Dhurandhar Day 1 Box Office: రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లో షాకింగ్‌గా.. దురంధర్ మూవీకి ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ స్టార్ హీరోలు రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ నటించిన తాజా భారీ బడ్జెట్ చిత్రం దురంధర్. ఈ సినిమాకు ఆదిత్య ధార్ రచన, నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. యాక్షన్, స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి వికాస్ నౌలాఖ సినిమాటోగ్రఫి, షాష్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్, శివకుమార్ వీ పానికర్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే భారీ అంచనాలు పెంచుకొన్న ఈ చిత్రం డిసెంబర్ 5వ తేదీ 2025 రోజున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌కు సిద్దమైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అడ్వాన్స్ బుకింగ్ ఏ మేరకు నమోదయ్యాయి? ఈ సినిమాకు తొలి రోజు కలెక్షన్లు ఎంత ఉండవచ్చనే వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్‌లో స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో స్టార్ హీరోలు భారీగా నటించారు. అలాగే ఉన్నత సాంకేతిక విలువలతో నిర్మించారు. ఈ సినిమాకు పనిచేసిన స్టార్స్ రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్ అంతా కలిపి ఈ చిత్రాన్ని సుమారుగా 250 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా ప్రమోషనల్ ఖర్చులకు సుమారుగా 30 కోట్ల రూపాయలు వెచ్చించారు. దాంతో ఈ సినిమా బడ్జెట్‌ను 280 కోట్ల రూపాయలు అయింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక ఈ సినిమా టీజర్, ట్రైలర్లకు మంచి స్పందన రావడంతో హిందీ బెల్ట్‌లో అడ్వాన్స్ బుకింగ్ సానుకూలంగా ప్రారంభమైంది. ఈ సినిమాకు మంచి కలెక్షన్లు అడ్వాన్సు రూపంలో నమోదయ్యాయి. సాక్ నిక్ తెలిపిన ప్రకారం ఈ చిత్రం రిలీజ్‌కు ఒక రోజు ముందు వరకు సుమారుగా 5 కోట్ల రూపాయల మేర వసూలు చేసింది. ఇంకా ఈ మొత్తం పెరిగే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
దురంధర్ సినిమా భారీగా ఓపెనింగ్స్ లభించే అవకాశం ఉంది. ఇండయాలో 19 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో 10 కోట్ల గ్రాస్‌తో వరల్డ్ వైడ్‌గా 29 కోట్ల గ్రాస్ వసూలు చేయవచ్చు. ఈ సినిమా తొలి రోజు సుమారుగా 18 నుంచి 20 కోట్ల రూపాయలు నెట్ కలెక్షన్లను వసూలు చేసే అవకాశం ఉంది. రిలీజ్ తర్వాత పాజిటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అయితే ఇంకా ఈ వసూళ్ల రేంజ్ పెరిగే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో బాలీవుడ్‌లో అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా దురంధర్ ఉంటుందనే ఆశాభావాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
దురంధర్ సినిమా విషయానికి వస్తే.. 1999 సంవత్సరంలో IC 814 ఫ్లయిట్ హైజాకింగ్ ఘటన, పార్లమెంట్‌పై దాడి సంఘటన తర్వాత.. భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ పాకిస్థాన్‌లోని టెర్రరిస్ట్ నెట్‌వర్క్‌ను విచ్చిన్నం, విధ్వంసం చేయాలని, అలాగే కరాచీలోని అండర్ వరల్డ్ మాఫియాను దెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తారు. అజయ్ సన్యాల్ ప్లాన్ వర్కవుట్ అయిందా? పాక్ టెర్రిరస్ట్ స్థావరాలను దెబ్బ తీశాడా? అనే ప్రశ్నలకు సమాధానమే దురంధర్ మూవీ కథ. ఈ సినిమా నిడివి 3 గంటల 34 నిమిషాలు. 2008 సంవత్సరంలో హృతిక్ రోషన్ నటించిన జోదా అక్బర్ సినిమా నిడివి 3 గంటల 33 నిమిషాలు. ఆ తర్వాత అత్యధికంగా రన్ టైమ్ ఉన్న చిత్రంగా ఈ సినిమా రికార్డు సొంతం చేసుకొన్నది.


Click it and Unblock the Notifications











