3100 కోట్ల కలెక్షన్లతో ధురంధర్ సరికొత్త చరిత్ర.. బాహుబలి రికార్డుకు అందనంత దూరంలో..

భారతీయ సినిమా బాక్సాఫీస్ వద్ద ధురంధర్ 2 చిత్రం చరిత్రను సృష్టించింది. గత 54 రోజులుగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకొంటూ భారీ కలెక్షన్లను నమోదు చేసింది. ధురంధర్ 1 చిత్రం క్రియేట్ చేసిన రికార్డులను మించి ధురంధర్ 2 చిత్రం వసూళ్లను నమోదు చేసింది. ఈ సినిమా ప్రస్తుతం భారతీయ సినిమా రంగంలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన ఫ్రాంచైజీగా రికార్డును సొంతం చేసుకొన్నది. ఇప్పటి వరకు బాహుబలి పేరిట ఉన్న రికార్డులను అధిగమించింది. ఈ సినిమా గత 54 రోజులుగా ఎంత వసూలు చేసింది? బాహుబలి క్రియేట్ చేసిన రికార్డు ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన బాహుబలి ఫ్రాంచైజీ సంచలన విజయం సాధించింది. భారతీయ సినిమా రంగంలో అత్యధిక వసూళ్లు సాధించిన ఫ్రాంచైజీగా రికార్డును కొనసాగించింది. బాహుబలి ది బిగినింగ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 650 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేస్తే.. ఆ తర్వాత వచ్చిన బాహుబలి ది కన్‌క్లూజన్ చిత్రం 1791 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. బాహుబలి ఫ్రాంచైజీ సుమారుగా 2441 కోట్ల రూపాయల గ్రాస్‌ను సాధించి.. అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా బాక్సాఫీస్ ఘనతను సొంతం చేసుకొన్నది.

Dhurandhar Franchise joined 3100 Crores Cluib

అయితే ధురంధర్ సినిమా ఫ్రాంచైజీ రాక ముందు వరకు బాహుబలి ఫ్రాంచైజీనే ప్రామాణికంగా తీసుకొన్నారు. అయితే ధురంధర్ 1 చిత్రం బాక్సాఫీస్ వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం ఇండియాలో 1007 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో 300 కోట్ల గ్రాస్ కలిపి సుమారుగా 1307 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆ తర్వాత రిలీజైన ధురంధర్ చిత్రం కూడా అంతకు మించి కలెక్షన్లను సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక ధురంధర్ 2 సినిమా విషయానికి వస్తే.. గత 8 వారాలుగా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు క్రియేట్ చేస్తున్నది. ఈ చిత్రం ఇండియాలో 1368 కోట్ల రూపాయల గ్రాస్, ఓవర్సీస్‌లో 427 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1794 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 3101 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది. భారతీయ బాక్సాఫీస్ వద్ద ఇదే అత్యుత్తమ రికార్డు అని వెల్లడించారు. దాంతో ప్రస్తుతం బాహుబలి రికార్డును అధిగమించడమే కాకుండా 3000 కోట్ల క్లబ్‌లో చేరడం మరో రికార్డుగా మారింది.

ధురంధర్ ఫ్రాంచైజీ వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ స్టార్ హీరోలు రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ నటించిన తాజా భారీ బడ్జెట్ చిత్రం దురంధర్. ఈ సినిమాకు ఆదిత్య ధార్ రచన, నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. యాక్షన్, స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు. ఈ చిత్రానికి వికాస్ నౌలాఖ సినిమాటోగ్రఫి, షాష్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్, శివకుమార్ వీ పానికర్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమాను సుమారుగా 450 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X