Dhurandhar Day 15 Collections: దురంధర్ కలెక్షన్ల సునామీ.. కేజీఎఫ్ 2 రికార్డ్ బ్రేక్.. 15వ రోజు ఎన్ని కోట్లంటే?

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన దురంధర్ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా కేవలం 700 కోట్ల క్లబ్‌లో చేరి ట్రేడ్ పండితులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ నేపథ్యంలో 15వ రోజు దురంధర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లు రాబట్టింది? ఏయే రికార్డులు బద్ధలు కొట్టిందో పరిశీలిస్తే..

దురంధర్ చిత్రానికి ఆదిత్య ధార్ దర్శకత్వం వహించగా... జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండేలు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో రణ్‌వీర్ సరసన సారా అర్జున్ హీరోయిన్‌గా నటించారు. సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, రాకేశ్ బేడీ, సౌమ్య టాండన్, నవీన్ కౌశీక్, మానవ్ గోహిల్, క్రిస్టల్ డిసౌజా తదితరులు కీలకపాత్రలు పోషించారు. వికాస్ నౌలాఖ సినిమాటోగ్రఫి, షాష్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్, శివకుమార్ వీ పానికర్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.

Dhurandhar Day 15 Expected Box Office Collections Worldwide Ranveer Singh s Movie Beats KGF Chapter 2 Hindi collection

దురంధర్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి దురందర్ సినిమాకు 280 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అయ్యింది. టీజర్, ట్రైలర్లు, రణవీర్ సింగ్ లుక్, గెటప్‌లతో దురంధర్ చిత్రంపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. దానికి తగినట్లుగానే రణ్‌వీర్ సింగ్ మూవీకి వరల్డ్ వైడ్‌గా 168 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే వరల్డ్ వైడ్‌‌గా 400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ వర్గాలు వాల్యూ నిర్దేశించాయి. రణ్‌వీర్ సింగ్ మూవీని వరల్డ్ వైడ్‌గా 4000 స్క్రీన్‌లలో విడుదల చేశారు.

దురంధర్ 14 రోజుల కలెక్షన్స్
దురంధర్ మూవీ తొలి రోజున 28 కోట్ల రూపాయలు, రెండో రోజున 32 కోట్ల రూపాయలు, మూడో రోజున 43 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 23.25 కోట్ల రూపాయలు, ఐదో రోజున 27 కోట్ల రూపాయలు, ఆరో రోజున 27 కోట్ల రూపాయలు, ఏడో రోజున 27 కోట్ల రూపాయలు, ఎనిమిదవ రోజున 32.5 కోట్ల రూపాయలు, తొమ్మిదవ రోజున 53 కోట్ల రూపాయపలు, పదో రోజున 58 కోట్ల రూపాయలు, పదకొండో రోజున 30.5 కోట్ల రూపాయలు, పన్నెండో రోజున 30.5 కోట్ల రూపాయలు, పదమూడో రోజున 25.5 కోట్ల రూపాయలు, పద్నాలుగో రోజున 23.25 కోట్ల రూపాయలు చొప్పున ఇండియా వైడ్‌గా 460.50 కోట్ల రూపాయల నెట్.. 552.50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.

రణ్‌వీర్ సింగ్ మూవీకి తొలి వారం ఇండియాలో 207.25 కోట్ల రూపాయలు, రెండో వారంలో 253.25 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. తొలి వారం కంటే రెండో వారం కలెక్షన్స్ పుంజుకోవడం దురంధర్ జైత్రయాత్రకు అద్ధం పడుతోంది. ఇండియాతో పాటు వరల్డ్ వైడ్‌గా పలు చిత్రాలు పోటీ ఇస్తున్నప్పటికీ రణ్‌వీర్ మూవీ తట్టుకుని నిలబడింది.

దురంధర్ ఓవర్సీస్ కలెక్షన్స్
ఇక ఓవర్సీస్‌లో దురంధర్ మూవీ దుమ్ముదులుపుతోంది. గురువారం నాటి వసూళ్లతో కలిపి రణ్‌వీర్ సింగ్ మూవీకి ఒక్క నార్త్ అమెరికాలోనే 10 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు 90 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. ఇక యూకే, యూరప్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలలో దురంధర్ మూవీ కాసుల వర్షం కురిపిస్తోంది. అక్కడ ఇప్పటి వరకు 68 కోట్ల రూపాయలు రాబట్టినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దాంతో కలిపి ఓవర్సీస్‌లో రణ్‌వీర్ సింగ్ చిత్రం 158 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి దురంధర్‌కు ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా 710.5 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది.

దురంధర్ 15వ రోజు కలెక్షన్స్
రెండు వారాలు గడుస్తున్నా దురంధర్ మూవీ హవా ఏమాత్రం తగ్గడం లేదు. శుక్రవారం వరల్డ్ వైడ్‌గా జేమ్స్ కామెరాన్ దృశ్య కావ్యం అవతార్ 3: ఫైర్ అండ్ యాష్ రిలీజ్ కావడంతో అర్బన్ ఏరియాలలో కొంతమేర దురంధర్‌పై ఎఫెక్ట్ కనిపిస్తోంది. అయితే నార్త్ ఇండియాలోని రూరల్ ఏరియాలలో రణ్‌వీర్ సింగ్ ఆధిపత్యం కనిపిస్తోంది. 15వ రోజు సాయంత్రం 6 గంటల వరకు దురంధర్ మూవీకి ఇండియాలో 26 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది. కడపటి వార్తలు అందేసరికి 15వ రోజు ఇండియాలో రణ్‌వీర్ మూవీకి 9.08 కోట్ల రూపాయల నెట్ వసూలైనట్లు సాక్‌నిక్ నివేదించింది. దాంతో శుక్రవారం నాడు ఈ సినిమా ఇండియాలో 15 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 7 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 25 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబడుతుందని భావిస్తున్నారు. దీంతో కలిపి 15 రోజుల వరకు దురంధర్ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 735 కోట్ల రూపాయల గ్రాస్ వస్తుందని అంచనా వేస్తున్నారు.

దురంధర్ రికార్డులు
దురంధర్ కలెక్షన్స్‌తో రణ్‌వీర్ సింగ్ తన ఖాతాలో సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాడు. విడుదలైన 2వ బుధవారం ఇండియన్ బాక్సాఫీసులో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా ఉన్న ఛావా (25.02 కోట్ల రూపాయలు) రికార్డును 25.70 కోట్ల కలెక్షన్స్‌తో బద్ధలు కొట్టాడు రణ్‌వీర్. తాజాగా ఈ స్టార్ హీరో తన ఖాతాలో మరో రికార్డును వేసుకున్నాడు. హిందీ వెర్షన్‌లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాలలో 9వ చిత్రంగా ఉన్న కేజీఎఫ్ 2(434.62 కోట్ల రూపాయలు) వసూళ్ల రికార్డును బద్ధలు కొట్టింది దురంధర్. ఇప్పటికే బ్రేక్‌ఈవెన్ టార్గెట్‌ను ఛేదించి 300 కోట్ల రూపాయలకు పైగా లాభాలను అందించింది ఈ చిత్రం. మరి రానున్న రోజులలో ఈ సినిమా ఇంకెన్ని రికార్డులను సొంతం చేసుకుంటుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X