3000 కోట్ల క్లబ్‌లో ధురంధర్.. ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలో ఆదిత్య ధార్ అరుదైన రికార్డ్

ధురంధర్ ది రివేంజ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనాలు క్రియేట్ చేస్తూ 4వ వారంలో కూడా రికార్డు వసూళ్లతో దూసుకెళ్తున్నది. ఓ వైపు ఆదిత్య ధార్ రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ చరిత్రను తిరగరాస్తూనే మరోవైపు ధురంధర్ ఫ్రాంజైజీ అరుదైన రికార్డును అధిగమించింది. భారతీయ సినిమా బాక్సాఫీస్ చరిత్రలో 3000 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరిన తొలి చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ నటించిన ఈ రెండు సినిమాలు సాధించిన కలెక్షన్లు, లాభాల వివరాల్లోకి వెళితే..

పాకిస్థాన్‌లో ఇండియన్ సీక్రెట్ ఏజెంట్ చేసిన రహస్య ఆపరేషన్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన సినిమా కోసం థాయ్‌లాండ్‌లో మరో కరాచీని క్రియేట్ చేశారు. కరాచీ, ఇతర ప్రాంతాలను సృష్టించడానికి భారీగా ఖర్చు చేశారు. ధురంధర్ 1 కోసం 200 కోట్లకుపైగా, ధురంధర్ 2 సినిమా కోసం 250 కోట్ల రూపాయలను నిర్మాణం కోసం ఉపయోగించారు. ఈ రెండు ఫ్రాంచైజీలు నిర్మించడానికి సుమారుగా 450 కోట్ల రూపాయల వ్యయాన్ని భరించారు. 450 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది.

Dhurandhar Franchise entered into 3000 Crores Club

ధురంధర్ 1 చిత్రం అంచనాలు లేకుండా వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది. కేవలం హిందీ వెర్షన్‌లోనే రిలీజ్ అయిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా కలెక్షన్ల సంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమా తొలివారం 207 కోట్ల రూపాయలను వసూలు చేయగా.. రెండో వారం అదే జోష్‌ను కొనసాగించి 253 కోట్ల రూపాయలను వసూలు చేసింది. మూడో వారంలో 172 కోట్ల రూపాయలు, నాలుగో వారంలో 105 కోట్ల రూపాయలు, 5వ వారంలో 51 కోట్ల రూపాయలు, ఆరో వారంలో 26 కోట్ల రూపాయలు, ఏడో వారంలో 14 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఎనిమిదో, తొమ్మిది, పది వారాల్లో 8 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 840 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లను రాబట్టింది.

ధురంధర్ 2 సినిమాకు ఓవర్సీస్‌ ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. ఈ చిత్రం నార్త్ అమెరికా, ఇతర దేశాల్లో కలిపి సుమారుగా 300 కోట్ల రూపాయలను గ్రాస్ వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1007 కోట్ల నెట్, 1307 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఈ చిత్రం నిర్మాతకు ఊహించని లాభాలను తీసుకొచ్చి పెట్టింది. ఈ క్రేజ్‌తో మార్చి 19వ తేదీన ధురంధర్ 2 సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు.

ధురంధర్ 2 ప్రీమియర్లకు అనూహ్యమైన స్పందన రావడంతో తొలి రోజు నుంచే వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల అగ్గి పుట్టింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి బ్రహ్మండమై ఆధరణ లభించడంతో కలెక్షన్ల రికార్డులు ఏరులై పారాయి. ధురందర్ 2 చిత్రం తొలివారంలోనే 674 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండో వారం 263 కోట్ల రూపాయలు, మూడో వారం 110 కోట్ల రూపాయలకుపైగా, నాలుగో వారంలో ప్రస్తుతానికి 47 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

దాంతో ధురంధర్ 2 చిత్రం ఇండియాలో 1088 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు, 1303 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం 415 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా 1719 కోట్ల రూపాయలకుపైగా కలెక్షన్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ధురంధర్ 1307 కోట్లు, ధురంధర్ 2 చిత్రం 1719 కలిపితే సుమారుగా 3026 కోట్ల రూపాయల కలెక్షన్లను నమోదు చేసింది. దాంతో 3 వేల కోట్ల రూపాయల క్లబ్‌లో చేరిన ఏకైక చిత్రంగా ఈ సినిమా రికార్డు క్రియేట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X