Dhurandhar 2 Karnataka Collection: ఓజీ, కాంతార చాప్టర్ 1 రికార్డ్స్ బ్రేక్.. కర్ణాటకలో ధురంధర్ 2కు ఎంతంటే?

ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 మూవీ సంచనాలు సృష్టిస్తోంది. బాక్సాఫీస్ కలెక్షన్స్‌తో పాటు భారీ రికార్డులను కూడా బ్రేక్ చేస్తూ ఎదురు లేకుండా సాగుతోంది. సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా విధ్వంసం సాగిస్తోంది. ఉత్తరాదితో పాటు తనకు అంతగా బలం లేని దక్షిణాదిలో ఈసారి గట్టిగా కొట్టాలని ధురంధర్ 2 ఫిక్స్ అయ్యింది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో రణ్‌వీర్ సింగ్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ వివరాల్లోకి వెళితే...

ధురంధర్ 2 తారాగణం
జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్‌పై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే‌లు సంయుక్తంగా ధురంధర్ 2 చిత్రాన్ని నిర్మించారు. రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్‌లు హీరో హీరోయిన్‌లుగా నటించారు. అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, రాకేష్ బేడీ, సౌమ్య టాండన్, గౌరవ్ గెరా, మానవ్ గోహిల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. వికాస్ నౌలఖ సినిమాటోగ్రాఫర్‌గా, శివకుమార్ వి పానికర్ ఎడిటర్‌గా సేవలందించారు. శాశ్వత్ సచ్‌దేవ్ సంగీత దర్శకత్వం వహించారు. మార్చి 19న ధురంధర్ 2 మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో వరల్డ్ వైడ్‌గా రిలీజైంది.

Dhurandhar 2 Karnataka Collection Ranveer Singh s film Breaks Kantara Chapter 1 and OG Records with Massive Premier Collections

ధురంధర్ 2 బడ్జెట్ ఎంత?
నటీనటుల రెమ్యునరేషన్లు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ధురంధర్ 2 మూవీకి 280 కోట్ల రూపాయల మేర బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 280 కోట్ల రూపాయల షేర్.. 600 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. ఇప్పటికే నాన్ థియేట్రికల్ రైట్స్‌ ద్వారా ఈ మూవీ 250 నుంచి 300 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది.

ధురంధర్ 2 తొలిరోజు కలెక్షన్స్
ధురంధర్ 2 మూవీ ప్రీమియర్స్, అడ్వాన్స్ బుకింగ్‌లో దుమ్మురేపింది. 12,735 ప్రీమియర్స్ ప్రదర్శితమై.. 51 శాతం ఆక్యూపెన్సీ సాధించింది. తద్వారా ఇండియా వైడ్‌గా కేవలం ప్రీమియర్స్ ద్వారా 43 కోట్ల రూపాయల నెట్ రాబట్టింది. ఇక తొలిరోజున దేశవ్యాప్తంగా 21, 728 షోలకు గాను 71.3 శాతం ఆక్యూపెన్సీతో 102.55 కోట్ల నికర వసూళ్లు అందుకుంది. మొత్తంగా ప్రీమియర్స్ + డే 1 కలెక్షన్స్‌తో ఇండియాలో 146 కోట్ల రూపాయల నెట్ రాబట్టిన ధురంధర్ 2 అరుదైన రికార్డ్ సాధించింది. బాలీవుడ్‌లో హయ్యెస్ట్ ఓపెనర్‌గా ఉన్న షారుఖ్ ఖాన్ జవాన్ రికార్డ్‌ను బద్ధలు కొట్టంది. మొత్తంగా తొలిరోజున 172.63 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది ధురంధర్ 2. ఓవర్సీస్‌లో మరో 70 కోట్ల వసూళ్లతో వరల్డ్ వైడ్‌గా తొలిరోజున 240 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టి సంచలనం సృష్టించింది.

ధురంధర్ 2 కర్ణాటక కలెక్షన్స్
కర్ణాటకలో తొలి నుంచి తెలుగు, తమిళ సినిమాలదే హవా.. ఇప్పుడు ధురంధర్ 2 ఈ పరిస్ధితిని మారుస్తోంది. ప్రీమియర్స్, అడ్వాన్స్ బుకింగ్‌లో రణ్‌వీర్ సింగ్ తన సత్తా చాటింది. పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా ఈ చిత్రం 6.74 కోట్ల రూపాయలు రాబట్టింది. తొలిరోజున కర్ణాటక వ్యాప్తంగా 1568 షోలు ప్రదర్శితమయ్యాయి. కన్నడ గడ్డపై ఫస్ట్ డే ధురంధర్ 2 మూవీ 9 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

ఓజీ, కాంతార చాప్టర్ 1 రికార్డ్స్ బ్రేక్
ఇదిలాఉండగా.. ప్రీమియర్ షో కలెక్షన్స్ విషయంలోనూ ధురంధర్ 2 కర్ణాటకలో అరుదైన రికార్డ్‌ను కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు కర్ణాటకలో పెయిడ్ ప్రీమియర్స్‌లో కాంతార చాప్టర్ 1 (3.73 కోట్ల రూపాయలు) టాప్‌లో ఉండేది. ఇప్పుడు ఆ రికార్డ్‌ను ధురంధర్ 2 (6.74 కోట్ల రూపాయలు) బద్ధలు కొట్టింది. ఈ రెండు చిత్రాల తర్వాత ఓజీ (2.72 కోట్ల రూపాయలు), ది రాజాసాబ్ (2.61 కోట్ల రూపాయలు), పుష్ప 2 (2.55 కోట్ల రూపాయలు) ఉన్నాయి. ఇప్పుడు ధురంధర్ 2 ఒకేసారి ఓజీ, కాంతార చాప్టర్ 1 రికార్డులను బద్ధలు కొట్టి.. కర్ణాటకలో ప్రీమియర్స్ కలెక్షన్స్ విషయంలో టాప్‌లో నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X