Dhurandhar 2 Advance Booking: ధురంధర్ 2 మూవీ అడ్వాన్స్ బుకింగ్.. టాక్సిక్‌కు మించి వసూళ్లు

బాలీవుడ్ స్టార్ హీరోలు రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ నటించిన తాజా భారీ బడ్జెట్ చిత్రం దురంధర్. ఈ సినిమాకు ఆదిత్య ధార్ రచన, నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. యాక్షన్, స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు.

ఈ చిత్రానికి వికాస్ నౌలాఖ సినిమాటోగ్రఫి, షాష్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్, శివకుమార్ వీ పానికర్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే భారీ అంచనాలు పెంచుకొన్న ఈ చిత్రం డిసెంబర్ 5వ తేదీ 2025 రోజున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజై సంచలన విజయం సాధించింది. ఈ సినిమా రెండో భాగం మార్చి 19వ తేదీన మరోసారి సెన్సషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌ను 20 రోజుల ముందే ఓవర్సీస్‌లో ప్రారంభించారు. ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి వస్తున్న స్పందన ఏమిటి? అడ్వాన్స్ బుకింగ్ ఎలా కొనసాగుతున్నది అనే వివరాల్లోకి వెళితే..

Dhurandhar The Revenge Advance Booking Box Office

ధురంధర్ సినిమా ఇప్పటికే పార్ట్ 1 వచ్చి సంచలన విజయం సాధించింది. ప్రస్తుతం రెండో భాగం మరో సంచలనం క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నది. ఈ రెండు పార్టులు కలిపి మొత్తంగా 500 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ధురంధర్ పార్ట్ 1 సినిమా ఇప్పటికే 1400 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ధురంధర్ పార్ట్ 2 అంటే ధురంధర్ ది రివేంజ్ సినిమా కూడా భారీగా కలెక్షన్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వస్తున్నారు.

నార్త్ అమెరికాలో ధురంధర్ 2 సినిమా అడ్వాన్స్‌ బుకింగ్‌కు భారీగా స్పందన కనిపిస్తున్నది. ఈ సినిమా అడ్సాన్స్ బుకింగ్‌ను 115 లోకేషన్లలో ఓపెన్ చేశారు. దాదాపు 164 షోల కోసం బుకింగ్ మొదలైంది. ఇప్పటి వరకు 1000 టికెట్లు అమ్ముడుపోయాయి. తద్వారా ఈ సినిమా 15 వేల అమెరికన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 14 లక్షల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

అయితే ఈ సినిమాతోపాటు యష్ నటించిన టాక్సిక్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కూడా ప్రారంభమైంది. అయితే టాక్సిక్ కంటే ఎక్కువగా ఈ సినిమా కలెక్షన్లను నమోదు చేస్తున్నది. దానితో ఈ సినిమాపై ఉండే క్రేజ్ ఏమిటో చెప్పకనే బాక్సాఫీస్ చెబుతున్నది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X