Dhurandhar 2 Hindi Box Office: ధురంధర్ బాక్సాఫీస్ విస్పోటనం.. 2 రోజుల్లో ఎన్ని కోట్లంట్లే?

Dhurandhar 2 Box Office Collections: బాలీవుడ్ స్టార్ హీరోలు రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన యాక్షన్ స్పై థ్రిల్లర్ 'ధురంధర్: ది రివేంజ్'(Dhurandhar 2). ఈ మూవీ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు రచన, నిర్మాణం, దర్శకత్వం చేపట్టిన ఆదిత్య ధార్ ఈ సినిమాను అత్యంత గ్రాండియర్‌గా రూపొందించారు.

జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై తెరకెక్కిన ధురంధర్ 2 ఇండియా స్థాయిలో హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా విడుదలైంది. విడుదలైన మొదటి నుంచే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతూ, ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీమియర్ వసూళ్లు ఎంత? రెండు రోజుల కలెక్షన్ల వివరాలు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Dhurandhar 2 Hindi Box Office Report Ranveer Singh s film Creates Box Office Storm in Just 2 Days

భారీ అంచనాల మధ్య విడుదలైన 'ధురంధర్: ది రివేంజ్' సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. సాక్ నిల్క్ అంచనాల ప్రకారం.. ధురంధర్ మూవీ తొలి రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 333.39 కోట్ల గ్రాస్ (ప్రీమియర్స్ తో పాటు) వసూళ్లు చేసింది. ఇందులో ఇండియా గ్రాస్ రూ. 269.39 కోట్లు కాగా, ఇండియా నెట్ రూ. 226.27 కోట్లుగా నమోదైంది. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ సినిమా దుమ్మురేపుతోంది. ఇక్కడ కూడా రూ.64 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

ఈ మొత్తం కలెక్షన్స్‌లో 80 శాతం ఇండియా నుంచే రావడం చూస్తే.. ఈ సినిమాకు ఎలాంటి క్రేజ్ ఉందో అర్థమవుతోంది. ముఖ్యంగా హిందీ బాక్సాఫీస్ వద్ద ధురంధర్ మూవీ విధ్వంసం సృష్టస్తోంది. ప్రీమియర్స్‌తోనే రూ. 43 కోట్ల భారీ ఓపెనింగ్ సాధించిన ఈ సినిమా, మొదటి రోజే రూ. 99.1 కోట్ల వసూళ్లతో రికార్డు స్థాయి కలెక్షన్స్ నమోదు చేసింది. రెండో రోజూ అదే జోరు కొనసాగిస్తూ రూ.78.94 కోట్లు రాబట్టింది. మొత్తంగా హిందీ నెట్ కలెక్షన్ రూ. 218.72 కోట్లు వసూళు చేసింది. ఈ కలెక్షన్స్ బట్టి చూస్తే.. ఈ సినిమాకు ఉన్న క్రేజ్‌ను స్పష్టంగా తెలియజేస్తోంది.

'ధురంధర్: ది రివేంజ్' బాక్సాఫీస్ వద్ద విధ్వంసం క్రియేట్ చేస్తోంది. కేవలం 2 రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ నుంచే సుమారు రూ. 226.27 కోట్ల నెట్ వసూళ్లు సాధించడం ఈ సినిమా రేంజ్‌ను స్పష్టంగా తెలియజేస్తోంది. ఇప్పటికే రూ. 300 కోట్ల క్లబ్‌లోకి చేరిన ఈ మూవీ మరిన్ని రికార్డుల దిశగా పయనిస్తోంది. అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' పేరిట ఉన్న అత్యధిక ఓపెనింగ్ వీకెండ్ రికార్డును బ్రేక్ చేయాలంటే ఈ సినిమాకు ఇంకా దాదాపు రూ. 128 కోట్ల వసూళ్లు అవసరం ఉంది. ఇక విడుదలైన రెండో రోజే ఈ సినిమా పలు కీలక రికార్డులను బద్దలు కొట్టడం విశేషం.

యష్ నటించిన 'కేజీఎఫ్: చాప్టర్ 2' రెండో రోజు వసూళ్లు (₹90.50 కోట్లు), అలాగే 'పుష్ప 2' రెండో రోజు సాధించిన రూ. 96 కోట్లను కూడా 'ధురంధర్ 2' అధిగమించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇది సినిమాపై ఉన్న క్రేజ్ ఎంతగా ఉందో చెప్పకనే చెప్పుతోంది. ముఖ్యంగా ఇంకా పూర్తి వీకెండ్ ముగియకముందే ఈ స్థాయి వసూళ్లు రావడం గమనార్హం. శని, ఆదివారాల్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగితే, 'పుష్ప 2' నెలకొల్పిన రూ. 354 కోట్ల తొలి వీకెండ్ రికార్డు కూడా బ్రేక్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక తాజాగా తమిళ, తెలుగు వెర్షన్లు కూడా విడుదలవుతుండటంతో, ఈ సినిమాకు మరింత కలెక్షన్లు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి చూస్తే, వీకెండ్‌లో ఒక్కో రోజు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసే అవకాశమూ ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే జోరు కొనసాగితే 'ధురంధర్: ది రివేంజ్' భారతీయ సినీ చరిత్రలో కొత్త రికార్డులను సృష్టించబోతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X