Dhurandhar Box Office: దురంధర్ కలెక్షన్ల సంచలనం.. పుష్ప 2, జవాన్ రికార్డులు అవుట్.. ఎన్ని కోట్ల వసూళ్లంటే?
బాలీవుడ్ స్టార్ హీరోలు రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ నటించిన తాజా భారీ బడ్జెట్ చిత్రం దురంధర్. ఈ సినిమాకు ఆదిత్య ధార్ రచన, నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. యాక్షన్, స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు.
ఈ చిత్రానికి వికాస్ నౌలాఖ సినిమాటోగ్రఫి, షాష్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్, శివకుమార్ వీ పానికర్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే భారీ అంచనాలు పెంచుకొన్న ఈ చిత్రం డిసెంబర్ 5వ తేదీ 2025 రోజున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమా తొలి ఆట నుంచే బాక్సాఫీస్‌ను కుదిపేస్తున్నది.

దురంధర్ సినిమాను భారీ తారాగణం, టాప్ టెక్నిషియన్స్‌తో హై ఎండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించారు. ఈ సినిమా పార్ట్ 1 బడ్జెట్ విషయానికి వస్తే.. సుమారుగా 250 కోట్ల రూపాయలు. ఈ సినిమా ప్రమోషనల్ ఖర్చులతో కలిపి మొత్తంగా ఈ సినిమా బడ్జెట్‌ను 280 కోట్ల రూపాయలు అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రం 280 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ చిత్రాన్ని సుమారుగా 4500 స్క్రీన్లలో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేశారు. ఈ చిత్రం బడ్జెట్ ఎంత? ఈ సినిమా సాధించిన కలెక్షన్ల ఎంత? ఈ చిత్రం 28 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
తొలి ఆట నుంచే హిట్ టాక్ అందుకొన్న దురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద వెనక్కి చూసుకోలేదు. ఈ చిత్రం తొలి వారంలో 207 కోట్ల రూపాయలు, రెండో వారంలో 253 కోట్ల రూపాయలు, మూడో వారంలో 172 కోట్ల రూపాయలు, నాలుగో వారంలో 106 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 739 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. కానీ నిర్మాత చెప్పిన లెక్కల ప్రకారం ఈ సినిమా 785 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఈ చిత్రం 28వ రోజు కూడా రికార్డు కలెక్షన్లను రాబట్టింది. న్యూఇయర్ రోజున సెలవు దినం కావడంతో భారీగా వసూళ్లు నమోదు అయ్యాయి. ఈ చిత్రం చిత్ర యూనిట్ తెలిపిన ప్రకారం 18 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఇండియాలో 800 కోట్ల నెట్ కలెక్షన్లకు చేరువైంది.
దురంధర్ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా ఓవర్సీస్‌లో బాక్సాఫీస్‌ను కుమ్మేసింది. ఈ చిత్రం తాజా సమాచారం ప్రకారం.. 26.5 మిలియన్ డాలర్లు అంటే.. సుమారుగా 255 కోట్ల రూపాయలకుపైగా కలెక్షన్లను రాబట్టింది. ఇక ఈ చిత్రం ఇండియాలో 785 కోట్ల నెట్, 890 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1142 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని సాక్ నిక్ వెల్లడించింది.
దురంధర్ సినిమా 2025లో పలు అత్యధిక వసూళ్ల రికార్డులను అధిగమించింది. ఈ సినిమా షారుక్ ఖాన్ నటించిన జవాన్ చిత్రం సాధించిన 1050 కోట్ల రూపాయలు, అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా హిందీ వెర్షన్ కలెక్షన్లను ఇండియాలో అధిగమించింది అని ట్రేడ్ వర్గాలు ధృవీకరించాయి. ఇంకా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా ఉంది. కాబట్టి ఈ చిత్రం మరిన్ని రికార్డులను బ్రేక్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











