ధురంధర్ 2 కలెక్షన్ల సంచలనం.. బాహుబలి 2 రికార్డుకు ఒక్క అడుగు దూరంలో,,

ధురంధర్ ది రివెంజ్ సినిమా బాక్సాఫీస్ జైత్ర యాత్ర కొనసాగుతూనే ఉంది. గత 43 రోజులుగా కలెక్షన్ల సంచలనాలను నమోదు చేస్తూ తిరుగులేని వసూళ్లను నమోదు చేస్తున్నది. రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, సారా అర్జున్, ఆర్ మాధవన్ నటించిన ఈ చిత్రం ఇప్పటికే బాలీవుడ్‌లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఆదిత్య ధార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మరో సంచలనం క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యింది. ఈ చిత్రం భారతీయ సినిమా పరిశ్రమలో అత్యధికంగా వసూళ్లను సాధించిన చిత్రంగా, బాహుబలి 2 రికార్డును అధిగమించేందుకు ఈ మూవీ రెడీ అవుతున్నది. ఈ చిత్రం గత 6 వారాలుగా రాబట్టిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

భారతీయ సినిమా బాక్సాఫీస్ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితా వివరాల్లోకి వెళితే.. కేజీఎఫ్ 2 చిత్రం 1215 కోట్ల రూపాయల గ్రాస్, ధురంధర్ మూవీ 1307 కోట్ల రూపాయలు, పుష్ప 2 చిత్రం 1742 కోట్లు వసూలు చేసింది. అయితే ఇప్పటి వరకు బాహుబలి 2 పేరిట అత్యధిక వసూళ్లు నమోదు చేసిన రికార్డు కొనసాగుతుంది. ఈ చిత్రం 1788 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Dhurandhar 2 close to Baahubali 2 life time Box office Collections

అయితే ధురంధర్ 2 చిత్రం రిలీజ్‌కు ముందు నుంచే కలెక్షన్ల రికార్డులతో బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టింది. అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ విడుదల తర్వాత ఎదురేలేకుండా పోయింది. విడుదలైన ప్రతీ చోట కలెక్షన్ల వర్షం కురుస్తూనే ఉంది. తొలి వారం ఈ చిత్రం 674 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక రెండో వారంలో 264 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో తొలివారమే ఈ సినిమా 1000 కోట్ల రూపాయలు నమోదు చేసింది.

ధురంధర్ 2 మూడో వారంలో కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ చిత్రం 4వ వారంలో 55 కోట్ల రూపాయలు, 5వ వారంలో 20 కోట్ల రూపాయలు నమోదు చేసింది. 6వ వారంలో ఇప్పటి వరకు సుమారుగా 16 కోట్ల రూపాయలు రాబట్టింది. 43వ రోజున కూడా ఈ సినిమా కోటి రూపాయలకుపైగా కలెక్షన్లను నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 1133 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేశాయి.

ధురంధర్ 2 చిత్రానికి ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా భారీ ఆదరణ లభించింది. ఈ చిత్రం రికార్డు కలెక్షన్లు సాధించిన సినిమాగా ఘనతను సాధించింది. కల్కి, బాహుబలి 2, ఇతర బాలీవుడ్ సినిమాల రికార్డులను అధిగమించింది. ఈ చిత్రం 43 రోజుల్లో 425 కోట్ల రూపాయలకుపైగా కలెక్షన్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 1357 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, వరల్డ్ వైడ్‌గా 1782 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఇంకా 6 కోట్ల రూపాయలు వసూలు చేస్తే ఈ సినిమా అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X