1000 కోట్లతో ధురంధర్ 2 కలెక్షన్ల జైత్రయాత్ర.. బాహుబలి 2 రికార్డుకు బీటలు!
ధురంధర్ ది రివెంజ్ సినిమా భారతీయ సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. ప్రాంతీయ భాషల్లో సంచలన రీతిలో వసూళ్లు రాబడుతూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నది. ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అరుదైన ఘనతను సాధించింది. ఈ చిత్రం గత 15 రోజల్లో ఇండియాలో 1000 కోట్ల క్లబ్‌లో చేరి బాక్సాఫీస్ వద్ద నూతన అధ్యాయాన్ని లిఖించింది. దర్శకుడు ఆదిత్య ధార్ రూపొందించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల వివరాలు, ఈ సినిమా సాధించిన ఘనత గురించిన విశేషాల్లోకి వెళితే..
ధురంధర్ 2 చిత్రం ప్రీమియర్ల ద్వారానే సుమారుగా 50 కోట్ల కొల్లగొట్టింది. ఇండియాలో ఈ చిత్రం తొలి రోజు 102 కోట్లు, రెండో రోజు 80 కోట్ల రూపాయలు, మూడో రోజు 113 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 115 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా 400 కోట్ల రూపాయలను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక తొలి వారం అంటే 8 రోజులు ముగిసే సమయానికి ఈ చిత్రం 675 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లను నమోదు చేసింది.

ఇక రెండో వారంలోను ధురంధర్ 2 సినిమా ప్రభంజనం కొనసాగింది. ఈ సినిమా తొమ్మిదో రోజున 50 కోట్ల రూపాయలు, 10వ రోజున 75 కోట్ల రూపాయలు, 11వ రోజున 82 కోట్ల రూపాయలు, 12వ రోజున 30 కోట్ల రూపాయలు, 13వ రోజున 33 కోట్ల రూపాయలు, 14వ రోజున 24 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా గత 14 రోజుల్లో 920 కోట్ల రూపాయల నెట్, 1150 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇదిలా ఉండగా, ఓవర్సీస్‌లో కూడా ధురంధర్ 2 జైత్రయాత్ర కొనసాగుతున్నది. ఈ చిత్రం నార్త్ అమెరికాలోను, ఓవర్సీస్‌లోను బాహుబలి 2 రికార్డులను తిరగరాస్తున్నది. ఈ చిత్రం ఇప్పటి వరకు విదేశీ బాక్సాఫీస్ వద్ద 365 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 1500 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లకు చేరువైంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా బాహుబలి 2 సినిమా పేరిట రికార్డు ఉంది. ఆ తర్వాత పుష్ప 2, కేజీఎఫ్ 2 చిత్రాలు నిలిచాయి. బాహుబలి 2 సినిమా 1788 కోట్లు, పుష్ప 2 మూవీ 1742 కోట్ల రూపాయలు వసూలు చేసి అగ్రస్థానంలో ఉన్నాయి. ప్రస్తుతం ధురంధర్ 2 చిత్రం 1488 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లతో ఈ రెండు రికార్డులను తుడిచిపెట్టేందుకు సిద్దమవుతున్నది.
బాలీవుడ్ స్టార్ హీరోలు రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ నటించిన చిత్రం ధురంధర్ ది రివెంజ్. ఈ సినిమాకు ఆదిత్య ధార్ రచన, నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తించారు. యాక్షన్, స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు. ఈ చిత్రానికి వికాస్ నౌలాఖ సినిమాటోగ్రఫి, షాష్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్, శివకుమార్ వీ పానికర్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ధురంధర్ 1 చిత్రం డిసెంబర్ 5వ తేదీ 2025 రోజున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది.
ఈ సినిమాలో నటించిన యాక్టర్ల రెమ్యునరేషన్లు, సాంకేతిక నిపుణుల పారితోషికం కలిపి సుమారుగా 250 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాను ప్రేక్షకుల వద్దకు చేర్చడానికి సుమారుగా 30 కోట్ల రూపాయలను ప్రమోషనల్ కోసం ఖర్చు చేశారు. దాంతో పార్ట్ 2 బడ్జెట్ 280 కోట్ల రూపాయల మేర అయింది. ధురంధర్ 1 సినిమామకు 250 కోట్ల రూపాయలు అయిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











