Dhurandhar 2 Vs Pushpa 2: అల్లు అర్జున్ ‘పుష్ప 2' రికార్డు బద్దలుగొట్టిన ధురంధర్ 2
Dhurandhar 2 Vs Pushpa 2: భారతీయ సినీ పరిశ్రమ మరో భారీ బాక్సాఫీస్ యుద్ధానికి సిద్ధమవుతోంది. మార్చి 19న ఒకేసారి రెండు పాన్ ఇండియా సినిమాలు విడుదలకు కానున్నాయి. ఒకవైపు రణ్ వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ సీక్వెల్ ధురంధర్ 2, మరోవైపు కన్నడ స్టార్ హీరో యష్ (Yash) మాస్ ఎంటర్‌టైనర్ టాక్సిక్. ఈ రెండు పాన్ ఇండియా మూవీపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బాక్సాఫీస్ పోరు ఏ మూవీ విజయం సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే..విడుదలకు ముందే 'ధురంధర్ 2' మూవీ ఒక రికార్డును బద్దలుకొట్టిందన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ రికార్డు ఏంటీ?
రన్ టైమ్‌లో కొత్త రికార్డు
అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2) సినిమా కేవలం వసూళ్ల పరంగా మాత్రమే కాదు, రన్ టైమ్ పరంగానూ రికార్డు సృష్టించింది. ఈ మూవీ మొత్తం 3 గంటల 20 నిమిషాల (200 నిమిషాలు) నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ లెంగ్త్ ఉన్నప్పటికీ ప్రేక్షకులు థియేటర్లలో ఆసక్తిగా చూసారు. అయితే ఇప్పుడు ధురంధర్ 2 ఈ రన్ టైమ్ రికార్డును బ్రేక్ చేసినట్టు సమాచారం.

ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ మూవీ 220 నిమిషాలు.. అంటే 3 గంటల 40 నిమిషాల నిడివితో విడుదలకు కాబోతుందట. అంటే పుష్ప 2 కంటే 20 నిమిషాలు ఎక్కువ. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సీక్వెల్ స్టోరీలో భారీ ట్విస్టులు, యాక్షన్ ఎపిసోడ్స్ ఉండటం వల్ల రన్ టైమ్ పెరిగినట్టు తెలుస్తోంది.
ధురంధర్ మొదటి భాగం భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ధురంధర్ 2పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇండియా-పాకిస్తాన్ నేపథ్యంలోని హై వోల్టేజ్ స్పై డ్రామాగా రూపొందిన ఈ సీక్వెల్ లో భారీ ట్విస్టులు, యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక అదే రోజు విడుదలవుతున్న యష్ ' టాక్సిక్ ' కూడా భారీ నిడివితోనే వస్తోంది. ఈ సినిమా రన్ టైమ్ 195 నిమిషాలు (3 గంటల 15 నిమిషాలు)గా ఫిక్స్ అయినట్టు సమాచారం. యష్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్న ఈ పీరియడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా కూడా ఎపిక్ రేంజ్‌లో తెరకెక్కింది.
ఫస్ట్ డే కలెక్షన్స్‌లో కూడా రికార్డు బ్రేక్?
పుష్ప 2 విడుదలైన రోజున వరల్డ్‌వైడ్‌గా సుమారు రూ.280 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆల్‌టైమ్ ఓపెనింగ్ డే రికార్డు సృష్టించింది. ఇప్పటికీ ఆ రికార్డు చెక్కుచెదరలేదు. ఇప్పుడు ఆ రేర్ ఫీట్ ను ధురంధర్ 2 అందుకోగలదా? అనే ఉత్కంఠగా మారింది. ట్రేడ్ అంచనాల ప్రకారం ధురంధర్ 2 దేశవ్యాప్తంగా సుమారు 4000 స్క్రీన్లలో విడుదల కానుంది. ఈ లెక్కన చూస్తే.. ఇండియాలో రూ.100 కోట్లకు పైగా ఓపెనింగ్ సాధించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక ఓవర్సీస్ మార్కెట్ కలిపితే వరల్డ్‌వైడ్‌గా రూ.140-150 కోట్ల వరకు వెళ్లవచ్చని అంచనా. అంటే పుష్ప 2 ఫస్ట్ డే రికార్డును అందుకోవాలంటే ఈ అంచనాలు రెట్టింపు కావాలి.
ఇక్కడ మరో వైపు.. యష్ టాక్సిక్ కూడా 5500 స్క్రీన్లను టార్గెట్ చేస్తోంది. భారీ హైప్ ఉంటే టాక్సిక్ రూ.200-250 కోట్ల ఓపెనింగ్ అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ టాక్. అలాంటి పరిస్థితిలో రెండు సినిమాల కలిపిన ఓపెనింగ్ పుష్ప 2 రికార్డును టచ్ చేయవచ్చు. కానీ, ఒక్క ధురంధర్ 2 మాత్రమే ఆ రికార్డు బ్రేక్ చేయడం కాస్త కష్టమే అనిపిస్తోంది. అయితే రన్ టైమ్ పరంగా మాత్రం ధురంధర్ 2 ఇప్పటికే పుష్ప 2ను దాటేసింది. ఇప్పుడు అసలు పరీక్ష బాక్సాఫీస్ వద్దే. మార్చి 19 తర్వాతే ఈ విషయం తెలియనున్నది. పుష్ప రాజ్ సింహాసనం కదిలిందా? లేక మరికొంతకాలం అదే టాప్‌లో నిలుస్తుందా? అనేది వేచిచూడాలి.


Click it and Unblock the Notifications











