Dhurandhar 2 Day 1 Collection: షారుఖ్ రికార్డ్‌పై రణ్‌వీర్ మూవీ గురి.. ధురంధర్‌ 2కి తొలిరోజు ఎన్ని కోట్లంటే?

2026వ సంవత్సరంలో భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమాలలో ముందు వరుసలో ఉంటుంది ధురంధర్ 2. ఆదిత్య ధార్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 1300 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్‌తో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో 4వ స్థానంలో నిలిచింది.

ధురంధర్ 2పై భారీ అంచనాలు
ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని 2026 మార్చి 19న ధురంధర్ 2 విడుదలవుతుందని ముందే ప్రకటించింది చిత్రయూనిట్. దాంతో దేశప్రజలు ఈ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ రికార్డులు బద్ధలవుతాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తొలిరోజు ధురంధర్ 2 ఎన్ని కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబడుతుందోనని ఉత్కంఠ నెలకొంది. దీనిపై ట్రేడ్ పండితులు రకరకాల అంచనాలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ వివరాల్లోకి వెళితే..

Dhurandhar 2 Day 1 Predicted Box Office Collections Worldwide Ranveer Singh Movie ready to break Shah Rukh Khan s Jawan Record

ధురంధర్ 2 తారాగణం
ధురంధర్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి ధురంధర్ : ది రివెంజ్ అనే టైటిల్ ఖరారు చేశారు. జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్‌పై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే‌లు సంయుక్తంగా నిర్మిస్తుండగా.. ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రణ్‌వీర్ సరసన సారా అర్జున్ హీరోయిన్‌గా నటించారు. అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, రాకేష్ బేడీ, సౌమ్య టాండన్, గౌరవ్ గెరా, మానవ్ గోహిల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. వికాస్ నౌలఖ సినిమాటోగ్రాఫర్‌గా, శివకుమార్ వి పానికర్ ఎడిటర్‌గా సేవలందించారు. శాశ్వత్ సచ్‌దేవ్ సంగీత దర్శకత్వం వహించారు. ఉగాది, రంజాన్, గుడి పడ్వా పర్వదినాలను పురస్కరించుకుని మార్చి 19న తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ధురంధర్ 2 వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.

దురంధర్ 2 బడ్జెట్ & ప్రీ రిలీజ్ బిజినెస్
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ధురంధర్ 2 మూవీకి 475 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు (మొదటి భాగంతో కలిపి) బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ధురంధర్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన నేపథ్యంలో సెకండ్ పార్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగినట్లుగానే ధురంధర్ 2 థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దాదాపు 150 కోట్ల రూపాయలు వెచ్చించి దక్కించుకుంది. అలాగే శాటిలైట్ రైట్స్ 50 కోట్ల రూపాయలకు, మ్యూజిక్ రైట్స్ 45 కోట్ల రూపాయల మేర మొత్తంగా ధురంధర్ 2 ఇప్పటి వరకు 250 కోట్ల రూపాయల నాన్ థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికే ధురంధర్ 2 ప్రాఫిట్ జోన్‌లోకి వచ్చేసినట్లుగా ట్రేడ్ వర్గాల అంచనా.

దురంధర్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్
ధురంధర్ 2 మూవీ తొలిరోజున రికార్డ్ ఓపెనింగ్స్ సాధిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫస్ట్ డే ఇండియాలో అవలీలగా 100 కోట్ల రూపాయల మార్క్ సాధిస్తుందని భావిస్తున్నారు. అదే జరిగితే ఓ బాలీవుడ్ మూవీ ఇండియాలో తొలిరోజు 100 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ధురంధర్ 2 నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే ఓవర్సీస్ నుంచి రణ్‌వీర్ సింగ్ మూవీకి మరో 50 కోట్ల రూపాయల వసూళ్లు వస్తాయని చెబుతున్నారు. తద్వారా తొలిరోజు ధురంధర్ 2 మూవీకి 150 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ ఖాయమని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దీంతో తొలిరోజు అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన బాలీవుడ్ మూవీగా ఉన్న షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ మూవీ రికార్డ్‌ను ధురంధర్ బద్ధలు కొడుతుందని భావిస్తున్నారు.

టాక్సిక్ నుంచి జవాన్‌కు పోటీ
జవాన్ మూవీ తొలిరోజున ఇండియాలో 90 కోట్ల రూపాయలు, విదేశాల్లో 40 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 130 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. ప్రస్తుతం ధురంధర్ 2 ఊపు చూస్తుంటే ఈ రికార్డ్‌ను అవలీలగా దాటేస్తుందని విశ్లేషకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే కన్నడ సూపర్‌స్టార్ యష్ నటించిన టాక్సిక్ నుంచి ధురంధర్ 2కి గట్టి పోటీ ఎదురుకానుంది. మరి రణ్‌వీర్ సింగ్ ఎంత వరకు అంచనాలను అందుకుంటాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X