Dhurandhar Day 5 Collections: దురంధర్‌కు భారీ వసూళ్లు.. అక్షయ్ రికార్డ్ బ్రేక్, రణ్‌వీర్ మూవీకి 5వ రోజు ఎంతంటే

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఆదిత్య ధార్ తెరకెక్కించిన స్పై, యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. డిసెంబర్ 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్ హీరో హీరోయిన్లు‌గా నటించారు. జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండేలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, రాకేశ్ బేడీ, సౌమ్య టాండన్, నవీన్ కౌశీక్, మానవ్ గోహిల్, క్రిస్టల్ డిసౌజా తదితరులు కీలకపాత్రలు పోషించారు. వికాస్ నౌలాఖ సినిమాటోగ్రఫి, షాష్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్, శివకుమార్ వీ పానికర్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 5వ రోజు దురంధర్ మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే..

దురంధర్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి దురందర్ సినిమాకు 280 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అయ్యింది. టీజర్, ట్రైలర్లు, రణవీర్ సింగ్ లుక్, గెటప్‌లతో దురంధర్ చిత్రంపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. దానికి తగినట్లుగానే రణ్‌వీర్ సింగ్ మూవీకి వరల్డ్ వైడ్‌గా 168 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే వరల్డ్ వైడ్‌‌గా 400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ వర్గాలు వాల్యూ నిర్దేశించాయి. రణ్‌వీర్ సింగ్ మూవీని వరల్డ్ వైడ్‌గా 4000 స్క్రీన్‌లలో విడుదల చేశారు.

Dhurandhar Day 5 Expected Box Office Collections Worldwide Ranveer Singh s Movie beats Sky Force Collections

దురంధర్ 4 రోజుల కలెక్షన్స్
దురంధర్ మూవీ తొలి రోజున 28 కోట్ల రూపాయలు, రెండో రోజున 32 కోట్ల రూపాయలు, మూడో రోజున 43 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 23.25 కోట్ల రూపాయలు చొప్పున నాలుగు రోజుల్లో ఇండియా వైడ్‌గా 126.25 కోట్ల రూపాయల నెట్.. 151 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో దురంధర్ మూవీ దుమ్ము దులుపుతోంది. నార్త్ అమెరికా, యూరప్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మిడిల్ ఈస్ట్, గల్ఫ్ తదితర దేశాలతో కలిపి నాలుగు రోజుల్లో దురంధర్ మూవీకి ఓవర్సీస్ నుంచి 42 కోట్ల రూపాయలు గ్రాస్ వచ్చింది.

దురంధర్ ఓవర్సీస్ కలెక్షన్స్
నార్త్ అమెరికాలో అయితే దురంధర్ ప్రభంజనం సృష్టిస్తోంది. ఐదో రోజు రణ్‌‌వీర్ సింగ్ సినిమాకు మంగళవారం అడ్వాన్స్ సేల్స్‌లో దుమ్మురేపింది. అమెరికా, కెనడాలలో ఈరోజు 331 లోకేషన్స్‌లో, 778 షోలకు గాను 23,365 టికెట్లు బుక్ అయ్యాయి. తద్వారా కడపటి వార్తలు అందేనాటికి ఒక్క ఐదో రోజే నార్త్ అమెరికాలో ఈ సినిమాకు 2,40,660 డాలర్లు (భారత కరెన్సీలో దాదాపుగా 2.16 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. ఫైనల్ లెక్కలు ముగిసేనాటికి నార్త్ అమెరికాలో ఈ సినిమాకు ఐదో రోజు కలెక్షన్స్ 3 కోట్ల రూపాయలు దాటే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. దాంతో 5వ రోజు కూడా ఓవర్సీస్ నుంచి దురంధర్‌కు భారీ వసూళ్లు దక్కే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి రణ్‌వీర్ సింగ్ మూవీకి ఇప్పటి వరకు 193 కోట్ల రూపాయలు వసూలైంది.

దురంధర్ 5వ రోజు వసూళ్లు
వీకెండ్‌లో విధ్వంసం సృష్టించిన దురంధర్ వర్కింగ్ డేస్ టెస్ట్ పాసైంది. సోమవారం వరల్డ్ వైడ్‌గా 30 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి ట్రేడ్ పండితులను ఆశ్చర్యపరిచాడు రణ్‌వీర్. ఇక మంగళవారం కూడా దురంధర్ తన హవా చూపిస్తున్నట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఐదో రోజు సైతం మార్నింగ్, మ్యాట్నీ షోలకు మంచి ఆక్యూపెన్సీ నమోదు చేసింది ఈ చిత్రం. ఐదో రోజు రాత్రి 8 గంటల వరకు దురంధర్‌కు 32 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు శాక్‌నిక్ తెలిపింది.

అక్షయ్ కుమార్ రికార్డ్ బ్రేక్
ఇక కడపటి వార్తలు అందే వరకు ఈరోజు రణ్‌వీర్ మూవీకి ఇండియాలో 18.65 కోట్ల రూపాయల నికర కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌‌నిక్ తెలిపింది. 5వ రోజు దురంధర్ మూవీ ఇండియాలో 22 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 3 కోట్ల రూపాయల చొప్పున వరల్డ్ వైడ్‌గా 25 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. 5వ రోజు ఉదయం నాటికే రణ్‌వీర్ సింగ్ మూవీ 200 కోట్ల రూపాయల క్లబ్‌లో అడుగుపెట్టినట్లు విశ్లేషకులు తెలిపారు. ఐదో రోజుల వరకు ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 220 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధిస్తుందని భావిస్తున్నారు. తద్వారా ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ సాధించిన బాలీవుడ్ చిత్రాల్లో స్కై ఫోర్స్‌ను అధిగమించి దురంధర్ 10వ స్థానంలో నిలిచింది. సికందర్ (211.34 కోట్ల రూపాయలు), థామా (211.35 కోట్ల రూపాయలు) దీని కంటే ముందున్నాయి. అయితే వీటిని మంగళవారం రణ్‌వీర్ సింగ్ మూవీ దాటేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X