Dhurandhar Closing Collections: 285 కోట్ల బడ్జెట్.. ధురంధర్ మూవీకి ఎన్ని కోట్ల లాభమంటే?

డిజాస్టర్లు, ఫెయిల్యూర్స్‌తో కొట్టుమిట్టాడుతున్న బాలీవుడ్‌కు కలెక్షన్ల జోష్‌ను ఇచ్చిన చిత్రం ధురంధర్. హిందీ సినిమా పరిశ్రమలో స్టార్ హీరోలు రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ నటించారు. ఈ సినిమాకు ఆదిత్య ధార్ రచన, నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలు అందించారు. యాక్షన్, స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు.

ఈ చిత్రానికి వికాస్ నౌలాఖ సినిమాటోగ్రఫి, షాష్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్, శివకుమార్ వీ పానికర్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. డిసెంబర్ 5వ తేదీ 2025 రోజున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌ అయింది. ఈ సినిమా తొలి ఆట నుంచే సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్లింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా అంచనాలు మించి కలెక్షన్లు సాధించింది. సుమారుగా గత 50 రోజుల్లో థియేటర్లలో ఈ సినిమా పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. ఇలాంటి విజయాన్ని అందించిన ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఎన్ని కోట్ల వసూళ్లను సాధించింది? అనే వివరాల్లోకి వెళితే..

Dhurandhar Box Office Closing Collections Worldwide Ranveer Singh s Movie 9 weeks box office Report

పాకిస్థాన్‌లో భారత్‌లో అల్లకల్లోలం సృష్టించడానికి చేసిన కుట్రలను ఎదురించే రహస్య గూఢచారిగా రణ్‌వీర్ సింగ్ నటించారు. ఈ సినిమా కోసం థాయ్‌లాండ్‌లో సెట్ వేసి భారీగా చిత్రీకరించారు. దాంతో ఈ సినిమా ప్రొడక్షన్ కాస్ట్‌ 280 కోట్ల రూపాయలుగా అయింది. ప్రమోషన్లు ఖర్చులు 55 కోట్ల రూపాయలు, 30 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ ఖర్చులు అయ్యాయి. దాంతో ఈ సినిమా బడ్జెట్ 285 కోట్ల రూపాయలుగా అయింది. ఈ మూవీకి భారీగా డిమాండ్ ఉండటంతో వరల్డ్ వైడ్ 6500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమా సుమారుగా 300 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది.

ఈ మూవీకి నాన్ థియేట్రికల్ బిజినెస్ రూపంలో భారీగా ఆదాయం లభించింది. డిజిటల్ రైట్స్ రూపంలో 100 కోట్ల రూపాయలను రాబట్టింది. మ్యూజిక్ పరంగా 20 కోట్ల రూపాయలు వసూలు చేసింది. శాటిలైట్ హక్కులు అమ్మడం ద్వారా 20 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. దాంతో నాన్ థియేట్రికల్ పరంగా 140 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది.

ఇక థియేట్రికల్‌ విషయానికి వస్తే.. ఈ సినిమా దాదాపు 9 వారాలపాటు సుదీర్ఘంగా కలెక్షన్ల జైత్రయాత్రను కొనసాగించింది. ఈ చిత్రం తొలి రోజు 207 కోట్ల రూపాయలు, రెండో వారం 253 కోట్ల రూపాయలు, మూడో వారం 172 కోట్ల రూపాయలు, నాలుగో వారం 106 కోట్ల రూపాయలు, ఐదో వారం 51 కోట్ల రూపాయలు, ఆరో వారం 27 కోట్ల రూపాయలు, ఏడో వారం 14 కోట్ల రూపాయలు, ఎనిమిదో వారం 5.5 కోట్ల రూపాయలు, తొమ్మిదో వారం 1.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం మొత్తంగా 838 కోట్ల రూపాయలు ఇండియాలో వసూలు చేసింది.

ఇక ఈ సినిమాకు ఓవర్సీస్‌లో కూడా భారీ ఆదరణ లభించింది. దాంతో ఈ చిత్రం రికార్డు స్థాయి కలెక్షన్లు వసూలు చేసింది. ఈ చిత్రం నార్త్ అమెరికా, యూకే, ఇతర దేశాల్లో కలిపి 300 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను నమోదు చేసింది. ఇటీవల కాలంలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇదిలా ఉండగా, వరల్డ్ వైడ్ ఈ సినిమా 2025-26 ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా ఘనతను సాధించింది. ఈ చిత్రం ఇండియాలో 838 కోట్లు, ఓవర్సీస్‌లో 300 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను వసూలు చేసింది. సుమారుగా 1400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రం థియేట్రికల్‌గా 500 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X