Dhurandhar Day 16 Collections: అవతార్‌కి ముచ్చెమటలు.. 800 కోట్లకు చేరువగా దురంధర్, 16వ రోజు ఎన్ని కోట్లంటే?
ఆదిత్య ధార్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ మూవీ నటించిన స్పై, యాక్షన్ మూవీ దురంధర్. విడుదలైన రోజు నుంచి నేటి వరకు వసూళ్ల వర్షం కురిపిస్తూ స్పై జోనర్‌లోనే ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది ఈ సినిమా. ఏకంగా 700 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. దురంధర్ చిత్రాన్ని జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండేలు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో సారా అర్జున్ హీరోయిన్‌గా నటించారు. సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, రాకేశ్ బేడీ, సౌమ్య టాండన్, నవీన్ కౌశీక్, మానవ్ గోహిల్, క్రిస్టల్ డిసౌజా తదితరులు కీలకపాత్రలు పోషించారు. వికాస్ నౌలాఖ సినిమాటోగ్రఫి, షాష్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్, శివకుమార్ వీ పానికర్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. డిసెంబర్ 5న విడుదలైన దురంధర్ మూవీ దురంధర్ బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 16వ రోజున రణ్‌వీర్ సింగ్ మూవీ ఎన్ని కోట్లు వసూలు చేసింది? ఈ వివరాలు పరిశీలిస్తే..
దురంధర్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి దురందర్ సినిమాకు 280 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అయ్యింది. టీజర్, ట్రైలర్లు, రణవీర్ సింగ్ లుక్, గెటప్‌లతో దురంధర్ చిత్రంపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. దానికి తగినట్లుగానే రణ్‌వీర్ సింగ్ మూవీకి వరల్డ్ వైడ్‌గా 168 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే వరల్డ్ వైడ్‌గా 400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ వర్గాలు వాల్యూ నిర్దేశించాయి. రణ్‌వీర్ సింగ్ మూవీని వరల్డ్ వైడ్‌గా 4000 స్క్రీన్‌లలో విడుదల చేశారు.

దురంధర్ 15 రోజుల కలెక్షన్స్
దురంధర్ మూవీ తొలి రోజున 28 కోట్ల రూపాయలు, రెండో రోజున 32 కోట్ల రూపాయలు, మూడో రోజున 43 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 23.25 కోట్ల రూపాయలు, ఐదో రోజున 27 కోట్ల రూపాయలు, ఆరో రోజున 27 కోట్ల రూపాయలు, ఏడో రోజున 27 కోట్ల రూపాయలు, ఎనిమిదవ రోజున 32.5 కోట్ల రూపాయలు, తొమ్మిదవ రోజున 53 కోట్ల రూపాయపలు, పదో రోజున 58 కోట్ల రూపాయలు, పదకొండో రోజున 30.5 కోట్ల రూపాయలు, పన్నెండో రోజున 30.5 కోట్ల రూపాయలు, పదమూడో రోజున 25.5 కోట్ల రూపాయలు, పద్నాలుగో రోజున 23.25 కోట్ల రూపాయలు, పదిహేనవ రోజున 22.5 కోట్ల రూపాయలు చొప్పున ఇండియా వైడ్‌గా 483 కోట్ల రూపాయల నెట్.. 579.50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.
దురంధర్ ఓవర్సీస్ కలెక్షన్స్
దురంధర్ చిత్రం 15వ రోజు నార్త్ అమెరికాలో 610K డాలర్లు (భారత కరెన్సీలో 5.46 కోట్ల రూపాయలు) వసూలు చేయగా.. శుక్రవారం వరకు రణ్‌వీర్ సింగ్ మూవీకి ఒక్క నార్త్ అమెరికాలోనే 11 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 98 కోట్ల రూపాయలు) వసూలైంది. ఇక మిగిలిన దేశాలలో ఇప్పటి వరకు ఈ సినిమా 62 కోట్ల రూపాయలు రాబట్టినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దాంతో కలిపి ఓవర్సీస్‌లో రణ్‌వీర్ సింగ్ చిత్రం 160 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి దురంధర్‌కు ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా 739.5 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది.
దురంధర్ 16వ రోజు కలెక్షన్స్
జేమ్స్ కామెరాన్ అవతార్ 3 వంటి భారీ చిత్రం థియేటర్‌లలో ఉన్నప్పటికీ దురంధర్ హవా ఏమాత్రం తగ్గడం లేదు. అవతార్ ఓపెనింగ్స్ కంటే దురంధర్ 15వ రోజు కలెక్షన్స్ ఎక్కువ కావడం విశేషం. దీనిని బట్టి రణ్‌వీర్ సింగ్ మూవీకి ఏ రేంజ్‌లో ఆదరణ లభిస్తుందో చూడొచ్చు. ఇక వీకెండ్ కావడంతో శనివారం దురంధర్‌కు భారీగా బుకింగ్స్ జరుగుతున్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి. 16వ రోజు సాయంత్రం 7 గంటల వరకు ఇండియాలో ఈ సినిమాకు 47 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ నివేదించింది. కడపటి సమాచారం అందేనాటికి శనివారం దురంధర్ చిత్రానికి ఇండియాలో 19.88 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. 16వ రోజు రణ్‌వీర్ సింగ్ మూవీకి ఇండియాలో 30 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 5 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 35 కోట్ల రూపాయలు రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. తద్వారా ఈ సినిమా 16 రోజుల వరకు ప్రపంచవ్యాప్తంగా 785 కోట్ల రూపాయలు సాధిస్తుందని చెబుతున్నారు. ఆదివారం నాటి కలెక్షన్స్‌తో దురంధర్ చిత్రం 800 కోట్ల రూపాయల క్లబ్‌లోకి ఎంటరయ్యే అవకాశం ఉంది.
దురంధర్ రికార్డులు
రణ్‌వీర్ సింగ్ దూకుడు చూస్తుంటే అతి త్వరలోనే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచే అవకాశం ఉంది. విక్కీ కౌశల్ - రష్మిక మందన్నల ఛావా చిత్రం లాంగ్ రన్‌లో 827.06 కోట్ల రూపాయలు వసూలు చేసి ఈ లిస్ట్‌లో టాప్‌లో ఉంది. దురంధర్ మరో 90 కోట్ల రూపాయలు సాధిస్తే ఛావా రికార్డ్‌ను బద్ధలుకొట్టి ఈ లిస్ట్‌లో నెంబర్ వన్‌గా నిలిచే అవకాశం ఉంది. అలాగే ఇప్పటి వరకు సాధించిన వసూళ్లతో 2025లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాలలో దురంధర్ మూడో స్థానంలో ఉంది. 860 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో కాంతార చాప్టర్ 1 అగ్రస్థానంలో ఉంది. రణ్‌వీర్ సింగ్ జోరు ఇలాగే కొనసాగితే కాంతార 2 రికార్డులు బద్ధలు కొట్టడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











