1700 కోట్ల క్లబ్‌లోకి ధురంధర్ 2.. బాక్సాఫీస్ రికార్డు వేటాడుతున్న రణ్‌వీర్ సింగ్!

ధురంధర్ ది రివెంజ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ జైత్రయాత్రను కొనసాగిస్తున్నది. గత 19 రోజులుగా తిరుగులేని విధంగా కలెక్షన్లను రాబడుతున్నది. రణ్‌వీర్ సింగ్, ఆదిత్య ధార్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ మూవీ భారతీయ సినిమా రికార్డులను వేటాడుతున్నది. ఇప్పటి వరకు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఉన్న రికార్డుల తుప్పును వదిలించే ప్రయత్నం చేస్తున్నది. ఈ క్రమంలో గత 19 రోజుల్లో ఈ సినిమా కలెక్షన్లు ఎంత? ఎలాంటి రికార్డులను తిరగరాసింది అనే వివరాల్లోకి వెళితే..

ధురంధర్ 2 చిత్రం తొలివారం అంటే 8 రోజుల్లో ఇండియాలో 690 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండో వారంలో 271 కోట్ల రూపాయలు రాబట్టలింది. దాంతో ఈ సినిమా తొలి రెండు రోజుల్లో 961 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక మూడో వారంలో కూడా అదే జోష్‌ను కొనసాగిస్తూ రికార్డులు బద్దలు కొడుతున్నది.

Dhurandhar The Revenge 19 Days Expected Box Office

ధురంధర్ 2 సినిమా 3వ వారంలో చేసిన అలజడి విషయానికి వస్తే.. 16వ రోజున 23 కోట్ల రూపాయలు, 17వ రోజున 27 కోట్ల రూపాయలు, 18వ రోజున 30 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మూడో వారాంతంలో ఈ సినిమా 80 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. దాంతో ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 1041 కోట్ల రూపాయలు నెట్, 1228 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. భారతీయ సినిమా చరిత్రంలో తొలి 1000 కోట్ల రాబట్టిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.

ఓవర్సీస్‌లో ఈ సినిమా సంచలనాల పరంపరను కొనసాగిస్తున్నది. ఇప్పటి వరకు ఓవర్సీస్‌లో ఈ చిత్రం 41.5 మిలియన్ డాలర్లు అంటే 385 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అమెరికా, కెనడాలో కలిపి 26 మిలియన్ డాలర్లు అంటే 242 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా విదేశీ బాక్సాఫీస్ వద్ద 400 కోట్ల రూపాయలు మేర వసూళ్లను సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక 19వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. 3వ సోమవారం కూడా రికార్డు స్థాయి కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉంది. ఈ చిత్రం ఇండియాలో తాజా సమాచారం ప్రకారం 10 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 12 నుంచి 13 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దాంతో ఈ సినిమా 1640 కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉంది అని పేర్కొన్నారు.

బాలీవుడ్ స్టార్ హీరోలు రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ నటించిన చిత్రం ధురంధర్ ది రివెంజ్. ఈ సినిమాకు ఆదిత్య ధార్ రచన, నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తించారు. యాక్షన్, స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు. ఈ చిత్రానికి వికాస్ నౌలాఖ సినిమాటోగ్రఫి, షాష్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్, శివకుమార్ వీ పానికర్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ధురంధర్ 1 చిత్రం డిసెంబర్ 5వ తేదీ 2025 రోజున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X