Dhurandhar Day 3 Collections: రణ్‌వీర్ ప్రభంజనం.. 100 కోట్లు అవుట్.. 3వ రోజు దురంధర్ మూవీకి ఎన్ని కోట్లంటే?
ఆదిత్య ధార్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ నటించిన చిత్రం దురంధర్. జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండేలు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో రణ్‌వీర్ సరసన సారా అర్జున్ హీరోయిన్‌గా నటించారు. సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, రాకేశ్ బేడీ, సౌమ్య టాండన్, నవీన్ కౌశీక్, మానవ్ గోహిల్, క్రిస్టల్ డిసౌజా తదితరులు కీలకపాత్రలు పోషించారు. వికాస్ నౌలాఖ సినిమాటోగ్రఫి, షాష్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్, శివకుమార్ వీ పానికర్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా దురంధర్ సినిమా రిలీజ్ అయింది. తొలిరోజు రికార్డ్ వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచిన ఈ చిత్రం రెండ్రోజుల్లోనే 100 కోట్ల రూపాయలకు చేరువైంది. ఈ నేపథ్యంలో దురంధర్ చిత్రం మూడో రోజు వరల్డ్ వైడ్‌గా ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే..
దురంధర్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి దురందర్ సినిమాకు 280 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అయ్యింది. టీజర్, ట్రైలర్లు, రణవీర్ సింగ్ లుక్, గెటప్‌లతో దురంధర్ చిత్రంపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. దానికి తగినట్లుగానే రణ్‌వీర్ సింగ్ మూవీకి వరల్డ్ వైడ్‌గా 168 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దాంతో దురంధర్ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే వరల్డ్ వైడ్‌గా 400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ వర్గాలు వాల్యూ నిర్దేశించాయి. రణ్‌వీర్ సింగ్ మూవీని వరల్డ్ వైడ్‌గా 4000 స్క్రీన్‌లలో విడుదల చేశారు.

దురంధర్ రెండు రోజుల కలెక్షన్స్
అంచనాలకు తగినట్లుగానే దురంధర్ మూవీ కలెక్షన్స్ రాబడుతోంది. తొలి రోజున ఇండియా వైడ్‌గా 28 కోట్ల రూపాయలు, రెండో రోజున 32 కోట్ల రూపాయలు చొప్పున 60 కోట్ల రూపాయల నెట్.. 72 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది ఈ చిత్రం. భారత్‌తో సమానంగా ఓవర్సీస్ నుంచి కూడా కలెక్షన్స్ వస్తుండటంతో దురంధర్ ఎదురు లేకుండా సాగుతోంది.
దురంధర్ ఓవర్సీస్ కలెక్షన్స్
రెండో రోజైన శనివారం రాత్రి 7 గంటల వరకు దురంధర్ మూవీకి నార్త్ అమెరికాలో 750K డాలర్లు (భారత కరెన్సీలో 6.75 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. ఇక ఆదివారం బుకింగ్స్‌లోనూ రణ్‌వీర్ సింగ్ జోరు చూపిస్తున్నాడు. మూడో రోజైన ఆదివారం అడ్వాన్స్ బుకింగ్ కింద నార్త్ అమెరికాలోని 322 సెంటర్స్‌లో, 728 షోలకు గాను, 17645 టికెట్స్ అమ్ముడై 2,38,449 డాలర్లు (2.15 కోట్ల రూపాయలు) రాబట్టింది. దాంతో ఇప్పటి వరకు ఒక్క నార్త్ అమెరికా నుంచే 10 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ వసూలు చేశాడు దురంధర్. ఇక యూరప్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ తదితర దేశాలో మరో 8 కోట్ల రూపాయల వరకు వచ్చింది. దాంతో ఓవర్సీస్‌లో రణ్‌వీర్ సినిమాకు 18 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లు కలిపి ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 90 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.
దురంధర్ మూడో రోజు వసూళ్లు
శుక్రవారం మొదలైన దురంధర్ ప్రభంజనం ఆదివారం కూడా కొనసాగుతోంది. వీకెండ్ కావడంతో ఈరోజు ఉదయం నుంచే మంచి ఆక్యూపెన్సీ నమోదై.. ఫస్టో షో, సెకండ్ షోలకు సైతం భారీగా బుకింగ్స్ జరుగుతున్నాయి. 3వ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ సినిమాకు 28 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది. కడపటి వార్తలు అందేసరికి దురంధర్ మూవీకి 13 కోట్ల రూపాయల నికర కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిక్ తెలిపింది. దాంతో రణ్‌వీర్ మూవీకి 3వ రోజు ఇండియాలో 25 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 7 కోట్ల రూపాయల చొప్పున 32 కోట్ల రూపాయల నుంచి 35 కోట్ల రూపాయల రేంజ్‌లో కలెక్షన్స్ వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. రెండు రోజుల్లోనే 90 కోట్ల రూపాయలు వసూలు చేసిన దురంధర్ మూవీ.. ఆదివారం ఉదయం నాటి కలెక్షన్స్‌తో 100 కోట్ల క్లబ్‌లో చేరింది. మూడో రోజు కలెక్షన్స్‌తో కలిపి రణ్‌వీర్ సింగ్ చిత్రం వరల్డ్ వైడ్‌గా 125 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











