Dhurandhar Day 4 Collections: రణ్‌వీర్ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 200 కోట్లకు చేరువగా దురంధర్, 4వ రోజు ఎంతంటే?

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన లేటెస్ట్ మూవీ దురంధర్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా విడుదలైన ఈ సినిమా తొలిరోజు భారీ ఓపెనింగ్స్ అందుకుంది. కేవలం మూడు రోజుల్లోనే 150 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలో దురంధర్ 4వ రోజు కూడా తన హవా చూపిస్తుందా? సోమవారం వర్కింగ్ డే టెస్టులో రణవీర్ సింగ్ పాసయ్యాడా లేదా? ఈ సినిమాకు ఎన్ని కోట్లు వసూలైంది? ఈ వివరాలు పరిశీలిస్తే..

దురంధర్ చిత్రానికి ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండేలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో సారా అర్జున్‌ హీరోయిన్‌గా నటించారు. సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, రాకేశ్ బేడీ, సౌమ్య టాండన్, నవీన్ కౌశీక్, మానవ్ గోహిల్, క్రిస్టల్ డిసౌజా తదితరులు కీలకపాత్రలు పోషించారు. వికాస్ నౌలాఖ సినిమాటోగ్రఫి, షాష్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్, శివకుమార్ వీ పానికర్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.

Dhurandhar Day 4 Expected Box Office Collections Worldwide Ranveer Singh s Movie heading towards 200 crores mile stone

దురంధర్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి దురందర్ సినిమాకు 280 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అయ్యింది. టీజర్, ట్రైలర్లు, రణవీర్ సింగ్ లుక్, గెటప్‌లతో దురంధర్ చిత్రంపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. దానికి తగినట్లుగానే రణ్‌వీర్ సింగ్ మూవీకి వరల్డ్ వైడ్‌గా 168 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే వరల్డ్ వైడ్‌‌గా 400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ వర్గాలు వాల్యూ నిర్దేశించాయి. రణ్‌వీర్ సింగ్ మూవీని వరల్డ్ వైడ్‌గా 4000 స్క్రీన్‌లలో విడుదల చేశారు.

దురంధర్ మూడు రోజుల కలెక్షన్స్
దురంధర్ మూవీ తొలి రోజున 28 కోట్ల రూపాయలు, రెండో రోజున 32 కోట్ల రూపాయలు, మూడో రోజున 43 కోట్ల రూపాయలు చొప్పున ఇండియా వైడ్‌గా 103 కోట్ల రూపాయల నెట్.. 123.50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో దురంధర్ మూవీ వసూళ్లు పరిశీలిస్తే... నార్త్ అమెరికాలో ఇప్పటికే 2.20 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 20 కోట్ల రూపాయలు) రాబట్టినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక యూరప్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ తదితర దేశాలో 14 కోట్ల రూపాయల చొప్పున వసూలు చేసింది. దాంతో ఓవరాల్‌గా ఓవర్సీస్‌లో రణ్‌వీర్ సినిమాకు 34.50 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లు కలిపి ఈ సినిమా మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 160.15 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.

దురంధర్ నాలుగో రోజు వసూళ్లు
వీకెండ్‌లో విధ్వంసం సృష్టించిన దురంధర్ మూవీ వర్కింగ్ డేస్‌లో ఎలాంటి వసూళ్లను రాబడుతుందనేది ఆసక్తిగా మారింది. సోమవారం మార్నింగ్, మ్యాట్నీ షోలకు చెప్పుకోదగ్గ స్థాయిలోనే బుకింగ్స్ జరిగినట్లుగా నివేదికలు చెబుతున్నాయి. నాలుగో రోజు సాయంత్రం 4 గంటల వరకు దురంధర్ మూవీకి 14 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది. అయితే ఫస్ట్ షో, సెకండ్ షోలకు బుకింగ్స్ జోరందుకుంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కడపటి వార్తలు అందేసరికి ఈరోజు రణ్‌వీర్ సింగ్ మూవీకి ఇండియాలో 4.52 కోట్ల రూపాయల నికర కలెక్షన్స్ వచ్చాయి. 4వ రోజు దురంధర్ చిత్రానికి భారత్‌లో 12 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 3 కోట్ల రూపాయల చొప్పున వరల్డ్ వైడ్‌గా 15 కోట్ల రూపాయల కలెక్షన్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు. దాంతో 4 రోజుల్లో రణ్‌వీర్ సింగ్ మూవీకి ప్రపంచవ్యాప్తంగ 175 కోట్ల రూపాయలు కలెక్షన్స్ వస్తాయని అంటున్నారు. దురంధర్ జోరు ఇలాగే కొనసాగితే 5 రోజుల్లోనే 200 కోట్ల మార్క్‌లో అలవోకగా చేరుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X