Dhurandhar Day 1 Collections: దురంధర్‌కు రికార్డ్ ఓపెనింగ్స్... రణవీర్ సింగ్ మూవీకి ఫస్ట్ డే ఎన్ని కోట్లంటే?
జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే నిర్మిస్తోన్న చిత్రం దురంధర్. బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ హీరోగా, సారా అర్జున్ హీరోయిన్‌గా నటించారు. సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, రాకేశ్ బేడీ, సౌమ్య టాండన్, నవీన్ కౌశీక్, మానవ్ గోహిల్, క్రిస్టల్ డిసౌజా తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాకు ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు. వికాస్ నౌలాఖ సినిమాటోగ్రఫి, షాష్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్, శివకుమార్ వీ పానికర్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా దురంధర్ సినిమా రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో రణవీర్ సింగ్ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీరిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? తొలి రోజు దురంధర్ మూవీ వరల్డ్ వైడ్‌గా ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే..
దురంధర్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి దురందర్ సినిమాకు 280 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అయ్యింది. ముంబై, న్యూఢిల్లీతో పాటు పలుదేశాలలో ఈ మూవీ చిత్రీకరణ జరిగింది. నిర్మాణ విలువలపరంగా నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు. టీజర్, ట్రైలర్లు, రణవీర్ సింగ్ లుక్, గెటప్‌లతో దురంధర్ చిత్రంపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. దానికి తగినట్లుగానే రణవీర్ సింగ్ మూవీకి వరల్డ్ వైడ్‌గా 168 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దాంతో దురంధర్ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే వరల్డ్ వైడ్‌గా 400 కోట్ల రూపాయల బిజినెస్ చేయాల్సి ఉందని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి.

అడ్వాన్స్ బుకింగ్‌లో దురంధర రికార్డులు
దురంధర్ మూవీపై ఉన్న హైప్ నేపథ్యంలో ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ రికార్డ్ స్థాయిలో జరిగింది. ఇండియా వైడ్‌గా 9.23 కోట్ల రూపాయలను ఒక్క అడ్వాన్స్ బుకింగ్‌లో రాబట్టాడు రణవీర్ సింగ్. ఇందులో హిందీ 2డీ వెర్షన్‌లో 14,549 షోలకు గాను 2.55 లక్షల టికెట్లు అమ్ముడై 8.77 కోట్ల రూపాయలు, హిందీలో ఐమ్యాక్స్ 2డీ వెర్షన్‌లో 123 షోలకు గాను 6994 టికెట్లు అమ్ముడై 4.52 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక బ్లాక్ చేసిన సీట్లతో కలిపి దురంధర్ సినిమాకు ఇండియా వైడ్‌గా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 14 కోట్ల రూపాయలు కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిక్ తెలిపింది.
సైయారా రికార్డ్ కొట్టలేకపోయినా దురంధర్
2025లో ప్రీ సేల్స్ విషయంలో దురంధర్ సరికొత్త రికార్డులు సృష్టించింది. హౌస్‌ఫుల్ 5కు 8.02 కోట్ల రూపాయలు, రైడ్ 2కు 6.52 కోట్ల రూపాయలు వచ్చింది. అయితే సైయారా (9.40 కోట్ల రూపాయలు) రికార్డును దురంధర్ కొద్దిలో మిస్ అయ్యాడు. కాగా.. 2025లో బాలీవుడ్ సినిమాల అడ్వాన్స్ బుకింగ్ విషయంలో వార్ 2 చిత్రం 21 రూపాయలు టాప్‌లో ఉంది. ఆ తర్వాత ఛావా (13.85 కోట్ల రూపాయలు), సికందర్ (10.09 కోట్ల రూపాయలు), సైయారా (9.40 కోట్ల రూపాయలు) దురంధర్ కంటే ముందు ఉన్నాయి.
దురంధర్ తొలి రోజు కలెక్షన్స్
ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాలకు తగినట్లుగానే దురంధర్ మంచి ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. తొలిరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు రణవీర్ సింగ్ మూవీకి 16 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది. కడపటి సమాచారం మేరకు ఇప్పటి వరకు దురంధర్‌కు ఇండియాలో 7.59 కోట్ల రూపాయల నికర వసూళ్లు రాబట్టినట్లు సాక్‌నిక్ తెలిపింది.
డిసెంబర్ 5వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ముంబైలో 1009 షోలు, ఢిల్లీలో 1349 షోలు, పూణేలో 471 షోలు, బెంగళూరులో 498 షోలు, హైదరాబాద్‌లో 306 షోలు, అహ్మదాబాద్‌లో 624 షోలు చొప్పున ప్రదర్శితమైనట్లు నివేదికలు చెబుతున్నాయి. తొలి రోజు దురంధర్ మూవీకి ఇండియాలో 20 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 5 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 25 కోట్ల రూపాయలు నుంచి 30 కోట్ల రూపాయల రేంజ్‌లో ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











