Dhurandhar 2 vs Kalki: కల్కిని కొట్టలేకపోయిన ధురంధర్ 2... రణ్‌వీర్ ప్రభంజనంలోనూ ప్రభాస్‌దే టాప్ ప్లేస్!

ఆదిత్య ధర్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన మూవీ ధురంధర్: ది రివెంజ్ (ధురంధర్ 2). ఉగాది, రంజాన్ కానుకగా మార్చి 19న ఈ భారీ యాక్షన్ మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మొదటి భాగం ఊహించని విజయం సాధించడంతో ధురంధర్ 2పై భారతీయ చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగినట్లుగానే ఈ సినిమా రికార్డులు బద్ధలు కొడుతోంది. రికార్డ్ ఓపెనింగ్స్‌ రాబట్టిన ధురంధర్ 2.. ప్రస్తుతం 2000 కోట్ల రూపాయల రికార్డ్‌పై కన్నేసింది. అయ ఓ రికార్డ్ విషయంలో మాత్రం ధురంధర్ ఫెయిలైంది. ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
Ustaad Bhagat Singh Day 2 Collections: ఉస్తాద్ కలెక్షన్స్‌పై ధురంధర్ 2 దెబ్బ.. పవన్ మూవీకి ఎన్ని కోట్లంటే?
Ustaad Bhagat Singh Day 2 Collections: ఉస్తాద్ కలెక్షన్స్‌పై ధురంధర్ 2 దెబ్బ.. పవన్ మూవీకి ఎన్ని కోట్లంటే?

ధురంధర్ 2 తారాగణం
జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్‌పై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే‌లు సంయుక్తంగా ధురంధర్ 2 చిత్రాన్ని నిర్మించారు. రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్‌లు హీరో హీరోయిన్‌లుగా నటించారు. అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, రాకేష్ బేడీ, సౌమ్య టాండన్, గౌరవ్ గెరా, మానవ్ గోహిల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. వికాస్ నౌలఖ సినిమాటోగ్రాఫర్‌గా, శివకుమార్ వి పానికర్ ఎడిటర్‌గా సేవలందించారు. శాశ్వత్ సచ్‌దేవ్ సంగీత దర్శకత్వం వహించారు. మార్చి 19న ధురంధర్ 2 మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో వరల్డ్ వైడ్‌గా రిలీజైంది.

Dhurandhar 2 Creates Box Office Storm in North America Falls Short of Prabhas s Kalki 2898 AD Record

ధురంధర్ 2 బడ్జెట్ ఎంత?
నటీనటుల రెమ్యునరేషన్లు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ధురంధర్ 2 మూవీకి 280 కోట్ల రూపాయల మేర బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 280 కోట్ల రూపాయల షేర్.. 600 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. ఇప్పటికే నాన్ థియేట్రికల్ రైట్స్‌ ద్వారా ఈ మూవీ 250 నుంచి 300 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది.

Recommended For You
40 ఏళ్లు దాటాక వెంటాడుతున్న ఆ డేంజర్... నటి ప్రియ ఎమోషనల్
40 ఏళ్లు దాటాక వెంటాడుతున్న ఆ డేంజర్... నటి ప్రియ ఎమోషనల్

ధురంధర్ 2 కలెక్షన్స్
ప్రీమియర్స్ + డే 1 కలెక్షన్స్‌తో ఇండియాలో 146 కోట్ల రూపాయల నెట్ రాబట్టిన ధురంధర్ 2 మొత్తంగా తొలిరోజున 172.63 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. ఓవర్సీస్‌లో 70 కోట్ల రూపాయల వసూళ్లతో వరల్డ్ వైడ్‌గా తొలిరోజున 240 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టి సంచలనం సృష్టించింది. రెండో రోజు ధురంధర్ 2 మూవీ వరల్డ్ వైడ్‌గా 85 కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తద్వారా రెండ్రోజుల్లోనే ఈ సినిమా 350 కోట్లకు పైగా వసూళ్లు అందుకోవచ్చని ఊహిస్తున్నారు.

You May Also Like
Ustaad Bhagat Singh: పాన్ ఇండియా మూవీలకే సవాల్.. ఆంధ్రా- నైజాంలలో ఒకే ఒక్కడిగా పవన్ కళ్యాణ్!
Ustaad Bhagat Singh: పాన్ ఇండియా మూవీలకే సవాల్.. ఆంధ్రా- నైజాంలలో ఒకే ఒక్కడిగా పవన్ కళ్యాణ్!

కల్కి రికార్డ్‌ను కొట్టలేకపోయిన ధురంధర్ 2
ఇండియాతో పాటు నార్త్ అమెరికాలోనూ ధురంధర్ 2 ప్రభంజనం సృష్టిస్తోంది. ప్రీమియర్స్‌లోనే 2 మిలియన్ డాలర్లు ( 18.73 కోట్ల రూపాయలు) వసూలు చేయగా.. తొలి రోజున 1.95 మిలియన్ డాలర్లు (18.26 కోట్ల రూపాయలు) చొప్పున ప్రీమియర్స్ + డే 1లకు కలిపి మొత్తంగా 3.95 మిలియన్ డాలర్లు (దాదాపు 37 కోట్ల రూపాయలు) రాబట్టింది. అయితే నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ + డే 1 కలెక్షన్స్‌కి సంబంధించి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ 5.56 మిలియన్ డాలర్లు (52 కోట్ల రూపాయలు)తో టాప్‌లో ఉంది. ధురంధర్ 2 భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ కల్కి రికార్డ్‌ను బద్ధలు కొట్టలేకపోయింది.

Dhurandhar 2 Karnataka Collection: ఓజీ, కాంతార చాప్టర్ 1 రికార్డ్స్ బ్రేక్.. కర్ణాటకలో ధురంధర్ 2కు ఎంతంటే?
Dhurandhar 2 Karnataka Collection: ఓజీ, కాంతార చాప్టర్ 1 రికార్డ్స్ బ్రేక్.. కర్ణాటకలో ధురంధర్ 2కు ఎంతంటే?

ఈ లిస్ట్‌లో ధురంధర్ 6వ స్థానంలో నిలిచింది. కల్కి తర్వాత ఆర్ఆర్ఆర్ (5.5 మిలియన్ డాలర్లు), బాహుబలి 2 (4.6 మిలియన్ డాలర్లు), పుష్ప 2 (4.47 మిలియన్ డాలర్లు), కూలీ (3.97 మిలియన్ డాలర్లు)తో టాప్ 5లో ఉన్నాయి. అనంతరం సలార్ (3.84 మిలియన్ డాలర్లు), దేవర (3.79 మిలియన్ డాలర్లు), ఓజీ (3.68 మిలియన్ డాలర్లు), యానిమల్ (2.77 మిలియన్ డాలర్లు)తో నిలిచాయి. టాప్ 10లో ప్రభాస్‌వే మూడు సినిమాలు ఉండటం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X