Dhurandhar Box Office: పుష్ప 2 రికార్డు బ్రేక్.. దురంధర్ బాక్సాఫీస్ ప్రభంజనం.. వరల్డ్ వైడ్ ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ స్టార్ హీరోలు రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ నటించిన తాజా భారీ బడ్జెట్ చిత్రం దురంధర్. ఈ సినిమాకు ఆదిత్య ధార్ రచన, నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. యాక్షన్, స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు.
ఈ చిత్రానికి వికాస్ నౌలాఖ సినిమాటోగ్రఫి, షాష్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్, శివకుమార్ వీ పానికర్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే భారీ అంచనాలు పెంచుకొన్న ఈ చిత్రం డిసెంబర్ 5వ తేదీ 2025 రోజున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమా తొలి ఆట నుంచే బాక్సాఫీస్‌ను కుదిపేస్తున్నది. ఈ చిత్రం బడ్జెట్ ఎంత? ఈ సినిమా సాధించిన కలెక్షన్ల ఎంత? ఈ చిత్రం 11 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

దురంధర్ సినిమాను భారీ తారాగణం, టాప్ టెక్నిషియన్స్‌తో హై ఎండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించారు. ఈ సినిమా పార్ట్ 1 బడ్జెట్ విషయానికి వస్తే.. సుమారుగా 250 కోట్ల రూపాయలు. ఈ సినిమా ప్రమోషనల్ ఖర్చులతో కలిపి మొత్తంగా ఈ సినిమా బడ్జెట్‌ను 280 కోట్ల రూపాయలు అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రం 280 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ చిత్రాన్ని సుమారుగా 4500 స్క్రీన్లలో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేశారు.
దురంధర్ సినిమా మిక్స్‌డ్ టాక్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ చిత్రం తొలి రోజు నుంచే బాక్సాఫీస్‌పై భారీ ప్రభావాన్ని చూపించింది. ఈ చిత్రం తొలి రోజున 28 కోట్ల రూపాయలు, రెండో రోజున 32 కోట్ల రూపాయలు, మూడో రోజున 43 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 23.25 కోట్ల రూపాయలు, ఐదో రోజున 27 కోట్ల రూపాయలు, ఆరో రోజున 27 కోట్ల రూపాయలు, ఏడో రోజున 27 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తొలి వారం ఈ చిత్రం 207 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక రెండో వారంలో కూడా దురంధర్ చిత్రం అదే జోష్‌ను కొనసాగించింది. ఈ చిత్రం 8వ రోజున 32.5 కోట్ల రూపాయలు, 9వ రోజున 53 కోట్ల రూపాయలు, 10 రోజున 58 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 351 కోట్ల రూపాయలకుపైగా కలెక్షన్లను రాబట్టింది. ఇక 11వ రోజు ఈ చిత్రం 16 నుంచి 18 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. దాంతో ఈ చిత్రం ఇండియాలో 420 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు, వరల్డ్ వైడ్‌గా 544 కోట్ల గ్రాస్ కలెక్షన్లు చేస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నారు.
దురంధర్ సినిమా ఓవర్సీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం ముఖ్యంగా నార్త్ అమెరికాలో ప్రభంజనం సృష్టిస్తున్నది. ఈ చిత్రం ఇప్పటి వరకు 8 మిలియన్ డాలర్లకుపైగా, మిగితా దేశాల్లో కలిపి 14 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది. భారతీయ కరెన్సీలో ఈ చిత్రం 123 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే దేశాల్లో కూడా భారీగా వసూళ్లను సాధిస్తున్నది. అయితే ఈ మూవీ నార్త్ ఇండియాలో పుష్ప 2 సాధించిన లైఫ్ టైమ్ కలెక్షన్లను దురందర్ అధిగమించింది. అలాగే రణ్‌వీర్, దీపిక పదుకొన్ నటించిన పద్మావత్ చిత్రం రికార్డులను కూడా అధిగమించింది.


Click it and Unblock the Notifications











