1810 కోట్ల బాహుబలి 2 టార్గెట్.. ధురంధర్ 2 ఎన్ని కోట్ల దూరంలో అంటే?
ధురంధర్ ది రివెంజ్ చిత్రం 5వ వారంలో కూడా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల తడాఖా చూపిస్తున్నది. 5వ ఆదివారం రోజు కూడా రికార్డు స్థాయి కలెక్షన్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం భారతీయ సినిమా రంగంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఘనతను సాధించేందుకు రెడీ అవుతున్నది. త్వరలోనే బాహుబలి ది కన్‌క్లూజన్ లైఫ్ టైమ్ రికార్డును అధిగమించేందుకు పరుగులు పెడుతున్నది. ఈ సినిమా గత 32 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
పాకిస్థాన్‌లో ఇండియన్ సీక్రెట్ ఏజెంట్ ధురంధర్ ఆపరేషన్ నేపథ్యంగా సాగే ఈ సినిమా కోసం థాయ్‌లాండ్‌లో భారీ సెట్స్‌ను వేశారు. బ్యాంకాక్‌లో కరాచీ నగరాన్ని సృష్టించి ఈ సినిమాను షూట్ చేశారు. ఈ చిత్రం పార్ట్ 1 కోసం 200 కోట్ల రూపాయలు, పార్ట్ 2 కోసం 250 కోట్ల రూపాయలతో మొత్తంగా ఈ మూవీని 450 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ధురంధర్ పార్ట్ 1 సుమారుగా 1300 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టి భారీ లాభాలను పంచిపెట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ధురంధర్ 2 చిత్రం మార్చి 18వ తేదీన ప్రీమియర్లతో ప్రపంచ బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది. ఇండియాలో ప్రీమియర్ల ద్వారా 52 కోట్ల రాబట్టిన ఈ చిత్రం తొలి రోజు 123 కోట్ల రూపాయలతో వసూళ్ల జైత్రయాత్రను మొదలుపెట్టింది. తొలివారం ముగిసే సమయానికి ఈ చిత్రం 674 కోట్ల రూపాయలు ఇండియాల వసూలు చేసింది. రెండో వారంలో 264 కోట్ల రూపాయల కలెక్షన్లను నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం ఇండియాలోనే 1000 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ధురంధర్ 2 చిత్రం మూడో వారంలో అదే జోష్‌ను కొనసాగించింది. ఈ చిత్రం 110 కోట్ల రూపాయలు, నాలుగో వారంలో 54 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ చిత్రం 30వ రోజున 3.24 కోట్ల రూపాయలు, 31వ రోజున 5.58 కోట్ల రూపాయలు, 32వ రోజున 6.23 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం గత 32 రోజుల్లో 1115 కోట్ల రూపాయలు నెట్ కలెక్షన్లను దేశవ్యాప్తంగా రాబట్టింది అని సాక్ నిక్ వెల్లడించింది.
ధురంధర్ 2 చిత్రం ఓవర్సీస్‌లో కూడా వసూళ్ల తుఫాన్‌ను క్రియేట్ చేసింది. నార్త్ అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, ఇతర దేశాల్లో ఈ చిత్రం 45 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 423 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 1153 కోట్ల రూపాయల నెట్, 1360 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఓవర్సీస్ కలెక్షన్లతో కలుపుకొని ఈ చిత్రం 1783 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.
భారతీయ సినిమా బాక్సాఫీస్ చరిత్రలో 2017 సంవత్సరం నుంచి బాహుబలి 2 సినిమాపైనే అత్యధిక వసూళ్లు అంటే 1810 కోట్ల రూపాయలు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా రికార్డును ధురంధర్ 2 చిత్రం అధిగమించేందుకు రెడీ అవుతున్నది. ఇంకా 23 నుంచి 24 కోట్ల రూపాయలు వసూలు చేస్తే బాహుబలి 2 రికార్డు మాయం అవ్వడం ఖాయంగా కనిపిస్తున్నది. త్వరలోనే ఈ చిత్రం ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా, మిడిల్ ఈస్ట్‌లో రిలీజ్ కాకుండా ఈ రేంజ్ వసూళ్లను సాధించిన చిత్రంగా అరుదైన ఘనతను సొంతం చేసుకోనున్నది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications