఈ మొత్తం వసూళ్లలో దాదాపు 80.74 శాతం ఇండియన్ బాక్సాఫీస్ నుంచి కాగా, మిగిత 19.26 శాతం ఓవర్సీస్ మార్కెట్ నుంచి రాబట్టింది.

Dhurandhar 2 Box Office Ranveer Singh s Film Enters 500 Cr Club in 3 Days Breaks Major Records

ధురంధర్ 2 భారీ విజయానికి ప్రధాన కారణం హిందీ వెర్షన్ అని చెప్పాలి. హిందీ వెర్షన్ నుంచి ఏకంగా రూ.323.72 కోట్ల (నెట్) కలెక్షన్లు సాధించింది. విడుదలకు ముందే పేడ్ ప్రివ్యూస్ ద్వారా రూ.43 కోట్లు రావడం మంచి హైప్‌ను క్రియేట్ చేసింది. మొదటి రోజు రూ.99.1 కోట్లు వసూలు చేసి భారీ ఓపెనింగ్ అందుకోగా, రెండో రోజు రూ.78.94 కోట్లు వసూలు చేసింది. ఇక మూడో రోజు అయితే రూ.105 కోట్లు రాబట్టి మరోసారి దుమ్మురేపింది. ఇది సినిమా మీద పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ ఎంత బలంగా ఉందో స్పష్టం చేస్తోంది.

దక్షిణాది మార్కెట్ల విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొత్తం రూ.6.30 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. ఇక తమిళ వెర్షన్ నెట్ కలెక్షన్ రూ.3.39 కోట్లు, కన్నడలో మొత్తం రూ.0.04 కోట్లు, మలయాళంలో రూ.0.05 కోట్లు మాత్రమే వసూలు చేసింది.కలెక్షన్ల పరంగా చూస్తే..ఈ సినిమా కొత్త రికార్డులు సృష్టిస్తోంది.

ఒక్క మాటలో ఈ సినిమా గురించి చెప్పాలంటే 'అరాచకం'. ధురంధర్ 2 విడుదలైన తొలి రోజే భారీ వసూళ్లు సాధించి 2026లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. ఈ క్రమంలో యానిమల్, పఠాన్, జవాన్ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల ఓపెనింగ్ రికార్డులను బ్రేక్ చేసింది. ఇక రెండు రోజుల్లోనే రూ.200 కోట్ల మార్క్ చేసి, కల్కి 2898 AD రెండు రోజుల రికార్డును కూడా బ్రేక్ చేసింది. ఈ క్రమంలో Pushpa 2 పేరిట ఉన్న రికార్డును సైతం ఈ సినిమా అధిగమించడం విశేషం. ఇది రణవీర్ సింగ్ కెరీర్‌లోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఒక మైలురాయిగా మారింది.

హిందీ సినిమాల్లోనే కాదు.. మొత్తం ఇండియన్ ఓపెనింగ్స్‌లో కూడా ఈ సినిమా టాప్ రేంజ్‌లో నిలిచింది. పుష్ప2 , RRR తర్వాత టాప్ ఓపెనర్‌గా నిలవడం విశేషం.అదే సమయంలో పేడ్ ప్రివ్యూస్ ద్వారా రూ.43 కోట్ల వసూళ్లు సాధించి,ఓజీ రికార్డును కూడా అధిగమించింది. మొత్తంగా చూస్తే, 'ధురంధర్ 2' రణవీర్ సింగ్ కెరీర్‌లోనే కాకుండా, ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌లో ఒక భారీ ట్రెండ్ సెట్టర్‌గా మారిందనీ చెప్పాలి. ఇదే జోరు కొనసాగితే,త్వరలోనే ఈ సినిమా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరి, మరిన్ని రికార్డులు బద్దలు కావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

More from Filmibeat

Read more about: ranveer singh box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X