Dhurandhar 2 North America Collections: యూఎస్‌లో ధురంధర్ ప్రభంజనం.. బాహుబలి 2 రికార్డుకు చేరువగా.. ఎన్ని కోట్ల
ప్రపంచవ్యాప్తంగా ధురంధర్ ది రివెంజ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని క్రియేట్ చేస్తున్నది. ఈ చిత్రం భారతీయ సినిమా రంగంలో ఇప్పటి వరకు ఉన్న రికార్డులను తిరుగరాసేందుకు పరుగులు పెడుతున్నది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధార్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లను నమోదు చేస్తున్నది. ఈ చిత్రం నార్త్ అమెరికాలో బాక్సాఫీస్ ప్రభంజనాన్ని తలపిస్తున్నది. ఈ సినిమా నార్త్ అమెరికాలో గత 6 రోజులుగా వసూలు చేస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు భారతీయ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రాజమౌళి దర్వకత్వంలో వచ్చిన బాహుబలి 2 ది కన్‌క్లూజన్ పేరిట ఉంది. ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో 22 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. తాజా లెక్కల ప్రకారం.. సుమారుగా 210 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అప్పట్లో ఈ చిత్రం అమెరికా, కెనడాలో 100 కోట్లు వసూలు చేసిన తొలి చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. అప్పటి నుంచి ఈ సినిమాపైనే అన్నీ రికార్డులు దాఖలై ఉన్నాయి.

ప్రస్తుతం బాహుబలి 2 సినిమా బాక్సాఫీస్ రికార్డుపై ధురంధర్ 2 కన్నేసింది. ఈ చిత్రం తొలి రోజు నుంచి భారీగా వసూళ్లను నమోదు చేస్తున్నది. ప్రీమియర్ల ద్వారానే 2 మిలియన్ డాలర్లు వసూలు చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తన హావాను జోరుగా కొనసాగిస్తున్నది. ఈ చిత్రం తొలి రోజు 1.95 మిలియన్ డాలర్లు, రెండో రోజు 2.93 మిలియన్ డాలర్లు, మూడో రోజు 3.91 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. తొలి వారాంతంలోనే ఈ సినిమా సుమారుగా 8 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.
ధురంధర్ 2 చిత్రం తొలి వారాంతం తర్వాత కూడా అదే జోష్‌ను కొనసాగిస్తున్నది. ఈ సినిమా నాలుగో రోజు 3.10 మిలియన్ డాలర్లు, 5వ రోజు 1.13 మిలియన్ డాలర్లు, ఆరో రోజు 1.01 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 16 మిలియన్ డాలర్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. అమెరికా, కెనడాలో కలిపి ఈ చిత్రం 150 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే ఈ చిత్రం బాహుబలి 2 రికార్డులను తిరుగరాస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే.. ఈ సినిమా గత 6 రోజుల్లోనే 28 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అంటే భారతీయ కరెన్సీలో ఈ సినిమా ఇప్పటి వరకు 263 కోట్ల రూపాయలకుపైగా కలెక్షన్లు రాబట్టింది. అయితే అప్పట్లో బాహుబలి 2 చిత్రం సుమారుగా 290 కోట్లకుపైగా కలెక్షన్లు నమోదు చేసింది. త్వరలోనే ఈ సినిమా ఆ రికార్డును అధిగమించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించిన ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్ మాధవన్, యామీ గౌతమి, సారా ఆర్జున్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి వికాస్ నౌలాఖ సినిమాటోగ్రఫి, షాష్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్, శివకుమార్ వీ పానికర్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ధురంధర్ 1 చిత్రం డిసెంబర్ 5వ తేదీ 2025 రోజున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజై సంచలన విజయం సాధించింది. ఈ సినిమా రెండో భాగం మార్చి 19వ ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











