Dhurandhar USA Collection: బాహుబలి 2ని కొట్టలేకపోయిన ధురంధర్... అమెరికాలో రణ్‌వీర్ మూవీకి ఎన్ని కోట్లంటే?

ఆదిత్య ధార్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన మూవీ ధురంధర్. స్పై యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు నమోదు చేసింది. పార్ట్ 2 త్వరలో రిలీజ్ అవుతుండగా ధురంధర్ ఇంకా థియేటర్‌లలో సందడి చేస్తూనే ఉంది. భారతదేశంతో పాటు వరల్డ్ వైడ్‌గా రణ్‌వీర్ సింగ్ మూవీకి రికార్డ్ కలెక్షన్స్ నమోదవుతున్నాయి. భారతీయ చిత్రాలకు ప్రధాన మార్కెట్‌గా ఉన్న నార్త్ అమెరికాలో ధురంధర్ .. ఓ అరుదైన రికార్డును మిస్ చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు రణ్‌వీర్ సింగ్ మూవీ ఎన్ని కోట్లు రాబట్టింది? ఆ అరుదైన రికార్డ్ ఏంటీ? అనేది పరిశీలిస్తే..

జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండేలు సంయుక్తంగా ధురంధర్ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో రణ్‌వీర్ సింగ్ సరసన సారా అర్జున్ హీరోయిన్‌గా నటించారు. సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, రాకేశ్ బేడీ, సౌమ్య టాండన్, నవీన్ కౌశీక్, మానవ్ గోహిల్, క్రిస్టల్ డిసౌజా తదితరులు కీలకపాత్రలు పోషించారు. వికాస్ నౌలాఖ సినిమాటోగ్రఫి, షాష్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్, శివకుమార్ వీ పానికర్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ధురంధర్ మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

Dhurandhar North America Box Office Ranveer Singh starrer missed out on surpassing Baahubali 2 record

ధురంధర్ బడ్జెట్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ధురంధర్ సినిమాకు 280 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అయ్యింది. అలాగే ఈ మూవీకి వరల్డ్ వైడ్‌గా 150 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా బాలీవుడ్ వర్గాల టాక్. ధురంధర్ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే వరల్డ్ వైడ్‌‌గా 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ వర్గాలు వాల్యూ నిర్దేశించాయి. రణ్‌వీర్ సింగ్ మూవీని వరల్డ్ వైడ్‌గా 6500 స్క్రీన్‌లలో విడుదల చేశారు.

ధురంధర్ కలెక్షన్స్ ఎంత
రణ్‌వీర్ సింగ్ మూవీకి ఇండియాలో తొలి వారం 207.25 కోట్ల రూపాయలు, రెండో వారంలో 253.25 కోట్ల రూపాయలు, మూడో వారంలో 172 కోట్ల రూపాయలు, నాలుగో వారంలో 106.5 కోట్ల రూపాయలు, ఐదో వారంలో 51.25 కోట్ల రూపాయలు, ఆరో వారంలో 27 కోట్ల రూపాయలు, ఏడో వారంలో 14 కోట్ల రూపాయలు, ఎనిమిదో వారంలో 5.5 కోట్ల రూపాయలు, తొమ్మిదో వారంలో 1.75 కోట్ల రూపాయలు, 65వ రోజున 5 లక్షల రూపాయలు, 65వ రోజున 15 లక్షల రూపాయలు, 66వ రోజున 20 లక్షల రూపాయలు వసూలు చేసింది. తద్వారా ఇప్పటి వరకు ఇండియాలో 838 కోట్ల రూపాయల నెట్.. 1005.25 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సాక్‌నిక్ నివేదించింది.

ఓవర్సీస్‌లో ధురంధర్ కలెక్షన్స్
రిలీజైన నాటి నుంచి ధురంధర్ ఓవర్సీస్‌లో దుమ్మురేపుతోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు 20.65 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 187.32 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మిడిల్ ఈస్ట్ తదితర దేశాలలో మరో 112 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు ధురంధర్ 300 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు.

గల్ఫ్‌లోని 6 దేశాలు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఖతార్, బహ్రయిన్, ఒమన్ దేశాలు ధురంధర్ చిత్రాన్ని నిషేధించాయి. దీంతో దాదాపు 100 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్‌ను ఈ సినిమా కోల్పోయింది. లేదంటే లెక్క మరోలా ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి రణ్‌వీర్ సింగ్ మూవీకి ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా 1304.5 కోట్ల రూపాయలు వచ్చినట్లు సాక్‌నిక్ తెలిపింది. తద్వారా అత్యధిక కలెక్షన్స్ సాధించిన భారతీయ చిత్రాల్లో ధురంధర్ 4వ స్థానంలో నిలిచింది. దంగల్, బాహుబలి 2, పుష్ప 2 చిత్రాలు దీని కంటే ముందున్నాయి.

బాహుబలి 2 రికార్డ్‌ సేఫ్
ధురంధర్ తన థియేట్రికల్ జర్నీలో పలు మైలురాళ్లు సాధించింది. అయితే ఎస్ఎస్ రాజమౌళి- ప్రభాస్‌ల బాహుబలి 2 రికార్డ్‌ను మాత్రం టచ్ చేయలేకపోయింది. నార్త్ అమెరికాలో ధురంధర్ చిత్రం దాదాపు 60 రోజులకు పైగా ప్రదర్శితమై 20.65 మిలియన్ డాలర్లు (187 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. ప్రస్తుతం అమెరికా మార్కెట్‌లో బోర్డర్ 2, మన శంకర వరప్రసాద్ గారు, మర్దానీ 3 వంటి చిత్రాలు హవా సాగిస్తోంది.

దాంతో నార్త్ అమెరికాలో బాహుబలి 2 రికార్డ్‌ను క్రాస్ చేయాలన్న ధురంధర్ ఆశ నెరవేరడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. నార్త్ అమెరికాలో బాహుబలి 2 తన థియేట్రికల్ రన్ ముగిసేసరికి 22 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు 200 కోట్ల రూపాయలు) రాబట్టి, ఈ ఏరియాలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన భారతీయ చిత్రాల్లో నెంబర్‌వన్‌గా హవా సాగిస్తోంది. దాంతో ధురంధర్ రెండో ప్లేస్‌తోనే సరిపెట్టుకుంది. ఆ తర్వాత స్థానంలో కల్కి 18.57 మిలియన్ డాలర్లు, పఠాన్ 17.49 మిలియన్ డాలర్లు, ఆర్ఆర్ఆర్ 15.34 మిలియన్ డాలర్లుతో నిలిచాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X