Dhurandhar 2 vs Pushpa 2: గంటలో పుష్ప 2 రికార్డ్ ఔట్.. ధురంధర్ 2 దెబ్బకు లెక్కలు గల్లంతు!
ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 మూవీ ఇండియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. రిలీజ్‌కు ముందు నుంచే దేశమంతా ధురంధర్ మేనియా కమ్మేసింది. ఏ ఇద్దరు కలిసినా ప్రస్తుతం ధురంధర్ 2 గురించే మాట్లాడుకుంటున్నారు. అందరిచూపు.. ధురంధర్ 2 కొట్టబోయే రికార్డుల గురించే. మొదటి భాగంతో 1300 కోట్ల వరకు వచ్చి ఆగిన రణ్‌వీర్ సింగ్.. ఇప్పుడు ధురంధర్ 2తో 2000 కోట్ల మార్క్ అందుకోవాలని చూస్తున్నాడు.
ధురంధర్ 2 vs పుష్ప 2
మరీ ముఖ్యంగా ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్‌ల కాంబోలో వచ్చిన పుష్ప 2తో ధురంధర్ 2ను పోల్చిచూస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీ రిలీజ్ బిజినెస్, టికెట్ల అమ్మకాలు, ప్రీమియర్ షోలు, ఓపెనింగ్స్ ఇలా అన్ని విషయాల్లో పుష్ప 2 ఒక బెంచ్ మార్క్‌ను నెలకొల్పింది. ఇప్పుడు ధురంధర్ 2 ఆ రికార్డ్‌లను బద్ధలు కొడుతుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ధురంధర్ 2 మూవీ.. పుష్ప 2 సెట్ చేసిన ఓ రికార్డ్‌ను బద్ధలు కొట్టింది. ఈ వివరాల్లోకి వెళితే..

ధురంధర్ 2 తారాగణం
జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్‌పై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండేలు సంయుక్తంగా ధురంధర్ 2 చిత్రాన్ని నిర్మించారు. రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్‌లు హీరో హీరోయిన్‌లుగా నటించారు. అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, రాకేష్ బేడీ, సౌమ్య టాండన్, గౌరవ్ గెరా, మానవ్ గోహిల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. వికాస్ నౌలఖ సినిమాటోగ్రాఫర్‌గా, శివకుమార్ వి పానికర్ ఎడిటర్‌గా సేవలందించారు. శాశ్వత్ సచ్‌దేవ్ సంగీత దర్శకత్వం వహించారు. మార్చి 19న ధురంధర్ 2 మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో వరల్డ్ వైడ్‌గా రిలీజైంది.
ధురంధర్ 2 బడ్జెట్ ఎంత?
నటీనటుల రెమ్యునరేషన్లు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ధురంధర్ 2 మూవీకి 280 కోట్ల రూపాయల మేర బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 280 కోట్ల రూపాయల షేర్.. 600 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. ఇప్పటికే నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఈ మూవీ 250 నుంచి 300 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది.
ధురంధర్ 2 ప్రీమియర్స్‌కు భారీ రెస్పాన్స్
ఈ సినిమాపై ఉన్న అంచనాలు, క్రేజ్ నేపథ్యంలో ధురంధర్ 2ను వరల్డ్ వైడ్‌గా 12000 వేల స్క్రీన్లలో రిలీజ్ చేసినట్టు సమాచారం. ఇండియాలో 13 వేలకు పైగా పెయిడ్ ప్రీమియర్లు ప్రదర్శించారు. అడ్వాన్స్ బుకింగ్‌లోనే 100 కోట్లకు పైగా రాబట్టిన రణ్‌వీర్ సింగ్.. తొలిరోజున వరల్డ్ వైడ్‌గా 250 కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబట్టవచ్చని అంచనా వేస్తున్నారు. కొందరైతే పుష్ప 2 ఓపెనింగ్స్ రికార్డ్ (284 కోట్ల రూపాయలు)ను ధురంధర్ దాటేస్తుందని భావిస్తున్నారు.
పుష్ప 2 రికార్డ్ బద్ధలు
ఇదిలాఉండగా.. ధురంధర్ 2 తాజాగా పుష్ప 2కి సంబంధించిన ఓ రికార్డ్‌ను బద్ధలుకొట్టినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రముఖ టికెటింగ్ ఫ్లాట్‌ఫాం బుక్ మై షో అందించిన లెక్కల ప్రకారం.. ధురంధర్ 2 మూవీకి సంబంధించి కేవలం గంటలోనే 1,09,000 టికెట్లు అమ్ముడయ్యాయట. తద్వారా రణ్‌వీర్ మూవీపై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అంతేకాదు.. బుక్ మై షోలో కేవలం ఒక్క గంటలోనే అత్యధిక టికెట్లను విక్రయించిన మూవీగా నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డ్ పుష్ప 2పై ఉండేది. అల్లు అర్జున్ మూవీకి గతంలో కేవలం ఒక్క గంటలోనే 107.6K టికెట్లు సేల్ అయ్యాయి. ఇప్పుడు ఈ రికార్డ్‌ను ధురంధర్ 2 బద్ధలు కొట్టింది. అంతేకాదు.. ఉగాది, రంజాన్, శని, ఆదివారాలు కలిసి రావడంతో టికెట్ బుకింగ్స్‌లో ధురంధర్ 2 సరికొత్త రికార్డులు నెలకొల్పే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications


















