Dhurandhar 2 Overseas Box Office: ఓవర్సీస్‌లో ధురంధర్ 2 సంచలనం.. బాహుబలి 2 లైఫ్‌టైమ్ రికార్డుకు చేరువగా..

ధురంధర్ ది రివెంజ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నది. ఈ సినిమా ఇండియాలోనే కాకుండా పలు దేశాల్లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నది. గత 18 రోజులుగా ఎడతెరపకుండా కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తున్నది. ఈ సినిమా ఇండియాలో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా చరిత్రను తిరగరాసేందుకు రెడీ అవుతున్నది. ఈ చిత్రం ఇప్పటికే మెగా బ్లాక్ బస్టర్‌గా మారింది. ఈ సినిమా ఇప్పటి వరకు సాధించిన ఓవర్సీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ధురంధర్ 2 సినిమా ఓవర్సీస్‌లో యుద్ధం పరిస్థితుల కారణంగా, జియో పాలిటిక్స్ అభ్యంతరాల కారణంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో రిలీజ్ కాలేదు. అయినా ఈ సినిమా భారతీయ సినిమా రంగంలో అత్యధిక వసూళ్లును సాధించిన చిత్రంగా దూసుకెళ్తున్నది. ఇప్పటి వరకు ఇండియన్ మూవీస్ లైఫ్ టైమ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. అమీర్ ఖాన్ నటించిన పీకే చిత్రం 26.5 మిలియన్ డాలర్లు, దిల్ వాలే 26.5 మిలియన్ డాలర్లు, కేజీఎఫ్ 27 మిలియన్ డాలర్లు, RRR 27.4 మిలియన్ డాలర్లు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Dhurandhar 2 Vs Baahubali 2

నార్త్ అమెరికాలో ధురంధర్ 2 చిత్రం భారీగా కలెక్షన్లను రాబడుతున్నది. ఈ చిత్రం మూడో ఆదివారం రోజున కూడా 670K డాలర్లు అంటే 6.25 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇప్పటి వరకు ఈ సినిమా అమెరికా, కెనడాలో కలిపి 26 మిలియన్ డాలర్లు అంటే 242 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ధురంధర్ 2 సినిమా కేవలం నార్త్ అమెరికాలోనే కాకుండా యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరప్‌లోని పలు దేశాల్లో భారీగా వసూళ్లను రాబడుతున్నది. జర్మనీలో రికార్డు కలెక్షన్లను సాధించి అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా సంచలనం క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఓవర్సీస్‌లో ఈ చిత్రం 41.5 మిలియన్ డాలర్లు అంటే 385 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ధురంధర్ 2 సినిమా కలెక్షన్ల విజృంభణకు బాహుబలి 2 లాంటి పక్కకు తప్పుకొన్నాయి. నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు అత్యధికంగా వసూళ్లను సాధించిన చిత్రాల్లో బాహుబలి 2 చిత్రం 20.8 మిలియన్ డార్లు, ధురంధర్ 20.65 మిలియన్ డాలర్లు, కల్కి 2898 ఏడీ 18.6 మిలియన్ డాలర్లు, పఠాన్ చిత్రం 17.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ధురంధర్ 2 సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రం హిందీ వెర్షన్ 1000 కోట్ల కొల్లగొట్టేందుకు రెడీ అవుతున్నది. ఈ చిత్రం ఇప్పటికే 900 కోట్ల రూపాయల మైలురాయిని దాటేసింది. ఇప్పటి వరకు ఈ సినిమా 1200 కోట్ల రూపాయల నెట్, 1450 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసింది. ఈ చిత్రం బాహుబలి 2 సినిమా వసూలు చేసిన 1700 కోట్ల రూపాయల కలెక్షన్లను టార్గెట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X