Dhurandhar2 25 Days Box Office: పుష్ప 2 మూవీ రికార్డుకు చేరువగా ధురంధర్ 2.. 25 రోజుల్లో ఎన్ని కోట్లంటే?

బాలీవుడ్ స్టార్ హీరోలు రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ నటించిన తాజా భారీ బడ్జెట్ చిత్రం దురంధర్. ఈ సినిమాకు ఆదిత్య ధార్ రచన, నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. యాక్షన్, స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు.

ఈ చిత్రానికి వికాస్ నౌలాఖ సినిమాటోగ్రఫి, షాష్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్, శివకుమార్ వీ పానికర్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమా రెండో భాగం మార్చి 19వ తేదీన రిలీజై బాక్సాఫీస్ వద్ద సునామీని క్రియేట్ చేసింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా గత 25 రోజులుగా బాక్సాఫీస్ వద్ద కురిపిస్తున్న కనక వర్షం వివరాల్లోకి వెళితే..

Dhurandhar 2 25 Days Box Office

ధురందర్ 2 సినిమాను ‌భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా కోసం వేసిన పాకిస్థాన్‌లోని కరాచీ సెట్‌ కోసం భారీగా ఖర్చు చేశారు. అయితే ఈ సినిమాను సుమారుగా 250 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ చిత్రం మొదటి భాగం 1300 కోట్లకుపైగా భారీ లాభాలను సంపాదించడం తెలిసిందే. ఇక ఈ సినిమా తొలి రోజు నుంచే రికార్డు వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తూనే ఉంది.

ధురంధర్ 2 సినిమా గత మూడు వారాల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి వారం 674 కోట్ల రూపాయల వసూళ్లను నమోదు చేసింది. రెండో వారంలో 263 కోట్ల రూపాయలను వసూలు చేసింది. మూడో వారంలో 110 కోట్లకుపైగా కలెక్షన్లను నమోదు చేసింది. దాంతో మూడు వారాల్లో ఈ సినిమా 1047 కోట్ల రూపాయలను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఆదిత్య ధార్ దర్వకత్వం వహించిన ఈ సినిమా నాలుగో వారంలో కూడా భారీ లాభాలతో దూసుకెళ్తున్నది. ఈ చిత్రం 23వ రోజున 8.4 కోట్ల రూపాయలను వసూలు చేసింది. 24వ రోజున 16 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. నాలుగో సండే రోజు 25వ రోజున 18 కోట్ల రూపాయలు రాబట్టింది. గత మూడు రోజుల్లో 42 కోట్ల రూపాయలను వసూలు చేసింది. గత 25 రోజుల్లో ఈ చిత్రం 1089 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ సినిమా వివిధ భాషల్లో కలెక్ట్ చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. హిందీలో 1000 కోట్లకుపైగా వసూలు చేసింది. కన్నడలో 130 కోట్ల రూపాయల రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల రూపాయలు, కేరళలో 19 కోట్ల రూపాయలు, తమిళనాడులో 37 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ధురంధర్ 2 సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం ఇప్పటి వరకు 1089 కోట్ల రూపాయల నెట్, 1300 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను ఇండియాలో వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో ఈ చిత్రం 415 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం ఇప్పటి వరకు 1715 కోట్ల రూపాయలు ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

భారతీయ సినిమా రంగంలో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాల వివరాల్లోకి వెళితే.. బాహుబలి 2 చిత్రం 1810 కోట్ల రూపాయలను, పుష్ప 2 చిత్రం 1742 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ప్రస్తుతం ధురంధర్ 2 చిత్రం పుష్ప 2 సినిమా నెలకొల్పిన అత్యధిక వసూళ్ల రికార్డును తిరగరాసి.. బాహుబలి రికార్డుకు చేరువ కావడానికి సిద్దమైంది. త్వరలోనే ఈ చిత్రం బాహుబలి 2 రికార్డును అధిగమించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X