Dhurandhar Box Office: 1100 కోట్లతో రణ్‌వీర్ ప్రభంజనం... కల్కి రికార్డ్ బ్రేక్, జవాన్ వసూళ్లపై దురంధర్ గురి
బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధార్ తెరకెక్కించిన మూవీ దురంధర్. స్పై, యాక్షన్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఒక్కొక్క రికార్డును బద్ధలు కొడుతూ 1000 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టిన ఈ సినిమా ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ సాధించిన భారతీయ సినిమాగా, బాలీవుడ్ సినిమాగా రికార్డుల్లోకెక్కింది. దురంధర్ జోరు చూస్తుంటే ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. డిసెంబర్ 5న విడుదలైన దురంధర్ మూవీ బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 27వ రోజున రణ్‌వీర్ సింగ్ మూవీ ఎన్ని కోట్లు వసూలు చేసింది? ఈ వివరాలు పరిశీలిస్తే..
జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండేలు సంయుక్తంగా దురంధర్ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో సారా అర్జున్ హీరోయిన్‌గా నటించారు. సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, రాకేశ్ బేడీ, సౌమ్య టాండన్, నవీన్ కౌశీక్, మానవ్ గోహిల్, క్రిస్టల్ డిసౌజా తదితరులు కీలకపాత్రలు పోషించారు. వికాస్ నౌలాఖ సినిమాటోగ్రఫి, షాష్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్, శివకుమార్ వీ పానికర్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.

దురంధర్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి దురందర్ సినిమాకు 280 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అయ్యింది. టీజర్, ట్రైలర్లు, రణవీర్ సింగ్ లుక్, గెటప్‌లతో దురంధర్ చిత్రంపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. దానికి తగినట్లుగానే రణ్‌వీర్ సింగ్ మూవీకి వరల్డ్ వైడ్‌గా 168 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే వరల్డ్ వైడ్‌గా 400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ వర్గాలు వాల్యూ నిర్దేశించాయి. రణ్‌వీర్ సింగ్ మూవీని వరల్డ్ వైడ్‌గా 4000 స్క్రీన్‌లలో విడుదల చేశారు.
దురంధర్ 26 రోజుల కలెక్షన్స్
దురంధర్‌కు ఇండియా వైడ్‌గా తొలివారం 207.25 కోట్ల రూపాయలు, రెండో వారంలో 253.25 కోట్ల రూపాయలు, మూడో వారంలో 172 కోట్ల రూపాయల నికర కలెక్షన్స్ వచ్చాయి. ఇక 22వ రోజున 15 కోట్ల రూపాయలు... 23వ రోజున 20.5 కోట్ల రూపాయలు... 24వ రోజున 22.5 కోట్ల రూపాయలు... 25వ రోజున 10.5 కోట్ల రూపాయలు... 26వ రోజున 11.25 కోట్ల రూపాయలు చొప్పున వసూలు చేసింది. తద్వారా ఇండియా వైడ్‌గా 26 రోజుల వరకు 712.25 కోట్ల రూపాయల నెట్.. 854.7 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.
దురంధర్ ఓవర్సీస్ కలెక్షన్స్
ఇక దురంధర్ ఈ స్థాయిలో ప్రభంజనం సాధించడానికి ఓవర్సీస్ కలెక్షన్స్ దోహదపడ్డాయి. ఒక్క నార్త్ అమెరికాలోనే మంగళవారం నాటి వరకు అందిన లెక్కల ప్రకారం.. రణ్‌వీర్ మూవీకి 17.52 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు 160 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. ఇక మిడిల్ ఈస్ట్, యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలలో మరో 85 కోట్ల రూపాయలు రాబట్టాడు రణ్‌వీర్ సింగ్. దాంతో ఓవర్సీస్ నుంచి దురంధర్ మూవీకి ఇప్పటి వరకు 245 కోట్ల రూపాయలు కలెక్షన్స్ వచ్చాయి. గల్ఫ్‌లోని కీలకమైన 6 దేశాలు కనుక ఈ సినిమాపై నిషేధం విధించకుంటే దురంధర్ వసూళ్లు మరింత పెరిగేవని విశ్లేషకుల అంచనా. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి 26 రోజుల వరకు రణ్‌వీర్ సింగ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్ల రూపాయలు రాబట్టింది.
దురంధర్ 27వ రోజు కలెక్షన్స్
ప్రపంచవ్యాప్తంగా జనం న్యూఇయర్ సెలబ్రేషన్స్ ఉన్నప్పటికీ దురంధర్ మూవీ చెప్పుకొదగ్గ స్థాయిలో ఆక్యూపెన్సీ సాధిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. 27వ రోజు రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉన్న సమాచారం మేరకు రణ్‌వీర్ సింగ్ మూవీకి 23 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. కడపటి వార్తలు అందేసరికి దురంధర్‌కు ఇండియాలో 9.15 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిక్ నివేదించింది. దాంతో ఈ సినిమా 27వ రోజున వరల్డ్ వైడ్‌గా 12 కోట్ల రూపాయల రేంజ్‌లో వసూళ్లు రాబడుతుందని భావిస్తున్నారు. తద్వారా రణ్‌వీర్ సింగ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 1140 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
దురంధర్ రికార్డులు
రణ్‌వీర్ సింగ్ ఈ దురంధర్ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించాడు. రికార్డు స్థాయి కలెక్షన్స్‌తో ఒక్కో భారీ చిత్రాన్ని దాటుకుంటూ వెళ్లాడు. 1000 కోట్ల రూపాయల కలెక్షన్స్‌తో ఛావాను అధిగమించి ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా దురంధర్ నిలిచింది. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ (1100 కోట్ల రూపాయలు) వసూళ్ల రికార్డ్‌ను బ్రేక్ చేసి అత్యధిక కలెక్షన్స్ సాధించిన భారతీయ సినిమాలలో 7వ స్థానంలో నిలిచింది. త్వరలోనే బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్(1160 కోట్ల రూపాయలు) వసూళ్ల రికార్డ్‌ను దురంధర్ బద్ధలు కొడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీని కంటే ముందు కేజీఎఫ్ చాప్టర్ 2(1250 కోట్ల రూపాయలు), ఆర్ఆర్ఆర్ (1300 కోట్ల రూపాయలు) ఉన్నాయి.


Click it and Unblock the Notifications











