Dhurandhar Day 2 Collections: 100 కోట్లకు చేరువగా దురంధర్... రణ్‌వీర్ మూవీకి 2వ రోజు ఎన్ని కోట్లంటే?

బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ హీరోగా, సారా అర్జున్ హీరోయిన్‌గా ఆదిత్య ధార్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై, యాక్షన్ ఎంటర్‌టైనర్ దురంధర్. జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండేలు సంయుక్తంగా నిర్మించారు. సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, రాకేశ్ బేడీ, సౌమ్య టాండన్, నవీన్ కౌశీక్, మానవ్ గోహిల్, క్రిస్టల్ డిసౌజా తదితరులు కీలకపాత్రలు పోషించారు. వికాస్ నౌలాఖ సినిమాటోగ్రఫి, షాష్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్, శివకుమార్ వీ పానికర్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా దురంధర్ సినిమా రిలీజ్ అయింది. తొలిరోజు రికార్డ్ వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలో దురంధర్ చిత్రం రెండో రోజు వరల్డ్ వైడ్‌గా ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే..

దురంధర్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి దురందర్ సినిమాకు 280 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అయ్యింది. టీజర్, ట్రైలర్లు, రణవీర్ సింగ్ లుక్, గెటప్‌లతో దురంధర్ చిత్రంపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. దానికి తగినట్లుగానే రణ్‌వీర్ సింగ్ మూవీకి వరల్డ్ వైడ్‌గా 168 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దాంతో దురంధర్ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే వరల్డ్ వైడ్‌‌గా 400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ వర్గాలు వాల్యూ నిర్దేశించాయి. రణ్‌వీర్ సింగ్ మూవీని వరల్డ్ వైడ్‌గా 4000 స్క్రీన్‌లలో విడుదల చేశారు.

Dhurandhar Day 2 Expected Box Office Collections Worldwide Ranveer Singh s Movie heading towards 100 crores mark

దురంధర్ తొలి రోజు కలెక్షన్స్
ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాలకు తగినట్లుగానే దురంధర్‌ మూవీ మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ఇండియా వైడ్‌గా తొలిరోజు ఏకంగా 27 కోట్ల రూపాయల నెట్.. 32.4 గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేశాడు రణ్‌వీర్. అటు ఓవర్సీస్‌లోనూ దురంధర్ తొలి రోజు దుమ్ము దులిపింది. నార్త్ అమెరికాలో తొలిరోజే ప్రీమియర్స్‌తో కలిపి రికార్డ్ కలెక్షన్స్ సాధించింది. అమెరికా, కెనడాలలో 350 సెంటర్స్‌కి గాను తొలి రోజు రాత్రి 7 గంటల వరకు 450K డాలర్లు (భారత కరెన్సీలో 4.04 కోట్ల రూపాయలు) రాబట్టి రికార్డులు తిరగరాసింది.

దురంధర్ ఓవర్సీస్ కలెక్షన్స్
అటు బాలీవుడ్ సినిమాలకు మంచి మార్కెట్ ఉన్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరప్, యూకే, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ దేశాలలోనూ రణ్‌వీర్ సింగ్ మూవీకి తొలి రోజున 3 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. దాంతో కలిపి ఓవర్సీస్‌లో ఫస్ట్ డే దురంధర్ మూవీ 7.60 కోట్లకు పైగా రాబట్టింది. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఇండియాలో వచ్చిన గ్రాస్ కలిపి తొలి రోజు దురంధర్ మూవీకి వరల్డ్ వైడ్‌గా రికార్డు స్థాయిలో 40 కోట్ల రూపాయలు వసూలైంది. తద్వారా 2025లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన బాలీవుడ్ చిత్రాల్లో దురంధర్ నాలుగో స్థానంలో నిలిచింది. వార్ 2 (52.5 కోట్ల రూపాయలు) తొలి స్థానంలో నిలవగా.. ఛావా (33.10 కోట్ల రూపాయలు), సికందర్ (30.60 కోట్ల రూపాయలు)తో ఉన్నాయి. దురంధర్ కంటే ముందే రష్మిక మందన్న నటించిన థామా (25.11 కోట్ల రూపాయలు) నాలుగో స్థానంలో ఉండేది.

దురంధర్ రెండో రోజు వసూళ్లు
పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌కి తోడు శనివారం కావడంతో దురంధర్ సినిమాకు మార్నింగ్ షో నుంచే బుకింగ్స్ జరుగుతున్నాయి. దే దే ప్యార్ దే 2, తేరే ఇష్కే మే చిత్రాల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నప్పటికీ ఈ స్పై, యాక్షన్ మూవీకి ఆడియన్స్ ఆదరణ చూపిస్తున్నారు. రెండో రోజు సాయంత్రం 6 గంటల వరకు దురంధర్ మూవీకి 27 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ నివేదించింది.

కడపటి వార్తలు అందేసరికి దురంధర్ మూవీ ఇప్పటి వరకు ఇండియాలో 11 కోట్ల రూపాయల నికర వసూళ్లు సాధించింది. దాంతో రణ్‌వీర్ సింగ్ మూవీ శనివారం ఇండియాలో 22 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 5 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 30 కోట్ల రేంజ్‌లో కలెక్షన్స్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దాంతో రెండ్రోజుల్లో దురంధర్ మూవీ వరల్డ్ వైడ్‌గా 70 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని భావిస్తున్నారు. ఇదే ఊపులో వసూళ్లు సాధిస్తే.. వీకెండ్ నాటికి రణ్‌వీర్ సింగ్ మూవీ 100 కోట్ల రూపాయల మార్క్ క్రాస్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X