Dhurandhar 18 days Box Office: 900 కోట్ల క్లబ్‌లో దురంధర్.. పఠాన్, పుష్ప 2 రికార్డులు బ్రేక్!
బాలీవుడ్ స్టార్ హీరోలు రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ నటించిన తాజా భారీ బడ్జెట్ చిత్రం దురంధర్. ఈ సినిమాకు ఆదిత్య ధార్ రచన, నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. యాక్షన్, స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు.
ఈ చిత్రానికి వికాస్ నౌలాఖ సినిమాటోగ్రఫి, షాష్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్, శివకుమార్ వీ పానికర్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే భారీ అంచనాలు పెంచుకొన్న ఈ చిత్రం డిసెంబర్ 5వ తేదీ 2025 రోజున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమా తొలి ఆట నుంచే బాక్సాఫీస్‌ను కుదిపేస్తున్నది. ఈ చిత్రం బడ్జెట్ ఎంత? ఈ సినిమా సాధించిన కలెక్షన్ల ఎంత? ఈ చిత్రం 18 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

దురంధర్ సినిమాను భారీ తారాగణం, టాప్ టెక్నిషియన్స్‌తో హై ఎండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించారు. ఈ సినిమా పార్ట్ 1 బడ్జెట్ విషయానికి వస్తే.. సుమారుగా 250 కోట్ల రూపాయలు. ఈ సినిమా ప్రమోషనల్ ఖర్చులతో కలిపి మొత్తంగా ఈ సినిమా బడ్జెట్‌ను 280 కోట్ల రూపాయలు అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రం 280 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ చిత్రాన్ని సుమారుగా 4500 స్క్రీన్లలో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేశారు. ఆ తర్వాత పబ్లిక్ డిమాండ్ కారణంగా స్క్రీన్ల సంఖ్యను భారీగా పెంచడం జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
దురంధర్ సినిమా ఇండియా కలెక్షన్ల విషయానికి వస్తే.. తొలి రోజు 28 కోట్ల రూపాయలు, రెండో రోజు 30 కోట్ల రూపాయలు, మూడో రోజు 40 కోట్లు, నాలుగో రోజు 24 కోట్ల రూపాయలు, ఐదో రోజు 28 కోట్ల రూపాయలు, ఆరో రోజు 30 కోట్ల రూపాయలు, ఏడో రోజు 30 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తొలి వారం 208 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
రణ్‌వీర్ సింగ్ మూవీ రెండో వారం వసూళ్లు విషయానికి వస్తే.. 8వ రోజు 35 కోట్లు, 9వ రోజు 54 కోట్ల రూపాయలు, 10వ రోజు 58 కోట్ల రూపాయలు, 11వ రోజు 32 కోట్ల రూపాయలు, 12వ రోజు 32 కోట్ల రూపాయలు, 13వ రోజు 25 కోట్ల రూపాయలు, 14వ రోజు 25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండో వారంలో 260 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను సాధించింది.
ఇక మూడో వారంలో కూడా దురంధర్ బాక్సాఫీస్ వేటను భారీగా కొనసాగిస్తున్నది. 15వ రోజు 24 కోట్ల రూపాయలు, 16వ రోజు 36 కోట్ల రూపాయలు, 17వ రోజు 38.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మూడో వారంలో ఇప్పటి వరకు 98.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ చిత్రం గత 17 రోజుల్లో 568 కోట్ల రూపాయలను వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
దురంధర్ సినిమా సంచలన రీతిలో బాక్సాఫీస్‌ను శాసిస్తూ రికార్డు కలెక్షన్లను రాబడుతున్నది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా ఇండియాలో 568 కోట్ల నెట్, 666 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడుతున్నది. ఓవర్సీస్‌లో 20 మిలియన్ డాలర్లు అంటే.. సుమారుగా 180 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 852 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని సాక్ నిక్ వెల్లడించింది. ఈ సినిమా త్వరలోనే 900 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరడం సులభంగా కనిపిస్తున్నది. ఈ సినిమా షారుక్ ఖాన్ నటించిన పఠాన్, పుష్ప 2 మూవీ కలెక్షన్లను అధిగమించింది.


Click it and Unblock the Notifications











