Dhurandhar The Revenge Box Office: ధురంధర్ 2 సరికొత్త సంచలనం.. కల్కి, జవాన్, పుష్ప 2 రికార్డులు అవుట్

వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద ధురంధర్ ది రివెంజ్ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేస్తున్నది. ఈ చిత్రం సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ అత్యంత వేగంగా 1000 కోట్ల రూపాయలు వసూలు చేసిన సినిమాగా మరో చరిత్రను లిఖించింది. రణ్‌వీర్ సింగ్, ఆదిత్య ధార్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం విడుదలైన ప్రతీ సెంటర్‌లో వసూళ్ల పంటను పండిస్తున్నది. ఈ చిత్రం గత 9 రోజుల్లో వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? 10వ రోజు ఏ మేరకు వసూళ్లను కలెక్ట్ చేస్తుంది? అనే వివరాల్లోకి వెళితే..

ఇండియాలో ఫస్ట్ వీకెండ్ వసూళ్ల జైత్రయాత్రను కొనసాగించడమే కాకుండా 466 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ సినిమా సోమవారం 64 కోట్ల రూపాయలు, మంగళవారం 58 కోట్ల రూపాయలు బుధవారం 49 కోట్ల రూపాయలు, గురువారం 53 కోట్ల రూపాయలు వసూలు చేసింది. గత 8 రోజుల్లో ఈ చిత్రం 690 కోట్ల రూపాయల నెట్, 814 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని జియో స్టూడియో, బీ62 స్టూడియోస్ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి.

Dhurandhar The Revenge 9 days Box Office

దక్షిణాది రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. కర్ణాటకలో 80 కోట్ల రూపాయలు, నైజాంలో 44 కోట్ల రూపాయలు, ఆంధ్ర ప్రదేశ్‌లో 18 కోట్ల రూపాయలు, తమిళనాడులో 24 కోట్ల రూపాయలు, కేరళలో 13 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దక్షిణాదిలో ఈ సినిమా 180 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. దక్షిణాదిలో 200 కోట్ల రూపాయలు వసూలు చేసిన హిందీ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసేందుకు రెడీగా ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

దక్షిణాదిలో వివిధ భాషల్లో బాక్సాఫీస్ వద్ద వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. హిందీ వర్షెన్ 140 కోట్ల రూపాయలు, తెలుగు వెర్షన్ 27 కోట్ల రూపాయలు, తమిళ వెర్షన్ 13 కోట్ల రూపాయలు, కన్నడ వెర్షన్ 1 కోటి రూపాయలు, మలయాళం ఒక కోటి రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ పండితులు తెలిపారు.

ధురంధర్ 2 చిత్రం ఓవర్సీస్‌లో కలెక్షన్ల మోత మోగిస్తున్నది. ఈ చిత్రం నార్త్ అమెరికాలో వసూళ్ల జైత్రయాత్రను కొనసాగిస్తున్నది. అమెరికా, కెనడాలో కలిపి 17.4 మిలియన్ డాలర్లు అంటే.. భారతీయ కరెన్సీలో 165 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇతర దేశాల్లో కలిపి ఈ సినిమా 29 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో 274 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా కేవలం 8 రోజుల్లో 1088 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ సినిమా ఇప్పటి వరకు యానిమల్, పుష్ప 2, కల్కి 2898 ఏడీ సినిమా రికార్డులను తుడిచిపెట్టింది. ఈ చిత్రం ముందు 30 మిలియన్ల జవాన్, 32 మిలియన్ డాలర్ల ధురంధర్ 1, 35 మిలియన్ డాలర్ల పఠాన్ చిత్రం, 36.65 మిలియన్ డాలర్ల బాహుబలి 2 సినిమా రికార్డులు మిగిలి ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమా బాహుబలి 2 రికార్డును కూడా అధిగమించి.. ఓవర్సీస్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా ధురంధర్ 2 సరికొత్త చరిత్రను లిఖించేందుకు రెడీ అవుతున్నది.

ఇక 9వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ సినిమా శుక్రవారం కూడా భారీగా వసూళ్లను నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నది. ఈ చిత్రం 30 కోట్ల నుంచి 35 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్ల మైలురాయిని దాటేందుకు పరుగులు పెడుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X