Dhurandhar 2 Vs OG: ఓజీని కొట్టలేకపోయిన ధురంధర్ 2.. సునామీలో పవన్ రికార్డు సేఫ్!

Dhurandhar 2 Vs OG: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, డైరెక్టర్ ఆదిత్యధర్ కాంబోలో తెరకెక్కిన సినిమా 'ధురంధర్ 2'. మూవీ విడుదల నాటి నుంచి సంచనాలు సృష్టిస్తోంది. బాక్సాఫీస్ కలెక్షన్స్‌తో పాటు భారీ రికార్డులను కూడా బ్రేక్ చేస్తుంది. ఆ సినిమాకు పోటీ లేకుండా లేకుండా దూసుకపోతుంది. సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా విధ్వంసం సాగిస్తోంది. సౌత్ లో అంత ప్రాబల్యం లేకపోయిన ఈసారి గట్టిగా కొట్టాలని ధురంధర్ 2 ఫిక్స్ అయ్యింది. అయితే.. ఎన్నో నయా రికార్డులను క్రియేట్ చేసిన ధురంధర్ 2.. పవన్ కళ్యాణ్ ఓజీ రికార్డును మాత్రం కొట్టలేకపోతుంది. ఇంతకీ ఆ రికార్డు?

జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్‌పై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే‌లు సంయుక్తంగా ధురంధర్ 2 సినిమాను నిర్మించారు. ఈ మూవీలో రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్‌లు హీరో హీరోయిన్‌లుగా నటించగా.. అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, రాకేష్ బేడీ, సౌమ్య టాండన్, గౌరవ్ గెరా, మానవ్ గోహిల్ తదితరులు కీలకపాత్రలో కనిపించారు. వికాస్ నౌలఖ సినిమాటోగ్రాఫర్‌గా, శివకుమార్ వి పానికర్ ఎడిటర్‌గా సేవలందించారు. శాశ్వత్ సచ్‌దేవ్ సంగీత దర్శకత్వం వహించారు. మార్చి 19న ధురంధర్ 2 మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో వరల్డ్ వైడ్‌గా రిలీజైంది.

Dhurandhar 2 vs OG Ranveer Film Misses Global Premiere Record Sets New Benchmarks

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ధురంధర్ 2 సినిమా మొత్తం వ్యయం సుమారు రూ.280 కోట్ల వరకు చేరింది. ఇందులో నటీనటుల రెమ్యునరేషన్లు, టెక్నీషియన్స్ పారితోషికాలు, అలాగే ప్రమోషన్ ఖర్చులు కూడా ఉన్నాయి. ఈ పెట్టుబడిని తిరిగి సంపాదించి లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద కనీసం రూ.280 కోట్ల షేర్, సుమారు రూ.600 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అవసరమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ.250 నుంచి రూ.300 కోట్ల వరకు బిజినెస్ జరగడం సినిమాకి పెద్ద ప్లస్‌గా మారింది.

ధురంధర్ 2 విడుదలకు ముందే ప్రీమియర్స్, అడ్వాన్స్ బుకింగ్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. దేశవ్యాప్తంగా 12,735 ప్రీమియర్ షోలు ప్రదర్శించబడగా, సుమారు 51% ఆక్యూపెన్సీ నమోదు అయింది. ఈ ప్రీమియర్స్ ద్వారానే సినిమా రూ.43 కోట్ల నెట్ వసూళ్లు సాధించడం విశేషం. ఇక మొదటి రోజు దేశవ్యాప్తంగా 21,728 షోలు ప్రదర్శించగా, 71.3% ఆక్యూపెన్సీతో రూ.102.55 కోట్ల నెట్ కలెక్షన్స్ నమోదు చేసింది. దీంతో ప్రీమియర్స్‌తో కలిపి ఇండియాలో మొత్తం రూ.146 కోట్ల నెట్ వసూళ్లు సాధించి అరుదైన రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో బాలీవుడ్‌లో ఇప్పటి వరకు ఉన్న జవాన్ ఓపెనింగ్స్ రికార్డును కూడా ధురంధర్ 2 బ్రేక్ చేసింది. మొత్తం మొదటి రోజు భారత్‌లో రూ.172.63 కోట్ల గ్రాస్ రాబట్టగా, ఓవర్సీస్‌లో డే 1 మరో రూ.70 కోట్ల వసూళ్లు చేసింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.240 కోట్ల ఓపెనింగ్స్ సాధించి సంచలనం సృష్టించింది.

ఇదిలా ఉంటే..ఆ క్రమంలో ధురంధర్ మూవీ దేశవ్యాప్తంగా పెయిడ్ ప్రీమియర్స్ ద్వారానే రూ.43 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ OG (They Call Him OG)మూవీ నమోదు చేసిన రూ. 30.95 కోట్ల ప్రీమియర్ రికార్డును భారీ మార్జిన్‌తో బద్దలు కొట్టింది. ఇంతకుముందు ఉన్న స్త్రీ మూవీ ప్రీమియర్ రికార్డు (రూ.8.75 కోట్లు)ను కూడా దాటి, ఇప్పుడు కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. ముఖ్యంగా హిందీ వెర్షన్ ఒక్కటే సుమారు రూ. 43 కోట్ల వరకు వసూళ్లు రాబట్టడం విశేషం. మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం) కూడా ఈ కలెక్షన్ల పెరుగుదలకు కీలక కారణమైందట.

ఇలా ఎన్నో రికార్డులను బ్రేక్ చేసిన ధురంధర్ 2 మూవీ పవన్ కళ్యాణ్ ఓజీ రికార్డును మాత్రం బ్రేక్ చేయలేకపోయిందట. అదే గ్లోబల్ ప్రీమియర్స్ రికార్డు. ప్రపంచవ్యాప్తంగా OG ప్రీమియర్స్ ద్వారా రూ.63.55 కోట్లు వసూలు చేసింది. ధురంధర్ 2 విడుదలకు ముందు ఈ రికార్డు బ్రేక్ చేసే అవకాశాలు కనిపించాయి. ట్రేడ్ వర్గాలు కూడా ఈ రికార్డు బ్రేక్ అవుతుందని అంచనా వేశాయి. కానీ, చివరి నిమిషంలో కంటెంట్ డెలివరీ ఆలస్యం కావడంతో కొన్ని ప్రీమియర్ షోలు రద్దు అయ్యాయి. దీంతో ప్రీమియర్స్ ద్వారానే రూ.52 కోట్లకు పైగా గ్రాస్ (వర్డల్ వైడ్) కలెక్షన్స్ నమోదు చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఓజీ రికార్డు బ్రేక్ కాకుండా ఉందట. ఈ లెక్కన చూస్తే.. నేషనల్ వైడ్ గా చరిత్ర సృష్టించి, గ్లోబల్ రికార్డును మాత్రం బ్రేక్ చేయలేదనే చెప్పాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X