Dhurandhar 2 vs Toxic: ధురంధర్ 2 వర్సెస్ టాక్సిక్.. అల్లు అర్జున్ ‘పుష్ప 2' రికార్డు బ్రేక్ అయ్యేనా?
Dhurandhar 2 vs Toxic: ఇండియన్ బాక్సాఫీస్ వద్ద హోరాహోరీ పోరు జరుగనున్నది. మార్చి 19న రెండు పాన్ ఇండియా భారీ సినిమాలు రణ్ వీర్ సింగ్ ధురంధర్ 2, యష్ టాక్సిక్ థియేటర్లలోకి అడుగుపెట్టబోతున్నాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో పోరు సాగనున్నది.ఈ క్రమంలో అల్లు అర్జున్ పుష్ప 2 (Pushpa 2: The Rule) క్రియేట్ చేసిన తొలి రోజు ఆల్‌టైమ్ ఓపెనింగ్ రికార్డును బ్రేక్ చేయగలదా? ఈ రెండు సినిమాలు పుష్ప రాజ్ సింహాసనాన్ని కదిలించగలవా? అన్నదే హాట్ టాపిక్ మారింది. ఒకవైపు సీక్వెల్ క్రేజ్‌తో ధురంధర్ 2, మరోవైపు మాస్ పవర్‌తో టాక్సిక్... ఈ బాక్సాఫీస్ క్లాష్ కొత్త చరిత్ర రాస్తుందా? లేక అల్లు అర్జున్ రికార్డు మరికొంతకాలం చెక్కుచెదరకుండా నిలుస్తుందా? అన్నది హాట్ టాపిక్ గా మారింది.
భారతీయ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమా పుష్ప 2 (Pushpa 2: The Rule). డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డే వరల్డ్‌వైడ్‌గా రూ.280 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి, ఆల్‌టైమ్ ఓపెనింగ్ డే రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటికీ ఈ మూవీ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. హీరో అల్లు అర్జున్ కెరీర్‌లోనే ఇది మైలురాయి కాగా, టాలీవుడ్‌కు గ్లోబల్ మార్కెట్‌లో మరింత బలాన్ని చేకూర్చింది. ఇప్పుడు ఈ రికార్డుపై కన్నేసిన రెండు పాన్ ఇండియన్ సినిమాలు రంగంలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. ట్రేడ్ లెక్కల ప్రకారం.. పుష్ప 2 రికార్డును బ్రేక్ చేయాలంటే ఈ రెండు సినిమాలు కలిసి తొలి రోజే రూ.280 కోట్ల మార్క్ దాటాలి. ఇప్పుడు ఈ అంశం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ధురంధర్ 2: సీక్వెల్ అడ్వాంటేజ్‌తో రణ్‌వీర్ సింగ్ దూకుడు
బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ (Ranveer Singh) హీరోగా తెరకెక్కిన ధురంధర్ 1 ఎలాంటి భారీ అంచనాలు లేకుండానే రిలీజ్ అయి సంచలన విజయాన్ని అందుకుంది. ఇండియా-పాకిస్థాన్ నేపథ్యంలోని రా అండ్ రస్టిక్ స్పై యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా, షాకింగ్ ట్విస్టులతో ప్రేక్షకులను కట్టిపడేసింది. బాక్సాఫీస్ ను షేక్ చేసి.. దాదాపు 1300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇలాంటి భారీ విజయం సాధించిన ఈ సినిమాకు సిక్వెల్‌గా వస్తున్న ధురంధర్ 2 (Dhurandhar 2)పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఇండియాలో సుమారు 4000 స్క్రీన్లలో రిలీజ్ కానుంది. ఫ్రాంచైజ్ ఫాలోయింగ్, ప్రీ-రిలీజ్ బజ్, అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని కలిసి చూస్తే ధురంధర్ 2 దేశవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా ఓపెనింగ్ సాధించే అవకాశం ఉందని అంచనా. ఓవర్సీస్ మార్కెట్ నుంచి వచ్చే రెవెన్యూ కలిస్తే వరల్డ్‌వైడ్‌గా రూ.140-150 కోట్ల దాకా వెళ్లవచ్చని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.
