Dhurandhar Day 6 Collections: రణ్‌వీర్ మూవీకి రికార్డ్ వసూళ్లు.. 300 కోట్ల దిశగా దురంధర్, 6వ రోజు ఎంతంటే?
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన దురంధర్ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా కేవలం 5 రోజుల్లోనే 200 కోట్ల క్లబ్‌లో చేరి 300 కోట్ల మార్క్ దిశగా పరుగులు తీస్తూ ట్రేడ్ పండితులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. 2025 చివరిలో బాలీవుడ్‌కు ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో పాటు కొత్త సంవత్సరానికి మంచి శకునంగా మారింది. ఈ నేపథ్యంలో 6వ రోజు దురంధర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లు రాబట్టింది? ఏయే రికార్డులు బద్ధలు కొట్టిందో పరిశీలిస్తే..
దురంధర్ చిత్రానికి ఆదిత్య ధార్ దర్శకత్వం వహించగా... జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండేలు సంయుక్తంగా నిర్మించారు. సారా అర్జున్ హీరోయిన్‌గా నటించారు. సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, రాకేశ్ బేడీ, సౌమ్య టాండన్, నవీన్ కౌశీక్, మానవ్ గోహిల్, క్రిస్టల్ డిసౌజా తదితరులు కీలకపాత్రలు పోషించారు. వికాస్ నౌలాఖ సినిమాటోగ్రఫి, షాష్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్, శివకుమార్ వీ పానికర్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.

దురంధర్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి దురందర్ సినిమాకు 280 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అయ్యింది. టీజర్, ట్రైలర్లు, రణవీర్ సింగ్ లుక్, గెటప్‌లతో దురంధర్ చిత్రంపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. దానికి తగినట్లుగానే రణ్‌వీర్ సింగ్ మూవీకి వరల్డ్ వైడ్‌గా 168 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే వరల్డ్ వైడ్‌గా 400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ వర్గాలు వాల్యూ నిర్దేశించాయి. రణ్‌వీర్ సింగ్ మూవీని వరల్డ్ వైడ్‌గా 4000 స్క్రీన్‌లలో విడుదల చేశారు.
దురంధర్ 5 రోజుల కలెక్షన్స్
దురంధర్ మూవీ తొలి రోజున 28 కోట్ల రూపాయలు, రెండో రోజున 32 కోట్ల రూపాయలు, మూడో రోజున 43 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 23.25 కోట్ల రూపాయలు, ఐదో రోజున 27 కోట్ల రూపాయలు చొప్పున ఐదు రోజుల్లో ఇండియా వైడ్‌గా 153.25 కోట్ల రూపాయలు, 183.50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో దురంధర్ మూవీ 50 కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లు కలిపి దురంధర్ మూవీకి 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 233.50 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
దురంధర్ 6వ రోజు కలెక్షన్స్
వీకెండ్, వర్కింగ్ డేస్ అన్న తేడా లేకుండా దురంధర్ మూవీ బాక్సాఫీస్‌ని వణికిస్తోంది. ఆరో రోజు రాత్రి 8 గంటల వరకు ఈ సినిమాకు 32 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది. కడపటి వార్తలు అందేసరికి దురంధర్ మూవీకి ఇండియాలో 15 కోట్ల రూపాయల నికర కలెక్షన్స్ సాధించింది. 6వ రోజు దురంధర్ మూవీకి ఇండియాలో 25 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 5 కోట్ల రూపాయలు చొప్పున ఆరు రోజుల్లో 30 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దాంతో రణ్‌వీర్ సింగ్ మూవీ 6 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 265 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని భావిస్తున్నారు.
దురంధర్ రికార్డులు
ఈ కలెక్షన్స్‌తో రణ్‌వీర్ సింగ్ తన ఖాతాలో సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాడు. గడిచిన 6 రోజుల్లో మల్టీప్లెక్స్‌లలో జరిగిన ప్రీ సేల్స్‌లో ఏకంగా 1.13 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. ఇందులో పీవీఆర్ 51.6 వేల టికెట్లు, ఐనాక్స్‌లో 33.7 వేల టికెట్లు, సినీపోలీస్‌లో 28.2 వేల టికెట్లు సేల్ అయినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. 6 రోజున ప్రీ సేల్స్ కింద ఇండియాలో 5.49 కోట్ల రూపాయలు రాబట్టి సంచలనం సృష్టించింది. అలాగే ఇండియాలో నికర వసూళ్ల కింద అత్యధిక కలెక్షన్స్ సాధించిన రణ్‌వీర్ సింగ్ సినిమాలలో దురంధర్ 4వ స్థానంలో నిలిచింది. పద్మావత్ (300.26 కోట్ల రూపాయలు)తో టాప్‌లో ఉండగా.. సింబా (240.22 కోట్ల రూపాయలు), బాజీరావ్ మస్తానీ (184 కోట్ల రూపాయలు)తో దురంధర్ కంటే ముందున్నాయి. మరి రానున్న రోజుల్లో రణ్‌వీర్ సింగ్ మూవీ ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











