Dhurandhar 2 vs Baahubali 2: సింగిల్ డేలో బాహుబలి 2 రికార్డ్ బ్రేక్.. ఆస్ట్రేలియాలో ధురంధర్ 2 సరికొత్త చరిత్ర

ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ స్పై యాక్షన్ మూవీ ధురంధర్ ది రివెంజ్ (ధురంధర్ 2) రికార్డ్ వసూళ్లతో సరికొత్త బెంచ్ మార్క్‌లు సృష్టిస్తోంది. ఇప్పటికే 350 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన ఈ మూవీ.. 500 కోట్ల మార్క్ దిశగా అడుగులు వేస్తోంది. భారత్‌తో పాటు విదేశాల్లోనూ ధురంధర్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ప్రేక్షకుల డిమాండ్ నేపథ్యంలో థియేటర్లను పెంచుకుంటూ వెళ్తున్నారు నిర్మాతలు. తాజాగా ఆస్ట్రేలియాలో ధురంధర్ 2 అరుదైన ఘనతను సాధించింది. ఈ వివరాల్లోకి వెళితే..

ధురంధర్ 2 తారాగణం
జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్‌పై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే‌లు సంయుక్తంగా ధురంధర్ 2 చిత్రాన్ని నిర్మించారు. రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్‌లు హీరో హీరోయిన్‌లుగా నటించారు. అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, రాకేష్ బేడీ, సౌమ్య టాండన్, గౌరవ్ గెరా, మానవ్ గోహిల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. వికాస్ నౌలఖ సినిమాటోగ్రాఫర్‌గా, శివకుమార్ వి పానికర్ ఎడిటర్‌గా సేవలందించారు. శాశ్వత్ సచ్‌దేవ్ సంగీత దర్శకత్వం వహించారు. మార్చి 19న ధురంధర్ 2 మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో వరల్డ్ వైడ్‌గా రిలీజైంది.

Dhurandhar 2 breaks Baahubali 2 s record in Australia becoming the first Indian film to cross the 1 million

ధురంధర్ 2 బడ్జెట్ ఎంత?
నటీనటుల రెమ్యునరేషన్లు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ధురంధర్ 2 మూవీకి 280 కోట్ల రూపాయల మేర బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 280 కోట్ల రూపాయల షేర్.. 600 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.

ధురంధర్ 2 కలెక్షన్స్
ధురంధర్ 2కు ఇండియాలో పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా 43 కోట్ల రూపాయలు, తొలిరోజున 102.55 కోట్ల రూపాయలు, రెండో రోజున 80.72 కోట్ల రూపాయలు, మూడో రోజున ఇప్పటి వరకు 87 కోట్ల రూపాయలు చొప్పున ఇప్పటి వరకు 313 కోట్ల రూపాయల నెట్.. 330 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలైంది. ఇక ఓవర్సీస్‌లోనూ ధురంధర్ 2 విధ్వంసం కొనసాగుతోంది. ఒక్క నార్త్ అమెరికాలోనే ఇప్పటి వరకు 6.79 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 63.8 కోట్ల రూపాయలు) రాబట్టింది. మొత్తంగా ఓవర్సీస్‌‌లో పెయిడ్ ప్రీమియర్స్ + డే 1 కలిపి 54.10 కోట్ల రూపాయలు, రెండో రోజున 39.3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇప్పటి వరకు అందుతున్న లెక్కల ప్రకారం ఓవర్సీస్‌లో 93.4 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఇప్పటి వరకు ధురంధర్ 2కు వరల్డ్ వైడ్‌గా 425 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఆస్ట్రేలియాలో ధురంధర్ హవా
ఆస్ట్రేలియాలో ధురంధర్ తొలిరోజున 690K ఆస్ట్రేలియా డాలర్లు (4.53 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. తద్వారా ఆస్ట్రేలియాలో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన మూడవ భారతీయ చిత్రంగా నిలిచింది. బాహుబలి 2 (825K ఆస్ట్రేలియా డాలర్లు), ఆర్ఆర్ఆర్ (702K ఆస్ట్రేలియా డాలర్లు) ముందున్నాయి. ఇప్పటి వరకు ఆస్ట్రేలియాలో ధురంధర్ 2 మూవీకి 2.64 మిలియన్ల ఆస్ట్రేలియా డాలర్లు (భారత కరెన్సీలో 17.36 కోట్ల రూపాయలు) వసూలు చేసింది.

అయితే శనివారం ఒక్క రోజు ఆస్ట్రేలియాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా బాహుబలి 2 (800k ఆస్ట్రేలియా డాలర్లు) రికార్డ్‌ను ధురంధర్ 2 తాజాగా బద్ధలు కొట్టినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. రణ్‌వీర్ సింగ్ మూవీ ఈ శనివారం ఒక్కరోజు (1.15 మిలియన్ ఆస్ట్రేలియా డాలర్లు) వసూలు చేసి తిరుగులేని ఘనత సాధించింది. తద్వారా ఆస్ట్రేలియన్ బాక్సాఫీస్ చరిత్రలో ఒక్కరోజులోనే 1 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల మార్క్‌ను దాటిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. అంతేకాకుండా ఒక్కరోజులోనే 50 వేలకు పైగా టిక్కెట్స్ సేల్ చేసిన తొలి భారతీయ సినిమాగా నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X