టాక్సిక్.. యష్ మాస్ పవర్ వర్క్ అవుతుందా?
మరోవైపు రాకింగ్ స్టార్ యాష్ (Yash) నటించిన టాక్సిక్ (Toxic)పై భారీ అంచనాలే ఉన్నాయి. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత యష్ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. దీంతో ఈ సినిమాపై ఫ్యాన్స్‌లో భారీ హైప్ పీక్స్‌కు చేరింది. రీసెంట్‌గా విడుదలైన టీజర్, ట్రైలర్ హాలీవుడ్ మూవీ ఫీల్ ఇవ్వడంతో దేశవ్యాప్తంగా ఈ సినిమా హాట్ టాపిక్‌గా మారింది.
ఇన్‌సైడ్ టాక్ ప్రకారం.. టాక్సిక్ ఏకంగా 5500 స్క్రీన్లను టార్గెట్‌గా పెట్టుకుంది. ఇది ధురంధర్ 2 కంటే ఎక్కువ. ఈ స్క్రీన్ కౌంట్ ఆధారంగా చూస్తే టాక్సిక్ దేశవ్యాప్తంగా రూ.200-250 కోట్ల వరకూ ఓపెనింగ్ గ్రాస్ సాధించే ఛాన్స్ ఉందని ట్రేడ్ అంచనా వేస్తోంది. అదే నిజమైతే.. యష్ ఖాతాలో మరో తిరుగులేని రికార్డు చేరినట్టే. అయితే ఇక్కడ కీలకమైన విషయం.. ఈ స్థాయి ఓపెనింగ్ రావాలంటే టాక్సిక్ సినిమాకు కేజీఎఫ్ 2 తరహా హైప్,రెస్పాన్స్ అవసరం. యష్ మాస్ ఇమేజ్, పాన్ ఇండియా ప్రమోషన్స్, ఓవర్సీస్ మార్కెట్ ఎంతవరకు వర్క్ అవుతాయన్నదే తేల్చే అంశం.
పుష్ప2 రికార్డు నిజంగానే బ్రేక్ అవుతుందా?
ట్రేడ్ వర్గాల మాటల్లో చెప్పాలంటే.. రికార్డు బ్రేక్ అసాధ్యం కాదు. కానీ, రెండు సినిమాలు 'ఫుల్ కెపాసిటీ'తో ఓపెన్ కావాలి. ధురంధర్ 2 తన అంచనాల మేరకు ఓపెనింగ్ అందుకున్న, టాక్సిక్ ఆశించిన స్థాయికి రాకపోతే పుష్ప 2 రికార్డు సేఫ్ అయిపోతుంది. అలాగే టాక్సిక్ భారీగా ఓపెన్ అయినా, ధురంధర్ 2 డల్‌గా మొదలైతే కూడా రికార్డు చేరుకోవడం కష్టమే. ఇంకో ఆసక్తికరమైన అంశం.. టాక్సిక్ లో యష్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడట. అందులో ఒక క్యారెక్టర్ అత్యంత రూత్‌లెస్‌గా ఉంటుందని టాక్. ఈ యాంగిల్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందన్నదీ కీలకం.
బాక్సాఫీస్ యుద్ధం... ఎవరిది పైచేయి?
ఒకవైపు సీక్వెల్ పవర్‌తో ధురంధర్ 2, మరోవైపు యష్ మాస్ ఇమేజ్‌తో టాక్సిక్. రెండు సినిమాలూ పాన్ ఇండియా స్థాయిలో భారీ రిలీజ్‌కు రెడీ అవుతుండటంతో, మార్చి 19 తర్వాతే అసలు నిజం బయటపడనుంది. ఈ రెండు సినిమాలు కలిసి కొత్త చరిత్ర సృష్టిస్తాయా? లేక పుష్ప 2 ఓపెనింగ్ డే రికార్డు మరికొంతకాలం చెక్కుచెదరకుండా నిలుస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











