Dhurandhar 2 Day 1 Box Office: చరిత్ర సృష్టించిన ధురంధర్ 2.. బాక్సాఫీస్ ఊచకోత.. కలెక్షన్లు ఎన్ని కోట్లంటే?

బాలీవుడ్ స్టార్ హీరోలు రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ నటించిన చిత్రం ధురంధర్ ది రివెంజ్. ఈ సినిమాకు ఆదిత్య ధార్ రచన, నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తించారు. యాక్షన్, స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు.

ఈ చిత్రానికి వికాస్ నౌలాఖ సినిమాటోగ్రఫి, షాష్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్, శివకుమార్ వీ పానికర్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ధురంధర్ 1 చిత్రం డిసెంబర్ 5వ తేదీ 2025 రోజున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజై సంచలన విజయం సాధించింది. ఈ సినిమా రెండో భాగం మార్చి 19వ ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రీమియర్స్, తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

Dhurandhar 2 Day 1 Prediction

ధురంధర్ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌ ప్రభంజనం బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్నది. ఈ సినిమా నార్త్, సౌత్ అనే తేడా లేకుండా అన్ని రాష్ట్రాల్లో వసూళ్ల వర్షం కురిపిస్తున్నది. ఈ సినిమా భారతీయ సినిమా పరిశ్రమలో అత్యధిక ఓపెనింగ్స్ సాధించే చిత్రంగా రికార్డు క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే 100 కోట్లకుపైగా అడ్వాన్స్ బుకింగ్ సాధించి చరిత్ర సృష్టించింది అని అధికారికంగా ప్రకటిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం.. ఢిల్లీలో ఈ సినిమా 13 కోట్ల రూపాయలు, పంజాబ్‌లో 2 కోట్ల రూపాయలు, రాజస్థాన్‌లో 2.5 కోట్ల రూపాయలు, గుజరాత్‌లో 6 కోట్ల రూపాయలు, మహారాష్ట్రలో 17 కోట్ల రూపాయలు, మధ్య ప్రదేశ్‌లో ఈ సినిమా 2 కోట్ల రూపాయలు, చత్తీస్‌గఢ్‌లో 1 కోటి రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు భోగట్టా. ఇక పశ్చిమ బెంగాల్‌లో 3 కోట్ల రూపాయలు, బీహార్, జార్ఖండ్‌లో 1.2 కోట్లు వసూలు చేసిందని వెల్లడించారు.

ఇక దక్షిణాది విషయానికి వస్తే.. తెలంగాణలో 5 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 10 కోట్ల రూపాయలు, ఆంధ్ర ప్రదేశ్‌లో 1.5 కోట్లరూపాయలు, తమిళనాడులో 3 కోట్ల రూపాయలు, కేరళలో 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో ఈ సినిమా తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ 70 కోట్లకుపైగానే కలెక్ష్లను రాబట్టిందని చెబుతున్నారు.

ధురంధర్ 2 ఓవర్సీస్ విషయానికి వస్తే.. అమెరికాలో సుమారుగా 20 కోట్ల రూపాయలు, కెనడాలో 5 కోట్ల రూపాయలు, ఆస్ట్రేలియాలో 4 కోట్ల రూపాయలు, న్యూజిలాండ్‌లో 50 లక్షలు, ఇతర దేశాల్లో 5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో సుమారుగా 40 కోట్ల రూపాయలు రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ప్రస్తుత ట్రెండ్ పరిశీలిస్తే.. ఈ సినిమా ప్రీమియర్లు, తొలి రోజు కలెక్షన్లు భారీగానే రికార్డు స్థాయిలో ఉంటాయని అంచనా వేస్తున్నారు. తాజా అంచనాల ప్రకారం.. అడ్వాన్స్ బుకింగ్ సుమారుగా 100 కోట్లకుపైగా నమోదు అయిన నేపథ్యంలో ఈ సినిమా తొలి రోజు 200 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా తొలి వారం అంటే మూడు రోజుల్లో 300 కోట్లకుపైగా వసూళ్లను రాబడుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు నమోదైన షారుక్, ప్రభాస్ సినిమాల కలెక్షన్లను అధిగమిస్తుందని జోస్యం చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X