Dhurandhar 2 Collections: ఓవర్సీస్‌లో ధురంధర్ రికార్డు కలెక్షన్స్.. రణ్‌వీర్ మూవీకి ఎన్ని కోట్లంటే?

Dhurandhar 2 Collections: 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద అన్‌స్టాపబుల్ దూకుడుతో దుమ్మురేపుతోంది. రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన మొదటి రోజునుంచే రికార్డుల వేట మొదలుపెట్టి, వరుసగా భారీ కలెక్షన్లు నమోదు చేస్తోంది. యాక్షన్, ఎమోషన్, స్పై థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ మూవీ కేవలం నాలుగు రోజుల్లోనే సాలిడ్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. మరి ఈ 'ధురంధర్' నాలుగు రోజుల్లో మొత్తం ఎన్ని కోట్లు వసూలు చేసింది. మరి ముఖ్యంగా ఓవర్సీర్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో ఓ లూక్కేయండి.

రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డులు సృష్టిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టించి ట్రేడ్ వర్గాలను షాక్‌కు గురి చేసింది. ప్రస్తుతం ఈ మూవీ వరల్డ్‌వైడ్‌గా రూ. 691.32 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇందులో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద గ్రాస్ రూ. 541.97 కోట్లు కాగా, ఇందులో నెట్ కలెక్షన్స్ రూ. 454.12 కోట్లు. విదేశాల్లో కూడా ఈ సినిమా మంచి స్పందన దక్కించుకుని రూ. 149.35 కోట్ల వసూళ్లు రాబట్టింది. మొత్తంగా చూస్తే కేవలం నాలుగు రోజుల్లోనే ఈ స్థాయి కలెక్షన్లు సాధించడం సినిమాను 'ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్'గా నిలిపింది.

Dhurandhar 2 Collections Ranveer Singh Film Creates Box Office Storm with 700 Cr in 4 Days

ధురంధర్ కలెక్షన్ లో మేజర్ వాటా హిందీ బాక్సాఫీస్ వద్ద నుంచే వచ్చింది. హిందీ వెర్షన్ ఈ విజయానికి ప్రధాన కారణం. హిందీలోనే రూ. 430.72 కోట్ల నెట్ కలెక్షన్ సాధించడం విశేషం. డే 1న రూ. 99.1 కోట్లు, డే 3 రూ.105 కోట్లు, డే 4న రూ.107 కోట్లు వసూలు చేసి, ట్రేడ్ వర్గాలను సైతం షాక్ చేసింది. కేవలం ప్రీమియర్ షోల నుంచే రూ. 43 కోట్లు రాబట్టిందంటే.. ఈ సినిమా రేంజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ఇక సౌత్ ఇండియాలో ఈ సినిమా కలెక్షన్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. తెలుగు వెర్షన్‌లో మొత్తం రూ.11.55 కోట్లు నెట్ కలెక్షన్ నమోదైంది. మొదటి రోజు కాస్త నెమ్మదిగా ప్రారంభమైనా, మూడో రోజు నుంచి కలెక్షన్లు పెరిగి రూ. 5 కోట్లు దాటాయి. తమిళంలో రూ. 5.89 కోట్లు రాగా, మలయాళంలో కేవలం రూ.0.14 కోట్లు మాత్రమే రాబట్టింది. కన్నడలో కూడా కలెక్షన్లు చాలా తక్కువగా ఉండడం గమనార్హం.

ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ సినిమా దూకుడు కొనసాగిస్తుంది. ముఖ్యంగా నార్త్ అమెరికా మార్కెట్‌లో 'ధురంధర్ 2' సంచలనం సృష్టించింది. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ లో మొత్తం 14 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 131.5 కోట్లు) గ్రాస్ వసూళ్లు సాధించింది. అలాగే ఇతర దేశాల్లో దాదాపు 21 మిలియన్‌ డాలర్లకు పైగా వసూళ్లు సాధించింది. భారత కరెన్సీలో చూస్తే ఇది దాదాపు రూ. 200 కోట్లు.

ఇందులో మరింత ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ భారీ కలెక్షన్లు గల్ఫ్ దేశాల్లో విడుదల కాకుండానే సాధించడం మరో విశేషం. సాధారణంగా ఇండియన్ సినిమాలకు గల్ఫ్ మార్కెట్ ఎంతో కీలకం. అక్కడ రిలీజ్ జరిగి ఉంటే.. ఓవర్సీస్ కలెక్షన్లు ఏకంగా రూ. 275 కోట్లకు పైగా చేరుకునే అవకాశముందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది కేవలం ఓ మంచి ఓపెనింగ్ మాత్రమే కాదు... ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను భారీ మార్జిన్‌తో బద్దలు కొట్టి ఆల్ టైమ్ రికార్డ్ నమోదు చేసిందని చెప్పాలి.

మొత్తంగా ధురంధర్ కలెక్షన్స్ చూస్తే.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ వీకెండ్ లోనే దాదాపు రూ. 500 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేయగా, ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కలెక్షన్లు రూ.700 కోట్లకు చేరుకున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్‌లో రికార్డు స్థాయి వీకెండ్‌ కలెక్షన్స్ అందుకున్న మూవీగా నిలిచింది. 4 రోజుల వసూళ్ల పరంగా 'పుష్ప 2' తర్వాత రెండో అతిపెద్ద ఓపెనింగ్‌గా అందుకున్న ఇండియన్ మూవీగా నిలిచింది.

ఈ జోరు చూస్తుంటే, రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అనిపిస్తోంది. ఈ మూవీ కేవలం ఇండియాలోనే కాదు, విదేశాల్లోనూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ, ఈ ఏడాది అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచే దిశగా దూసుకుపోతోంది. ఇక ఈ వేగం కొనసాగితే త్వరలోనే ₹1000 కోట్ల క్లబ్‌లోకి చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే, 'ధురంధర్ 2' ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచే దిశగా దూసుకుపోతోంది.

Read more about: ranveer singh box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X