Dhurandhar 3 Overseas Collections: ఓవర్సీస్‌లో ధురంధర్ 2 కలెక్షన్ల జైత్రయాత్ర.. ఎన్ని కోట్ల వసూళ్లంటే?

భారతీయ సినిమా రంగంలో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధురంధర్ ది రివెంజ్ చిత్రం ఊహకు అందని విధంగా వసూళ్ల రికార్డులను అధిగమిస్తున్నది. మార్చి 18న పెయిడ్ ప్రీమియర్లతో మొదలై 19 తేదీన అఫీషియల్‌గా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే రికార్డు వసూళ్లను రాబట్టింది. తొలి ఆటతోనే బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకొన్న ఈ చిత్రం వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరుగరాస్తున్నది. ఈ సినిమా నార్త్ అమెరికాలో నమోదు చేస్తున్న ప్రభంజనం వివరాల్లోకి వెళితే..

ధురంధర్ 1 సినిమా భారీ విజయం సాధించడంతో ధురంధర్ 2 చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. ఆడియెన్స్ నుంచి వస్తున్న డిమాండ్ మేరకు ఈ సినిమాను సుమారుగా 800 లొకేషన్లలో రిలీజ్ చేశారు. దాదాపు 2250 షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే కంటెంట్ లోడింగ్, ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తడంతో చాలా చోట్ల ప్రీమియర్లు, తొలి రోజు షోలు రద్దు కావడం, ఆలస్యంగా ప్రారంభం కావడం జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Dhurandhar The Revenge Day 1 Box Office

ధురందర్ 2 సినిమా ప్రీమియర్లకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను సుమారుగా 700 లోకేషన్లలో ప్రదర్శించిన షోలు రికార్డు వసూళ్లు నమోదు అయ్యాయి. ప్రీమియర్ల ద్వారానే ఈ సినిమా దాదాపు 2 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో సుమారుగా 9 కోట్ల రూపాయల మేర వసూళ్లను సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

నార్త్ అమెరికాలో ఈ సినిమా ప్రభంజనాన్ని తలపించింది. అమెరికా, కెనడాలో ప్రీమియర్లకు భారీగా కలెక్షన్లు నమోదు అయ్యాయి. యూఎస్‌లో 1.55 మిలియన్ డాలర్లు, కెనడాలో 450K డాలర్లు వసూలు చేసింది. ఇప్పటి వరకు అత్యధికంగా కలెక్షన్లు సాధించిన హిందీ వెర్షన్ చిత్రంగా ధురంధర్ 2 రికార్డు క్రియేట్ చేసింది. ఇక తొలి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. 950K డాలర్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా తొలి రోజు ముగిసే సమయానికి సుమారుగా 2.5 మిలియన్ డాలర్లు రాబట్టింది.

ఇక రెండో రోజు కూడా ఈ సినిమాకు అనూహ్యమైన స్పందన వ్యక్తమవుతున్నది. ఈ చిత్రం రెండో రోజు ముగిసే సమయానికి 3 మిలియన్ డాలర్లు వసూలు చేసే అవకాశం ఉంది. భారతీయ కరెన్సీలో రెండు రోజుల్లో 30 కోట్లకుపైగా కలెక్షన్లను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇదిలా ఉండగా, తాజా సమాచారం ప్రకారం.. నార్త్ అమెరికా, ఇతర దేశాల్లో కలిపి ఈ సినిమా సుమారుగా 5.5 మిలియన్ డాలర్లు అంటే.. సుమారుగా 51 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా వీకెండ్ వరకు ఈ దాదాపు 8 నుంచి 9 మిలియన్ డాలర్లు వసూలు చేయవచ్చని అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Read more about: aditya dhar box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X