Dhurandhar 2 vs Baahubali 2: ధురంధర్ 2 బాక్సాఫీస్ జైత్రయాత్ర.. డేంజర్‌ జోన్‌లో బాహుబలి 2 రికార్డ్‌!

ఆదిత్యధర్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. దాదాపు 20 రోజులు కావొస్తున్నా ఈ సినిమా హవా ఏమాత్రం తగ్గలేదు. నార్త్, సౌత్, ఓవర్సీస్ అన్న తేడా లేకుండా వసూళ్ల వర్షం కురిపిస్తోంది ధురంధర్ 2. ఇప్పటికే 1600 కోట్ల రూపాయల మార్క్ దాటేసిన ఈ సినిమా.. 2000 కోట్ల వసూళ్ల దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 రికార్డ్‌పై ధురంధర్ 2 కన్నేసింది. ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
Rakasa Day 5 Collections: ఆ క్లబ్‌లోకి రాకాస మూవీ.. నిహారిక మూవీకి 5వ రోజు కలెక్షన్స్ ఎంతంటే?
Rakasa Day 5 Collections: ఆ క్లబ్‌లోకి రాకాస మూవీ.. నిహారిక మూవీకి 5వ రోజు కలెక్షన్స్ ఎంతంటే?

ధురంధర్ 2 తారాగణం
జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్‌పై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే‌లు సంయుక్తంగా ధురంధర్ 2 చిత్రాన్ని నిర్మించారు. రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్‌లు హీరో హీరోయిన్‌లుగా నటించారు. అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, రాకేష్ బేడీ, సౌమ్య టాండన్, గౌరవ్ గెరా, మానవ్ గోహిల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. వికాస్ నౌలఖ సినిమాటోగ్రాఫర్‌గా, శివకుమార్ వి పానికర్ ఎడిటర్‌గా సేవలందించారు. శాశ్వత్ సచ్‌దేవ్ సంగీత దర్శకత్వం వహించారు. మార్చి 19న ధురంధర్ 2 మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో వరల్డ్ వైడ్‌గా రిలీజైంది.

Dhurandhar 2 Karnataka Collection Ranveer Singh s film heading to Breaks historic baahubali-2 record

ధురంధర్ 2 బడ్జెట్ ఎంత?
నటీనటుల రెమ్యునరేషన్లు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ధురంధర్ 2 మూవీకి 280 కోట్ల రూపాయల మేర బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 280 కోట్ల రూపాయల షేర్.. 600 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. ఆంధ్రా, నైజాంలలో నిర్మాతలతో పాటు జియో స్టూడియోస్ సంస్థ స్వయంగా ధురంధర్ 2ను రిలీజ్ చేసింది.

Recommended For You
మృణాల్ ఠాకూర్‌కు అక్కినేని హీరో క్షమాపణ.. తప్పు చేశానంటూ..
మృణాల్ ఠాకూర్‌కు అక్కినేని హీరో క్షమాపణ.. తప్పు చేశానంటూ..

ధురంధర్ ది రివెంజ్ రోజుల కలెక్షన్స్
తొలివారం ఈ సినిమాకు 623.42 కోట్ల రూపాయలు, రెండో వారం 245.85 కోట్ల రూపాయలు, 15వ రోజున 17.80 కోట్ల రూపాయలు, 16వ రోజున 21.55 కోట్ల రూపాయలు, 17వ రోజున 25.65 కోట్ల రూపాయలు, 18వ రోజున 28.75 కోట్ల రూపాయలు, 19వ రోజున 7.29 కోట్ల రూపాయలు, 20వ రోజున 10.10 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మొత్తంగా 20 రోజుల వరకు ఇండియాలో ధురంధర్ 2 మూవీ 1033.37 కోట్ల రూపాయల నెట్... 1237.21 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.

You May Also Like
పవన్ కళ్యాణ్- అన్నా కొణిదెల లవ్‌స్టోరీ.. ఫస్ట్ ప్రపోజ్ ఎవరిది? పవన్ సతీమణి ఆన్సర్ ఇదే!
పవన్ కళ్యాణ్- అన్నా కొణిదెల లవ్‌స్టోరీ.. ఫస్ట్ ప్రపోజ్ ఎవరిది? పవన్ సతీమణి ఆన్సర్ ఇదే!

హిందీలో 974 కోట్ల రూపాయలు, తెలుగులో 42 కోట్ల రూపాయలు, తమిళంలో 16.5 కోట్ల రూపాయలు, కన్నడంలో 3 కోట్ల రూపాయలు, మలయాళంలో 1.80 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 400 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ధురంధర్ 2 చిత్రం 20 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 1637.21 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది.

Peddi OTT: ఓటీటీలో పెద్దికి రికార్డు బిజినెస్.. రాంచరణ్ మూవీకి ఎన్ని కోట్ల డీల్ అంటే?
Peddi OTT: ఓటీటీలో పెద్దికి రికార్డు బిజినెస్.. రాంచరణ్ మూవీకి ఎన్ని కోట్ల డీల్ అంటే?

బాహుబలి 2 రికార్డ్‌పై ధురంధర్ 2 కన్ను
బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోన్న ధురంధర్ 2 చిత్రం కర్ణాటకలో అరుదైన ఘనత దిశగా దూసుకెళ్తోంది. ఏకంగా బాహుబలి 2 రికార్డ్‌ పైనే గురిపెట్టింది. బాహుబలి 2 తన థియేట్రికల్ రన్ ముగిసేసరికి కర్ణాటకలో 130 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. ప్రస్తుతం ధురంధర్ 2.. కేవలం 18 రోజుల్లోనే కర్ణాటకలో 121 కోట్లకు పైగా వసూలు చేసింది. మరో 10 కోట్ల రూపాయలు సాధిస్తే.. కర్ణాటకలో అత్యధిక వసూళ్లు సాధించిన నాన్ - కన్నడ మూవీగా ఉన్న బాహుబలి 2 రికార్డ్‌ను ధురంధర్ 2 అధిగమించనుంది. ఆ తర్వాతి స్థానంలో పుష్ప 2 (95.3 కోట్ల రూపాయలు), బాహుబలి (85 కోట్ల రూపాయలు), ధురంధర్ (82 కోట్ల రూపాయలు)తో ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X